సంక్షేమ కల్పనలో వివక్షత చూపని ప్రభుత్వం..జగనన్న అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

సంక్షేమ కల్పనలో వివక్షత చూపని ప్రభుత్వం..జగనన్న అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ హోరెత్తిన వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం

◆ సొంత బిడ్డలా ఆదరిస్తున్న ప్రజలు

వైయస్ జగనన్న అంటే నమ్మకమని.. చంద్రబాబు అంటే మోసం.. కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ అని.. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు తన పాలనను చూసి ఓటు వేయండి అని అడిగే దమ్ముందా అని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు ప్రశ్నించారు. 

బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి, రాఘవేంద్ర కాలనీ, బీజేపీ కాలనీ, బోయకొట్టాల, బద్రంపల్లి, గోవిందంపల్లి, జంతులూరు గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్యతో కలిసి గడపగడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.

గ్రామాల్లోని మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఆత్మీయ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో డ్యాన్స్ లతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందించిన మేలును వివరించారు. సంక్షేమం ఇలానే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కరపత్రాలు అందజేశారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికే తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ స్థాపన దిశగా జగనన్న ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వారి ప్రాణాలను కాపాడుకున్నారు కానీ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల్ని మోసం చేసేందుకు మాయమాటలు చెబుతున్నారన్నారు. ఇలానే సంక్షేమం, అభివృద్ధి కావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అందించిన పాలనను మెచ్చి టీడీపీ నుంచి వైసీపీ పార్టీ లోకి నాలుగు కుటుంబాలు చేరాయి.

బుక్కరాయసముద్రం మండలం భద్రంపల్లి గ్రామంలో టీడీపీ పార్టీకి చెందిన చెరుకూరి వెంకటేష్, చెరుకూరి వెంకట రాముడు, బుల్లె ఉపేంద్ర, బుల్లె రామాంజనేయులు ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి ఆకర్షితులమై వైసిపి పార్టీలోకి చేరుతున్నట్టు వారి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే చేస్తారని నమ్మకంతో రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్నను, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు చేసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టో పై హార్షం వ్యక్తం చేసి, పాలాభిషేకం చేసినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె రామలింగారెడ్డి పర్వతనేని శ్రీధర్ బాబు


NDA కూటమి ఆధ్వర్యంలో  నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఉమ్మడి మేనిఫెస్టో పై హార్షం వ్యక్తం చేసి, పాలాభిషేకం చేసినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు* 

 ఈ కార్యక్రమంలో లక్ష్మినారాయణ, పొడరాళ్ల రవీంద్ర,కేశన్న, s. నారాయణస్వామి, మాజీ ఎంపీపీ Sk వెంకటేష్, నారాయణస్వామి,ఓబుళపతి, భూసి, హరి, నరేంద్ర యాదవ్,చిత్తంబారి, రామకృష్ణ, రంగమ్మ, మల్లికార్జున తదితర టీడీపీ మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగనన్న హామీలకు తిరుగుండదు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. మెజార్టీతో గెలిపించండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

జగనన్న హామీలకు తిరుగుండదు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. మెజార్టీతో గెలిపించండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ ఓటమి భయంతోనే చంద్రబాబు అడ్డగోలు హామీలు

జగనన్న మాట ఇచ్చారంటే ఎంత కష్టమొచ్చినా నెరవేర్చి తీరుతారని, అలాంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

యల్లనూరు మండలం శింగవరం, ఎస్.కొత్తపల్లి, గొడ్డుమర్రి, చింతకాయమంద, కొడవండ్లపల్లి, ఆరవేడు, బుక్కాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి వీరాంజనేయులు చేపట్టారు.

ఇంటింటికి తిరుగుతూ.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో ఆయా కుటుంబాలకు జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..సంక్షేమ పథకాల తో పాటు అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు గుప్పిస్తున్నారని, గతంలో వారు చేసిన మంచిని వివరించి ఓటు అడిగే సత్తా ఆ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎలానూ గెలవలేనని గ్రహించి నోటికి వచ్చినట్లు అడ్డగోలు హామీలు ఇస్తున్నాడని వాటి ప్రజల నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నిన్నటిదాకా జగనన్న సంక్షేమం చేస్తుంటే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన ఆ పెద్దమనిషి, ఇప్పుడు అంతకుమించి సంక్షేమం చేస్తాననడం విడ్డూరంగా ఉందని చెప్పారు. జగనన్న చేయగలిగింది చెబుతారు, చెప్పింది తప్పకుండా చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉందని వివరించారు. ఇలాంటి గొప్ప సంక్షేమం మళ్లీ మనకి కావాలంటే రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, పర్వతనేని శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రం నందు ముమ్మర ప్రచారం..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో  టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, మండల టిడిపి కరాష్ట్రన్వీనర్ అశోక్ లు తో పాటు తదితర టిడిపి నేతలు టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,, ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మణ నారాయణ లో రెండు ఓట్లు సైకిల్ కి వేసి వేయించి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో , సూపర్ సిక్స్ పథకాలు పై ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పొడరాళ్ల రవీంద్ర, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సాకే రామకృష్ణ స్వామి ,లక్ష్మీనారాయణ, ఓబులపతి, రెడ్డిపల్లి నాయుడు, సిపిఎన్ ఎస్, బాబయ్య ,హరి, శేషయ్య, నరసింహులు, గంపాలు, రవి, నారాయణస్వామి, బాబావలి, రంగమ్మ, జుగును, టోపీ బాషా, పటేల్ బూసి, దాసి, తదితరులు పాల్గొన్నారు

తమ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ విస్తృత ప్రచారం చేస్తున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తుంపెర గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు గెలుపు కొరకు గ్రామం లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసశారు. ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని, ఎంపీ అభ్యర్థి గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని జగన్ సిద్ధం సభలన్నీ అబద్ధపు సభలు అని, మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల డబ్బులు కూడా సొంత పార్టీ ప్రయోజనాలకోసం జగన్ వినియోగించు కున్నారని, పేద కుటుంబాలు పండుగ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కానుకలు ఇచ్చేదని వాటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, అభివృద్ధి అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నపుడే అని కావున వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుందామని మన ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తద్వారా నిరుద్యోగ సమస్య ఉండదని ఆలం నరసానాయుడు గారు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

కష్టం విలువ తెలిసిన వ్యక్తిని.. ఆశీర్వదించండి..సేవకుడిగా పనిచేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

కష్టం విలువ తెలిసిన వ్యక్తిని.. ఆశీర్వదించండి..సేవకుడిగా పనిచేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ అబద్దాల పునాదులపై బాబు గాలిమేడలు

జగనన్న చెప్పారంటే.. చేస్తారని, చేయలేని పనులను ఆయన చెప్పరని శింగనమల వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, మాజీ ఏడిసిసి చైర్మన్ పామిడి వీరాంజనేయులు, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్నతో కలసి గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు నిర్వహించారు.

వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు, ప్రజలు గజమాల, శాలువాలతో సన్మానించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. రోడ్ షోలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను, ఎంపీ అభ్యర్థి అయిన శంకర్ నారాయణను మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వారు మాట్లాడుతూ.. మళ్లీ ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. అబద్దాల పునాదులపై గాలి మేడలు కట్టడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఓట్ల కోసం అలవి కాని వాగ్ధానాలు చేయకుండా, నిజాలు నిర్బయంగా చెప్పి, కచ్చితంగా తాను ఏమి చేయగలడో, అవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టిన గొప్ప నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడతారని ధ్వజమెత్తారు. 

జగనన్న పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకం అందించారన్నారు. ఎన్నికల హామీ నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని కొనియాడారు. నేడు సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి ప్రజలకు అందించేందుకు జగనన్న సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని, నియోజకవర్గ ప్రజలు తనను మెజార్టీతో గెలిపిస్తే.. సేవకుడిగా పనిచేస్తానని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నార్పల మండల కేంద్రంలో టిడిపి ఉమ్మడి అభ్యర్థులు బండారు శ్రావణి శ్రీ గారి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపు కోసం విస్తృత ప్రచారం

అనంతపురం జిల్లా శిoగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన శిoగనమల నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు ఇంటింటికి తిరుగుతూ, ఈ 5 సంవత్సరాల YCP ప్రభుత్వం

ఆరాచకాలను తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను* ప్రజలకు వివరించారు. అలాగే సాయంత్రం మెయిన్ రోడ్డు గాంధీ సర్కిల్ లో మీటింగ్ జరిగింది.ర్యాలీ నిర్వహించి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు..

కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .

ప్రజలకు మేలు చేసే జగనన్ననే ఎన్నుకుందాం.. మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు...

ప్రజలకు మేలు చేసే జగనన్ననే ఎన్నుకుందాం.. మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ కూటమి రాజకీయలను ప్రజలు నమ్మరు

◆ టిడిపి ఓట్ల కోసం నానా తంటాలు

కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే జగనన్ననే మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుందామని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

నార్పల మండలం బొమ్మకుంటపల్లి , బి.పప్పూరు, మంగపట్నం, సోదనపల్లి, గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా " కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలని అందుకు "ఫ్యాన్" గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు. 

ఆయన మాట్లాడుతూ..జగనన్న ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చే నాయకుడు జగనన్న ఒక్కరే అన్నారు. టిడిపి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మేనిఫెస్టోతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని దీన్ని అన్ని వర్గాల ప్రజలకు స్వాగతిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బిజెపి ఓట్ల కోసం నానా తండాల పడుతూ షోలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతమందితో వచ్చినా ఆయనను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పరు అనే విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. చేయలేని హామీలను చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడానికి టిడిపి సూపర్ సిక్స్ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు వారిని స్వాగతించడం లేదనే విషయం వారు తెలుసుకోవాలన్నారు. 2024 లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్రాన్ని మరింత సంక్షేమం అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపురం సంజీవపురం దయ్యాలకంటపల్లి బయన్నపేట గ్రామాల్లో టిడిపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం సంజీవపురం దయ్యాలకంటపల్లి బయన్నపేట గ్రామాల్లో పర్యటిస్తున్న శింగనమల నియోజకవర్గం టిడిపి (NDA) అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారు పర్వతనేని శ్రీధర్ బాబు గారు హనుమంతరెడ్డి గారుఅశోక్ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్న సందర్భంగా

  ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేన,బిజెపి మండల నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కాలనీ లో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు నిర్వహించారు.

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం అనంతరం ఎస్సీ కాలనీ లో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు నిర్వహించారు.

గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

సమావేశం అనంతరం గ్రామంలోనే బస చేశారు.