కష్టం విలువ తెలిసిన వ్యక్తిని.. ఆశీర్వదించండి..సేవకుడిగా పనిచేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
కష్టం విలువ తెలిసిన వ్యక్తిని.. ఆశీర్వదించండి..సేవకుడిగా పనిచేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ అబద్దాల పునాదులపై బాబు గాలిమేడలు
జగనన్న చెప్పారంటే.. చేస్తారని, చేయలేని పనులను ఆయన చెప్పరని శింగనమల వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, మాజీ ఏడిసిసి చైర్మన్ పామిడి వీరాంజనేయులు, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్నతో కలసి గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు నిర్వహించారు.
వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు, ప్రజలు గజమాల, శాలువాలతో సన్మానించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. రోడ్ షోలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను, ఎంపీ అభ్యర్థి అయిన శంకర్ నారాయణను మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వారు మాట్లాడుతూ.. మళ్లీ ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. అబద్దాల పునాదులపై గాలి మేడలు కట్టడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఓట్ల కోసం అలవి కాని వాగ్ధానాలు చేయకుండా, నిజాలు నిర్బయంగా చెప్పి, కచ్చితంగా తాను ఏమి చేయగలడో, అవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టిన గొప్ప నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడతారని ధ్వజమెత్తారు.
జగనన్న పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకం అందించారన్నారు. ఎన్నికల హామీ నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని కొనియాడారు. నేడు సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి ప్రజలకు అందించేందుకు జగనన్న సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని, నియోజకవర్గ ప్రజలు తనను మెజార్టీతో గెలిపిస్తే.. సేవకుడిగా పనిచేస్తానని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
May 01 2024, 07:23