ప్రజలకు మేలు చేసే జగనన్ననే ఎన్నుకుందాం.. మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు...
ప్రజలకు మేలు చేసే జగనన్ననే ఎన్నుకుందాం.. మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ కూటమి రాజకీయలను ప్రజలు నమ్మరు
◆ టిడిపి ఓట్ల కోసం నానా తంటాలు
కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే జగనన్ననే మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుందామని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
నార్పల మండలం బొమ్మకుంటపల్లి , బి.పప్పూరు, మంగపట్నం, సోదనపల్లి, గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా " కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.
ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలని అందుకు "ఫ్యాన్" గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఆయన మాట్లాడుతూ..జగనన్న ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చే నాయకుడు జగనన్న ఒక్కరే అన్నారు. టిడిపి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మేనిఫెస్టోతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని దీన్ని అన్ని వర్గాల ప్రజలకు స్వాగతిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బిజెపి ఓట్ల కోసం నానా తండాల పడుతూ షోలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతమందితో వచ్చినా ఆయనను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పరు అనే విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. చేయలేని హామీలను చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడానికి టిడిపి సూపర్ సిక్స్ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు వారిని స్వాగతించడం లేదనే విషయం వారు తెలుసుకోవాలన్నారు. 2024 లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్రాన్ని మరింత సంక్షేమం అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 30 2024, 06:50