ప్రజలకు మేలు చేసే జగనన్ననే ఎన్నుకుందాం.. మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు...

ప్రజలకు మేలు చేసే జగనన్ననే ఎన్నుకుందాం.. మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ కూటమి రాజకీయలను ప్రజలు నమ్మరు

◆ టిడిపి ఓట్ల కోసం నానా తంటాలు

కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేసే జగనన్ననే మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుందామని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

నార్పల మండలం బొమ్మకుంటపల్లి , బి.పప్పూరు, మంగపట్నం, సోదనపల్లి, గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా " కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలని అందుకు "ఫ్యాన్" గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు. 

ఆయన మాట్లాడుతూ..జగనన్న ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చే నాయకుడు జగనన్న ఒక్కరే అన్నారు. టిడిపి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మేనిఫెస్టోతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని దీన్ని అన్ని వర్గాల ప్రజలకు స్వాగతిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బిజెపి ఓట్ల కోసం నానా తండాల పడుతూ షోలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతమందితో వచ్చినా ఆయనను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పరు అనే విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. చేయలేని హామీలను చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడానికి టిడిపి సూపర్ సిక్స్ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు వారిని స్వాగతించడం లేదనే విషయం వారు తెలుసుకోవాలన్నారు. 2024 లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాష్ట్రాన్ని మరింత సంక్షేమం అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపురం సంజీవపురం దయ్యాలకంటపల్లి బయన్నపేట గ్రామాల్లో టిడిపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం సంజీవపురం దయ్యాలకంటపల్లి బయన్నపేట గ్రామాల్లో పర్యటిస్తున్న శింగనమల నియోజకవర్గం టిడిపి (NDA) అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారు పర్వతనేని శ్రీధర్ బాబు గారు హనుమంతరెడ్డి గారుఅశోక్ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్న సందర్భంగా

  ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేన,బిజెపి మండల నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కాలనీ లో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు నిర్వహించారు.

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం అనంతరం ఎస్సీ కాలనీ లో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు నిర్వహించారు.

గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

సమావేశం అనంతరం గ్రామంలోనే బస చేశారు.

వీర అన్న.. నీ వెన్నంటే ఉంటూ నిన్ను మన జగనన్నను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం.. అమ్మవారిపేట ఈశ్వరయ్య వారి బృందం

సింగనమల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ప్రచార కార్యక్రమంలో భాగంగా రెడ్డిపల్లి నందు ప్రచారం చేయుచుండగా అమ్మవారి పేట గ్రామానికి చెందిన ఈశ్వరయ్య వారి బృందం వీరాంజనేయులు కి సపోర్ట్ చేస్తూ అన్నా నీ వెంటే ఉంటూ జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే అంతవరకు చివరి వరకు పోరాడుతామని వారు పిలుపునిచ్చారు

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, చెన్నంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో, శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

జగనన్న తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేస్తారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, గుజ్జుల ఈశ్వరయ్య సాకే విజయ్ కుమార్ ఉజ్జల సుబ్రమణ్యం, ఉజ్జల భాస్కర్ గుజ్జుల బ్రహ్మయ్య గుజ్జల శివ దేవరకొండ రాజు సాకే కుల్లాయప్ప సాకే ఈశ్వరయ్య దేవరకొండ సుబ్రమణ్యం దేవరకొండ గణేష్ దేవరకొండ శ్రీకాంత్ దేవరకొండ వెంకటరమణ సాకే శ్రీనివాసులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు

◆ బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ప్రతి కుటుంబానికి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించి, అధికారంలోకి తీసుకురావాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, చెన్నంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో, శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న జనం మెచ్చిన నాయకుడని, మళ్లీ ఆశీర్వదించి, గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. టిడిపి నాయకుల మాయమాటలు విని మోసపోవద్దని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవమంటూ రాష్ట్రానికి ఏమి చేయలేదని విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు దాదాగిరి చేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు నామరూపాల్లేకుండా పోతాయని, పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని వివరించారు. అదే జగనన్న అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాయని గుర్తు చేశారు. జగనన్న చెప్పాడు అంటే చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అదే చంద్రబాబు నాయుడు చేయాడు అనే విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసున్నారు. 

జగనన్న తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేస్తారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థుల గెలుపు కొరకు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామo లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి ) ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేయజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. 

ఈ సందర్బంగా అలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రైతులు సాగు నీరు కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అని, జలయజ్ఞం పేరుతో రైతులను దారుణంగా వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది అని మండిపడ్డారు. ఈ వైసీపీ నాయకులకు రైతుల యోగక్షేమలు పట్టవని కేవలం తన స్వార్థ రాజకీయాలు, కుట్ర పూరిత రాజీకీయాలు కోసం పరితపిస్తూ రైతులను బలిపశువులను చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడచుసిన అవినీతి, అక్రమాలు, బెదిరింపులతో ప్రజలు విసిగిపోయినారు,జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది అని, ప్రజలకు స్వేచ్ఛ జీవుతాన్ని ఇస్తుంది అని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోని, ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని సైకో ముఖ్యమంత్రి చేతిల్లో నుంచి విముక్తి కల్పిద్దాం అని అన్నారు.

ఈ సందర్భంగా 6 భవిష్యత్తు గ్యారంటి పథకాల గురించి ప్రజలకు ఆలం నరసానాయుడు వివరించారు.ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పెనకచర్ల గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన టిడిపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం 

ఎన్నికల ప్రచారలో భాగంగా ఈరోజు పెనకచెర్ల గ్రామంలో పర్యటించి బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోవు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్న శింగనమల నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవ రెడ్డి గారు 

  ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి మండల నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనం కింద కుక్క దూరి ప్రమాదవశాత్తు బాలిక మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆలం నరసా నాయుడు

నార్పల క్రాసింగ్ సమీపనా నడిమిదొడ్డి గ్రామానికి చెందిన తండ్రి కూతుర్లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఉన్నట్టుండి ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.. దీంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందింది. ఝాన్సీ తండ్రికి గాయాలు కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.ఈ విషయo తెలుసుకున్న రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ దగ్గరకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పి వారికి 10,000 / రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమం లో నడిమిదొడ్డి టీడీపీ నాయకులు తలారి తిప్పన్న,వెన్నపూస చంద్రమోహన్ రెడ్డి,బొగ్గు నారాయణ స్వామి,బొగ్గు నాగర్జున,కర్వేపాకు నల్లప్ప,లోడుగు జగదీష్,బొగ్గు నాగశేషు,D రాము,N సూరి,N రామాంజి పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతి కోసమే మేనిఫెస్టో.. పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి. వీరాంజనేయులు

పేదల అభ్యున్నతి కోసమే మేనిఫెస్టో.. పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి. వీరాంజనేయులు

నార్పల మండలం గూగూడు గ్రామంలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం అనంతరం "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు నిర్వహించారు.

గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను స్వీకరించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందపరచిన నవరత్నాలను పలు సంక్షేమ పథకాల పెంపును ప్రజలకు వివరించారు. 

రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్న అయితే సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగుతూ, రెట్టింపు లబ్దిని చేకూర్చే విధంగా మేనిఫెస్టో విడుదల చేశారని మీరందరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రతి సమస్యను ఎమ్మెల్యే అయిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వారికి తెలిపారు.

సమావేశం అనంతరం గ్రామంలోనే బస చేశారు.

నాడు మాట ఇచ్చారు నెరవేర్చారు.. నేడు మాట ఇస్తున్నారు నెరవేరుస్తారు .. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

నాడు మాట ఇచ్చారు నెరవేర్చారు..

నేడు మాట ఇస్తున్నారు నెరవేరుస్తారు.

◆ జగనన్న అంటే అభివృద్ధి..చంద్రబాబు అంటే కరువు

◆ ఆత్మీయ పలకరింపులు.. అడుగడుగునా నీరాజనం

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

సంక్షేమ పథకాల సారథిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకుంటే.. చంద్రబాబు నాయుడు పేరు చెబితే వెన్నుపోటు, కరువు గుర్తుకు వస్తుందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు. 

నార్పల మండలం బొందలవాడ, రంగాపురం, జంగంరెడ్డిపల్లి, గూగూడు, మూగేతిమ్మంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు.

గ్రామాల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. టపాసులు కాల్చుతూ, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. గడపగడపకు తిరుగుతూ, జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల పెంపును ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా మరోసారి జగనన్నను చేసుకుంటే మరింత సంక్షేమాన్ని అందిస్తారని వివరించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో పేద ప్రజల అభ్యున్నతికి మరింత సంక్షేమాన్ని చేకూరే విధంగా ఉందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. అదే బాటలో 2024లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేరుస్తారన్నారు. రెండు విడతల్లో పెన్షన్ రూ.3000 నుంచి రూ.3,500 వరకు పెంపు, వైయస్సార్ రైతు భరోసా సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతూ, ఏటా రూ. 16 వేల చొప్పున ఐదేళ్లలో రైతులకు ఒక్కొక్కరికి రూ.80వేలు చొప్పున సాయం చేయనున్నారు. ఇలా సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా మేనిఫెస్టోని రూపొందించడం పట్ల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. 

జగనన్న మాట ఇచ్చారు అంటే చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు నెరవేర్చని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరడం ఖాయం జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.