వీర అన్న.. నీ వెన్నంటే ఉంటూ నిన్ను మన జగనన్నను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం.. అమ్మవారిపేట ఈశ్వరయ్య వారి బృందం
సింగనమల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ప్రచార కార్యక్రమంలో భాగంగా రెడ్డిపల్లి నందు ప్రచారం చేయుచుండగా అమ్మవారి పేట గ్రామానికి చెందిన ఈశ్వరయ్య వారి బృందం వీరాంజనేయులు కి సపోర్ట్ చేస్తూ అన్నా నీ వెంటే ఉంటూ జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే అంతవరకు చివరి వరకు పోరాడుతామని వారు పిలుపునిచ్చారు
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, చెన్నంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో, శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.
ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
జగనన్న తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేస్తారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, గుజ్జుల ఈశ్వరయ్య సాకే విజయ్ కుమార్ ఉజ్జల సుబ్రమణ్యం, ఉజ్జల భాస్కర్ గుజ్జుల బ్రహ్మయ్య గుజ్జల శివ దేవరకొండ రాజు సాకే కుల్లాయప్ప సాకే ఈశ్వరయ్య దేవరకొండ సుబ్రమణ్యం దేవరకొండ గణేష్ దేవరకొండ శ్రీకాంత్ దేవరకొండ వెంకటరమణ సాకే శ్రీనివాసులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 29 2024, 07:09