పేదవాడి గెలుపు..భుజాలపై.. పేదల భవిష్యత్ కు పునాదులు వేసిన వైఎస్ జగనన్న.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
పేదవాడి గెలుపు..భుజాలపై.. పేదల భవిష్యత్ కు పునాదులు వేసిన వైఎస్ జగనన్న.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ ఎన్ని కూటములొచ్చిన మళ్ళీ జగనన్నే సీఎం
◆ నియోజకవర్గంలో టీడీపీ ఎన్ని జిమ్మికులు చేసిన వైసిపి జెండా ఎగరడం ఖాయం.
నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును గ్రామాల్లో గెలుపు లక్ష్యంగా అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతూ..తనను భుజాలపై ఎత్తుకుంటున్నారు.
రాష్ట్రంలో పేదల బంగారు భవిష్యత్ కు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునాదులు వేశారని, మరొక అవకాశం ఇస్తే, ఆ పునాదుల మీద బహుళ అంతస్తుల సౌదాన్ని నిర్మిస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
పుట్లూరు మండలం కడవకల్లు, సంజీవపురం, ఓబులాపురం, దోసలేడు, చెర్లోపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా " కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్యతో కలసి ఆయన నిర్వహించారు.
పార్టీ శ్రేణులు శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా అందరినీ ప్రకటిస్తూ, జగనన్న పాలనలో ప్రజలకు చేసిన సంక్షేమాన్ని, గత టీడీపీ పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. మళ్లీ ఇలాంటి గొప్ప సంక్షేమం పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తను మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నవరత్నాలతో ఓ పక్క పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తూనే మరోపక్క ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారని వివరించారు. పేదలకు విద్య వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇస్తున్నారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు పెంపునకు సీఎం జగనన్న గట్టి పునాదులు వేశారని, పేదల అభ్యున్నతి గిట్టని ప్రతిపక్షాలు జగనన్న వేసిన పునాదులు కూల్చివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా పెత్తందారి పార్టీలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో పేదలంతా జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు.
టిడిపి ఎన్ని కూటములతో వచ్చినా జగనన్న వైపు ప్రజలు ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఐదేళ్లలో కనిపించని టిడిపి అభ్యర్థి ఎన్నికల సమయం అయ్యేసరికి ఓట్ల కోసం ఇంటి వద్దకు వస్తున్నారన్నారు. ఓటమి భయంతో నానా తంటాలు పడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో జగనన్న సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారన్నారు. నియోజకవర్గంలో టిడిపికి ఓటమి తప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 28 2024, 07:48