భద్రాచలం: చర్ల: ఈ నెల 16న జరిగే గ్రామీణ బంధును విజయవంతం చెయ్యాలని MEO కు వినతి పత్రం సమర్పించిన PYL
భద్రాచలం: చర్ల: ఈ నెల 16న జరిగే గ్రామీణ బంధును విజయవంతం చెయ్యాలని MEO కు వినతి పత్రం సమర్పించిన PYL
పారిశ్రామిక సమ్మెకు పి డి ఎస్ యు పివైఎల్ సంపూర్ణ మద్దతు.తెలియజేస్తుంది
ఈనెల 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకు మద్దతుగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU),ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామము దానిలో భాగంగానే విద్యాసంస్థల బంద్ కు సహకరించాలని స్థానిక మండల విద్యాధికారి MEO గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది.
అనంతరం చిరిగిడి నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిఓఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ మాట్లాడుతూ రైతుల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 14 నెలలు ఢిల్లీలో వీరోచిత పోరాటం చేసి రైతుల వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టిన ఘనత రైతులకు ఉన్నదని తిరిగి నరేంద్ర మోడీ మళ్ళీ ఆ చట్టాలను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని, కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబరు కోడ్లను రద్దు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మహిళలను రక్షించాలని నూతన విద్య విధానం 2020 ను రద్దు చేయాలని యువకులని పక్కదోవ పట్టించే మద్యపానంపై కట్టడి చర్యలు చేయాలని కులం మతం పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ మతోన్మాదం ని పెంచి పోషించడాని వ్యతిరేకించాలని దానిలో భాగంగానే విద్యార్థి యువకులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిరిగిడి నరేష్ రాజు రమేష్ బాలరాజు రాజేష్ సమ్మయ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు
Feb 11 2024, 10:33