Crimejournalist

Feb 11 2024, 05:33

పోలీసు కళాఘఙబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ 10 ఫిబ్రవరి):- గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్  గ్రామంలో" పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు.ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్(సిఐ) సైదా మాట్లాడుతూ మూఢనమ్మకాలు నమ్మవద్దు,ఈ టెక్నాలజీ ప్రపంచంలో భానుమతి వాళ్లు చేశారు, వీళ్ళు చేశారు అంటే నమ్మవద్దు ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చూపించుకోవాలి,

చిన్నచిన్న తగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

జిల్లాలో చిన్న పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగులు వచ్చినాయని సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నారు, అలాంటి వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ప్రవేశించలేదని, గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనాఅనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సంఘవిద్రోహశక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా బ్యాంకు వివరాలు ఏటీఎం కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు.వాట్సప్ కు మరియు ఫోన్ కు ఎలాంటి మెసేజ్ వచ్చిన ఓపెన్ చేయవద్దు స్పందించవద్దని తెలిపారు.

ప్రభుత్వం పెండింగ్ చాలాన్ లపై రహితీ ప్రకటించినందున చాలా పెండింగ్ ఉన్న వాహనదారులు తేదీ: 15-02-2024 వరకు ప్రభుత్వము గడవు విధించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

15వ తేదీ తర్వాత ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులను గుర్తించి మొత్తం డబ్బులు కట్టించడం జరుగుతుంది

పోలీస్ కళా బృందం కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా మూఢనమ్మకాల పై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి, 

మరియు వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి పాటల ద్వారా, సిడిల ద్వారా కళాబృందం సభ్యులు బాలు, రాజు, రవీందర్, తిరుమల, పాటల రూపంలో మరియు నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరిచినారు.చిన్నచిన్న ఆస్తి తగాదాలకు పోయి ప్రాణాలు తీసుకోవద్దని ఆలోచించకుండా క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయని ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పరిష్కారం కాని సమయంలో పోలీస్ స్టేషన్ కు రావాలని  ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మనిషి కక్షలు కారుణ్యాలతో ఏ పని చేయవద్దని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, కాల్ చేయాలని సూచించారు.

ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR పోర్టల్ (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా అట్టినెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, దాని గురించి తెలియని వారు మీ సేవ కేంద్రంలో లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, గ్రామ కారోబర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 11 2024, 05:06

మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(కొండపాక 10 ఫిబ్రవరి):- మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి.అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి గ్రామంలో చిట్యాల రాములు,రవీంద్ర నగర్ విశ్వనాధ్ పల్లి గ్రామంలో గొడుగు దేవవ్వ కు ఈ ముగ్గురికి ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ "చిట్టి దేవేందర్ రెడ్డి,మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ,గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Crimejournalist
     @Crimejournalist  
Crimejournalist

Feb 11 2024, 04:42

గజ్వేల్ పట్టణంలో ఉన్న పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఏసిపి రమేష్

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ 10 ఫిబ్రవరి):- జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) గజ్వేల్ పట్టణంలో ఉన్న పరీక్షా కేంద్రాలను సందర్శించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు.పరీక్షా కేంద్రం చుట్టుపక్కల 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ గుమి కూడా వద్దని సూచించారు.

Crimejournalist

Feb 11 2024, 04:28

విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి యాంటీ హ్యూమన్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించిన షీటీ

రాంసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన తొగుట సిఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, గజ్వేల్ షీటీమ్ బృందం

 సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి

 అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు

జిల్లాలో పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాకు వచ్చినారని సోషల్ మీడియాలో షికార్లు పుకార్లు వస్తున్నాయి అలాంటి గ్యాంగ్ లు ఏమీ లేవు

గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(రాయపోల్ 10 ఫిబ్రవరి):- ఈ సందర్భంగా తొగుట సిఐ లతీఫ్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు

షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థులు యొక్క గోల్ గురించి. అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడినఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100,, సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 

9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయొద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ రఘుపతి, స్కూల్ హెడ్మాస్టర్ సత్యనారాయణ రెడ్డి, అధ్యాపకులు, గజ్వేల్ షీటీమ్ సిబ్బంది శ్రీరాములు, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, కానిస్టేబుళ్లు మహేష్, రామచంద్రారెడ్డి. రాయపోల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, కానిస్టేబుళ్లు స్వామి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 11 2024, 04:11

వ్యభిచార గృహం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి*

గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమానురాలు ఒకవిటుడు, ఒక మహిళను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ 10పిబ్రవరి ) :- గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్ లో ఒక మహిళ హసీనా భర్త ఇస్మాయిల్, తన ఇంటిలో వేరే ఆడవారిని తీసుకొని వచ్చి వ్యభిచారం చేయుచున్నదని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది వెళ్లి దాడి చేసి నిందితుడు ముట్ట గణేష్ తండ్రి నర్సింలు, గ్రామం తునికి మండలం ములుగు అతనిని మరియు ఒక మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 500 రూపాయలు 16 కండోమ్స్, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వ్యభిచార గృహ నిర్వాహకురాలు, మరియు విటుడు, విటురాలను గజ్వేల్ పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో పట్టణాలలో గ్రామాలలో కానీ ఇతర ప్రదేశాలలో సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, జూదం, పేకాట, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారమున్న, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Crimejournalist

Feb 11 2024, 03:56

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారతరత్న ప్రకటించిన సందర్భంగా అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన పీవీ సేవా సమితి

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సందర్బంగా అయోధ్య బాల రాముడుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ప్రధాని నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపిన సామజిక కార్యకర్త, పివి సేవాసమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు•

[Streetbuzz News Crime journalist]

(ఉత్తరప్రదేశ్  ఫిబ్రవరి10):- ;(అయోధ్య ధామ్ / శ్రీరామ జన్మభూమి ) :- భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న ప్రకటించిన సందర్బంగా ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు శనివారం అయోధ్య లో కొలువుదీరిన బాల రాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 2004 పీవీ మరణాంతరం నుండి నేటి వరకు పివి జయంతి, వర్ధంతిని ఏంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పీవీ పేరుతో పండ్లు, బ్రేడ్ ,రక్తదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాలు రాయడం వంటి కార్యక్రమాలు చెయ్యడం జరిగిందని తెలిపారు.పీవికి భారతరత్న ఇవ్వాలనీ 2018 లో సైకిల్ యాత్ర మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చేతుల మీదుగా జెండా ఊపి ఉద్యమానికి నాంది పలకాలని దృడ సంకల్పంతో ముందుకు సాగాము . వంగర నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి 2019 డిసెంబర్ 27న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి పీవీ కి భారతరత్న ఇవ్వాలనీ వినతిపత్రం సమర్పించామని అన్నారు. పీవీ శతజయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహించగా 2020 జూన్ 28న, పీవీ నరసింహారావు కాలనీ (కోహెడ మండలం, వెంకటేశ్వర్లపల్లి గ్రామం లో ), పీవీ మార్గ్ కోహెడ నుండి హుస్నాబాద్ రోడ్డు కీ నామకరణం చేస్తూ గ్రామంలో ప్రతి నెల పేదవారికి, శుభకర్యాలకు 50కిలోల బియ్యం పంపిణీ చేస్తూ పీవీ పై భక్తిని చాటుకునేవాడిని ,గత ఇరవై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ఫలించిన సంతోషంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నాయకత్వంలో అయోధ్య బాల రాముడిని దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని రాజు ఆనందం వ్యక్తం చేశారు. పీవీ కి మరియు మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పీతామాహుడు ఏం ఏస్ స్వామినాథ్ లకు భారతరత్న ప్రకటన పట్ల భారత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు,ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువత అధ్యక్షులు కోహెడ మండల అధ్యక్షులు కంది సత్యనారాయణ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కొత్త పల్లి అశోక్, ఆవుల సంపత్, నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, నీలం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 11 2024, 00:17

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం - ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ

[Streetbuzz News Crime journalist]

తెలంగాణ రాష్ట్రం:

(సిద్దిపేట 10పిబ్రవరి):- తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.8% మాత్రమే కేటాయించింది అంటే విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 2,296 కోట్లు విద్యారంగానికి పెరిగినట్లు ఉన్నా మొత్తం బడ్జెట్ పోల్చినప్పుడు పెరిగింది, ఇది చాలా తక్కువ, గత విద్యారంగ బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 1.31 % మాత్రమే పెంచారు. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య యే మాత్రం అభివృద్ధి కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పినా కేటాయించింది 500 కోట్ల రూపాయలు మాత్రమే, 500 కోట్లతో ఎలా వీటిని నిర్వహిస్తారని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ,భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా కు 1000కోట్లు ,మహిళ యూనివర్శీటీఅభివృద్ధి కోసం నిధులు నిర్వహణ, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే సిద్దిపేట జిల్లా లో గత ప్రభుత్వం మినీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపు లేదు ? ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం 500కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ, అగ్రికల్చర్ యూనివర్శీటీ, వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు.,తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు?

- పాఠశాల విద్యారంగ లో ఖాళీలు భర్తీ ,మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు ,మౌళిక సదుపాయాలు కోసం ఈ నిధులు సరిపోవని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది.

గురుకులాలు నిర్మాణం కోసం 1546కోట్లు కూడా సరిపోవని 800 పైగా గురుకూలాలకు స్వంత భవనాలు లేవని, ఉన్న గురుకులాలు కూడా సరైన మౌళిక సదుపాయాలు లేవు.ఈబడ్జెట్లో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ 7200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి విడుదల కోసం నిధులు కేటాయించలేదు? గురుకులాలు, కెజిబివిలు, సంక్షేమ వసతిగృహలకు గత సంవత్సరం నుండి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. వాటి నిధులు గురించి కూడా ప్రస్తావన లేదు. అందుకే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 7.8% నిధులు మాత్రమే కేటాయించారు. నిధులను పెంచి‌ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. లేకపోతే విద్యార్థులను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఎస్ఎఫ్ఐ తెలిపింది.ఈ కార్యాక్రమంలో SFI సిద్దిపేట జిల్లా కమిటీ

రెడ్డమైన అరవింద్

జిల్లా అధ్యక్షుడు

దాసరి ప్రశాంత్,

SFI జిల్లా కార్యదర్శి

(9652946701) పాల్గొన్నారు.

Crimejournalist

Feb 11 2024, 00:02

ఆదివారం హుస్నాబాద్ లో జరగవలసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమావేశాలు రద్దు

[Streetbuzz News Crime journalist]

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనవి. 

సిద్దిపేట జిల్లా:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తేదీ 11-2-2024 ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరగాల్సిన మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి సమావేశాలు అనివార్య కారణాల వల్ల రద్దు కావటం జరిగింది. మళ్ళీ తిరిగి సమావేశాల తేదీ ప్రకటిస్తామని తెలియ జేస్తున్నామని తెలిపిన సమాచార నిమిత్తం గౌరవ తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి గారి కార్యాలయం.

Crimejournalist

Feb 10 2024, 07:29

AP NEWS: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం


[Streetbuzz News Crime journalist]

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో మినీలారీ, కావేరి ట్రావెల్స్ బస్సుని ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జైంది. ఇద్దరు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. తీవ్రగాయాలైన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది

Crimejournalist

Feb 10 2024, 07:00

ఇదేమన్న...కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకున్నవా.- జగ్గారెడ్డి*

[Streetbuzz News Crime journalist]

మా ప్రభుత్వం కూల్చితే కూలాడానికి..మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా.? 

అంతర్యుద్ధం మా పార్టీలో కాదు...హరీష్ తో మీ పార్టీలోనే వస్తోంది చూసుకో..! 

కామారెడ్డి లో తోపు అనుకున్న కేసీఆర్ ఎందుకు తుస్సు అన్నాడో మొదలు సమాధానం చెప్పు 

ప్రశాంత్ రెడ్డి 

 ప్రోటోకాల్ విషయంలో BRS ప్రభుత్వం దారిలోనే మేము.

 జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు 

ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరం డబ్బులు ఉన్నాయి 

60 కోట్లు పంచి గెలిచాడు 

నా దగ్గర 60 కోట్లు ఉంటే పట్ట పగలు చుక్కలు చూపెట్టే వాణ్ణి 

మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అభ్యర్థి గెలిచాడు 

పేద ప్రజలను మభ్య పెట్టి 

మీ అభ్యర్థి గెలిచాడు 

నా దగ్గర 60 కోట్లు ఉంటే మీకు డిపాజిట్ వచ్చేది కాదు

మీ కాళేశ్వరమే.. ఇద్దరు ENC ల సస్పెన్షన్ వరకు వచ్చింది 

ప్రశాంత్ రెడ్డి..నీ బుర్రకు ఇప్పుడైనా ఎక్కిందా..? 

ఉత్తమ్..జగ్గారెడ్డి..రేవంత్..

శ్రీదర్ బాబు..జీవన్ రెడ్డి లాంటి వాళ్ళం టార్గెట్ లీడర్స్ ఉన్నాం

మీ దగ్గర కాళేశ్వరం ఉండే.. మా దగ్గర ఏముంది అప్పులు తప్పా.

హరీష్ నల్లధనం ఎక్కడ పెట్టారో సీఎం కి చెప్తా

లెక్కలు బయటకు రావాలి 

9 ఏండ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ కామారెడ్డి లో ఎందుకు ఓడిపోయారు..?

 కేసీఆర్ తోపు అంటారు కదా.. తోపు ఎందుకు తుస్సు అయ్యాడు 

 ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పు 

ఎదుటి వాడు ఏమంటారో ఆలోచించి మాట్లాడు ప్రశాంత్ 

ఎక్కువ మాట్లాడితే.. అన్నీ బయటకు తిస్తాం

మీ దగ్గర MLA లు.. సీఎం ని కలిసే వాళ్ళా 

కేటీఆర్..హరీష్ దగ్గరికి పోయే వాళ్ళు 

మీ MLA లు మా దగ్గరికి వస్తే సీఎం ని కలుస్తారు 

మల్లారెడ్డి కూడా మా దగ్గరకు రావచ్చు 

 ఇప్పుడు ఆయన మాట్లాడటం లేదు కదా 

20 మంది MLA లు వచ్చి తీరుతారు 

మా ప్రభుత్వం ను పడేస్తాం అంటున్నారు మీరు .. 

అందుకే 20 మంది MLA లు వస్తున్నారు

మా ప్రభుత్వాన్ని కూల్చడం అంటే... కూలి పోయే కాళేశ్వరం కట్టినట్టు అనుకుంటున్నవా 

నాసిరకం సిమెంట్ తో కట్టినట్టు కాదు 

130 ఏండ్ల పునాది కాంగ్రెస్ ది 

మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి 

జగ్గారెడ్డి కి పదవులు అవసరం లేదు 

నేను కాంగ్రెస్ కి ఆయుధం 

ఆయుధం కి పదవులు అవసరం లేదు 

మీకు పోస్టులు ఉంటేనే లీడర్స్  

నాకు బ్యాక్ గ్రౌండ్ లేకుండా లీడర్ అయ్యా 

జగ్గారెడ్డి ఒక బ్రాండ్ 

మీలెక్క ఎవరో పేరు చెప్పి నాయకుడిని కాలేదు

అంతర్యుద్ధం మా దగ్గర కాదు.. మీ పార్టీలో జరిగి తీరుతుంది 

 మీ పార్టీ లో కేసీఆర్ కి వెనక నుండి గడ్డపార గుచ్చాడానికి హరీష్ సిద్ధంగా ఉన్నాడు

రెండు నెలల్లో 15 కోట్ల మంది మహిళలు RTC బస్సు లో తిరిగారు 

535 కోట్లు మహిళల ఉచిత ప్రయాణం కోసం ఖర్చు చేసింది

 మాతో యుద్ధం కి రావడానికి ముందు ముస్లిం లకు ఇస్తాం అన్న 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారా..? 

ST ల రిజర్వేషన్లు ఏమైంది..?

నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు 

దానిమీద రాజకీయ దాడి చేస్తాం 

మేము ఊరుకుంటామా 

మేము చేస్తుంటే మీరు బురద జల్లుతున్నారు 

మీరు చేయని పనుల పై మేము కూడా నిలదీస్తాం 

మా పార్టీ కార్యకర్తలు కూడా నిలదిస్తారు

ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని BRS అంటుంది 

రాజకీయంగా మీరు మాకు నేర్పిన విద్య 

 మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాం 

 ప్రోటోకాల్ లో మీరు వేసిన దారిలోనే మేము

. మీరు 9 ఏండ్లు మాకు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టము 

మీ అంత మూర్ఖులం మేము కాదు 

మీరు మమ్మల్ని పోలీసులతో గడ్డపార తో పొడిచినట్టు పొడవం.. సూదితో పొడుస్తాం 

కాంగ్రెస్ కి ఎంత చేత నవుతుందో మీరే చూస్తారు 

ప్రశాంత్ రెడ్డి కి ఏం తెలుసు.. కేసీఆర్ రాసిన స్క్రిప్టు చడవడమే కదా..?

రేవంత్ కి చెప్తున్నా.. 

బీజేపీ వాళ్ళు..BRS కి ఏదో ఒకటి చేయండి అని లేపుతారు 

మా జాగ్రత్తలు మాకు ఉంటాయి