TS: నల్లగొండ:35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన
35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన ..
35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు పట్టణంలోని యన్.జి కళాశాల,పుల్లారెడ్డి స్వీట్స్ హౌస్,కోర్టు చౌరస్తా మీదిగా క్లాక్ టవర్ వరకు సుమారు 100 మంది ఆటో డ్రైవర్ల తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఇంఛార్జి డిఎస్పీ లక్ష్మినారయణ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షితంగా గమ్య స్థానాలను చేరుకోవాలని సూచించారు.ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని ఏదైన ప్రమాదం జరిగిన నప్పుడు ఎంతో రక్షణ కల్పిస్తుందని అన్నారు. ట్రిపుల్ రైడింగ్,ఓవర్ స్పీడ్,సీట్ బెల్ట్ దరించాలని పలు సూచనలు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ డానియల్, టు టౌన్ సిఐ కొండల్ రెడ్డి, ఏ.యస్.ఐ ఫరీద్,ట్రాఫిక్ సిబ్బంది మరియు ఆటో డైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Feb 09 2024, 17:27