పెండింగ్ చలాన్ వున్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వ రాయితీని తేది 15-02-2024 వరకు సద్వినియోగం చేసుకోండి -గజ్వేల్ ఏసిపి రమేష్
![]()
[Streetbuzz News Crime Journalist]
సిద్దిపేట జిల్లా:
•15వ తేదీ తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులను గుర్తించి మొత్తం డబ్బులు కట్టించడం జరుగుతుందని కావున ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి .ఈ అవకాశం వాహనదారులు 15వ తేదీ చివరి రోజు కావున వాహనదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన యం. రమేష్, గజ్వేల్ ఏసిపి.
(గజ్వేల్ నియోజకవర్గం):- ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ గజ్వేల్ డివిజన్ పరిధిలో ఈ-చలాన్ పెండింగ్ వున్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీరాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ-చాలన్ డబ్బులు పెండింగ్ ఉన్న వాహనదారులు ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ డబ్బులు చెల్లించాలి.
ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలి.
ఆన్లైన్ అనగా ఫోన్ పే & పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు.లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చు.
[తేదీ: 15-02-2024 వరుకు ట్రాఫిక్ చాలన్ లకు రాయితీ వర్తిస్తుంది]
ద్విచక్ర వాహనలకు 80% శాతం రాయితీ ,ఆర్టీసీ బస్సులు ఆటోలకు, తోపుడు బండ్లపై 90% శాతం రాయితీ,నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితీ.
చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి
echallan.tspolice.gov.inతెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.ఈ-చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 15-02-2024 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని సూచించారు.ఫిబ్రవరి,15 తారీకు తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ-చాలన్ పెండింగ్ వాహనదారులను గుర్తించి పెండింగ్ ఉన్న మొత్తం డబ్బులను కట్టించడం జరుగుతుందని ఏసిపి ఒక ప్రకటనలో తెలిపిన యం. రమేష్అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజ్వేల్.







ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రైవేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ లు పంపిణీ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ త్యాగాల తల్లి మాతా రామా భాయి కోట్లాది ప్రజల హక్కులు కోసం అంబేద్కర్ చేసిన పోరాటాలకి ఏ మాత్రం ఆటంకం కలిగించ కుండా పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించి,అన్ని విధాలా అంబేద్కర్ కి అండగా ఉండి ఎంతో కఠినమైన పేదరికాన్ని అనుభవించి తన బిడ్డల అనారోగ్యానికి మందులు కొనటానికి డబ్బులు లేక వైద్యం ఇప్పించలేక తన ముగ్గురు కొడుకులను కన్నా ఒక్క కుమార్తెను కోల్పోయి తను కూడా అనారోగ్యంతో వైద్యానికి డబ్బులు లేక చనిపోతూచావులు నాకు కొత్త కాదు ఇప్పటికే ముగ్గురు కొడుకులను ఒక కుమార్తెను కోల్పోయాను. నా ఆరోగ్యం కూడా క్షీణించింది కనీసం మిగిలిన ఒక్క కుమారుడనైన మంచిగా చూడు అని తన భర్త అంబేద్కర్ కి లేఖ వ్రాసి ప్రాణాలు విడిచిన త్యాగాల తల్లి మాత బాయీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సుతారీ కనుకయ్య, కాంటాస్టేడ్ ఎమ్మెల్యే మరాఠీ మణిదీప్, కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు పద్మారెడ్డి, గంగాధర్ రమేష్, తిరుపతి, బుమయ్య, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.




Feb 08 2024, 07:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.4k