ఫిబ్రవరి 16దేశవ్యాప్త కార్మికులసమ్మె, గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ
బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ఎంగడదాం! హమాలీ వెల్ఫేర్ బోర్డు సాధనకై ఐక్యంగా పోరాడుదాం!! *దేశవ్యాప్త సమ్మె-గ్రామీణభారత్ బంద్ ను జయప్రదం చేద్దాం - అమ్ముల బాలనర్సయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు
[Streetbuzz News Crime journalist]
సిద్దిపేట జిల్లా:
(ఉమ్మడి కొండపాక 07-02-2024) :- కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ,కార్మికుల విధానాలను వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటికి వెళ్లి బుధవారం రోజు మాత్ పల్లి, తిప్పారం తిమ్మారెడ్డిపల్లి గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేశారు.ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదంచేయాలని సిఐటియు, రైతు,వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు.ఈ సంద్బంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికొచ్ఛి 10సం.లు పూర్తయిన కార్మికవర్గ,రైతాంగ,వ్యవసాయ కార్మికుల,ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్మికులకు,రైతులకు ఇచ్చిన హామీలు చేయకపోగా కార్మికవర్గం దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చేందుకు.ఈ కొడ్స్ అమల్లోకి వస్తే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు కనీస వేతనాలు నిర్ణయించి హక్కు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం తెచ్చిన 2008 సామాజిక భద్రత చట్టాన్ని అటకెక్కించిందన్నారు.4 కొడ్స్ తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు.వామపక్ష పార్టీల పోరాటల ఫలితంగా వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. గ్రామీణ పేదలకు ఉన్న ఉపాధికి బడ్జెట్ తగ్గించారు. 200రోజులు పని కల్పించి, రోజు కూలీ రూ.600లు ఇవ్వాలనే డిమాండును ఖాతరు చేయటం లేదన్నారు..రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు.రైతు వ్యతిరేక 3 చట్టాల తెచ్చిన సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు.ఇప్పటికైన అన్ని రకాల కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26000/- వేలు ఇవ్వాలని,హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేసి సంక్షేమ పథకాలు అమలుచేయాలని 50 సంవత్సరాలు పైబడిన హమాలీలకురూ.10000/-లు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ పరిస్థితుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,రైతాంగ,ప్రజా వ్యతిరేకవిధానాలు,మతతత్వ ధోరణులకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ లో రైతులు,వ్యవసాయ కార్మికులు, కార్మికులు లక్షలాదిగా పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మర్కుకు పోశయ్య భోగి సాయికుమార్ ఫొటోల నరహరి బొల్లం ఆమ్మూర్తి, ముద్దపురం ఎల్లయ్య అశోక్ కృష్ణ లక్ష్మణ్ లక్ష్మి పుష్ప అరుణ అనిత కలవ అంశవ్వ ఉప్పలయ్య కవిత తదితరులు పాల్గొన్నారు.
Feb 08 2024, 07:39