NLG: 'గావ్ చలో, బస్తి చలో అభియాన్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కన్మంత రెడ్డి శ్రీదేవి

NLG: 'గావ్ చలో, బస్తి చలో అభియాన్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కన్మంత రెడ్డి శ్రీదేవి

నల్లగొండ జిల్లా: ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో పార్టీ పథకాలను ప్రజలకు తెలియజేయాలని, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి శ్రీదేవి అన్నారు. కట్టంగూర్ లో మండల అధ్యక్షులు పబ్బు వెంకన్న ఆధ్వర్యంలో గావ్ చలో ఆబియాన్ కార్యక్రమంలో మండల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. 4 - 8 తేదీలో జరిగే గావ్ చలో, బస్తి చలో అభియాన్ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కోమటి భాస్కర్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రబాకర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాధురి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల సైదులు, మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు, కారంపూడి సాయికుమార్, బొడ్డుపల్లి ఆంజనేయులు, ముడుసు బిక్షపతి, నాగరాజు, ఐతగోని శివ, బసవోజు వినోద్, నీలం నాగరాజు, బత్తిని నాగరాజు, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NLG: పిడిఎస్ బియ్యం బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్

నల్లగొండ: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం బహిరంగ మార్కెట్ లో విక్రయించిన, ఎవరైనా కొన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్ హెచ్చరించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పౌర సరఫరాల శాఖ డిటి లు, గోదాం ఇంఛార్జి లు, చౌక ధర దుకాణాల డీలర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డియం నాగేశ్వర రావు పాల్గొన్నారు.

NLG: జి. చెన్నారం గ్రామపంచాయతీలో ఆత్మీయ సమ్మేళనం

నల్లగొండ: మండలంలోని జి. చెన్నారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ మాధవరెడ్డి, సూపర్డెంట్ రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నూతల వెంకన్న, ఉప సర్పంచ్ ప్రేమలత, వార్డ్ మెంబర్లు, సెక్రెటరీ సరిత, ఆశ వర్కర్, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NLG: నల్లగొండలో ఘనంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

  

నేడు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను నల్గొండ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో, గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. పలువురు కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి, ఎంపీపీ కరీం భాషా, జెడ్పిటిసి చెట్ల వెంకటేశం, స్థానిక వార్డు కౌన్సిలర్ కవిత దయాకర్, ధర్వేశిపురం ఎల్లమ్మ తల్లి దేవాలయం చైర్మన్ నర్సిరెడ్డి, గుత్తా అభిమానులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Breaking news: రామన్నపేట మండలంలో పెద్దపులి సంచారం!

యాదాద్రి జిల్లా:

రామన్నపేట మండలంలో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చిట్యాల - రామన్నపేట రైల్వే ట్రాక్ దాటి కొమ్మయిగూడెం వైపు వెళ్లినట్లు సమాచారం. కొమ్మాయిగూడెం ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామస్తులకు సంబంధించిన పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.

RR: అబ్దుల్లాపూర్ మెట్ లో ఘనంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం: ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క ఆవిర్భావ దినోత్సవం 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో కి అడుగు పెడుతున్న సందర్భంగా,  పని జరుగుతున్న  ప్రదేశంలో ఎంపీడీవో చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించడంతో పాటు వారి యొక్క జీవనోపాధి అభివృద్ధి చెందుటలో  ఉపాధి హామీ పథకం చాలా దోహదపడుతుంది. అదేవిధంగా వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో 27,200 రూపాయలు వేతన రూపంలో అందుతుందని చెప్పినారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఆర్.మమత బాయి, గ్రామ కార్యదర్శి రమేష్, జామీల్,  ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ డాక్టర్.ఎ.సుధాకర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్స్ ఆర్.శంకర్, వి.పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్స్ రాణి, చిల్కయ్య, జంగమయ్య, స్వప్న, రమాదేవి చంద్రకళ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
NLG: లెంకలపల్లి లో ఘనంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:

లెంకలపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఓ వెంకటేశం హాజరై కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మరియు ఏపీవో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం ప్రారంభమై 17 సం.లు పూర్తి చేసుకుని 18 సం.లోకి అడుగు పెట్టిందని, ఉపాధి హామీ కూలీలు ప్రతి సం.100 రోజులు పనిచేసుకునే అవకాశం ఈ పథకం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఏలు సుజాత, వినోద్ సత్యనారాయణ, ఎఫ్ఏ యాదయ్య, కూలీలు పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ గ్రామపంచాయతీ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చిన గ్రామపంచాయతీ సిబ్బంది

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం

తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో.. గ్రామపంచాయతీ సిబ్బంది ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసును మర్రిగూడ గ్రామపంచాయతీ కార్యదర్శి అందజేశారు.

కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఊరు పక్క వెంకటయ్య, ఒంపు ముత్తమ్మ, ఐతపాక పద్మ, గ్యార యాదగిరి, ఆవుల ముత్తయ్య, ఇందిరమ్మ, జంగమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట: నూతన సిఐ ని సన్మానించిన బీఎస్పీ నాయకులు

బీఎస్పీ మండల పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

YBD: పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మున్సిపల్ చైర్మన్

యాదాద్రి జిల్లా:

చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు పనులను మున్సిపల్ చైర్మన్ వెన్‌ రెడ్డి రాజు పరిశీలించారు. మధ్యాహ్నం సమయం అవడంతో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పదవ తరగతిలో 10/10 సాధించిన ప్రతి విద్యార్థికి పది వేల రూపాయలను బహుమతిగా ఇస్తానని చెప్పారు.

సీనియర్ అడ్వకేట్ తాడూరి పరమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.