పార్టీ పేరు టిఆర్ఎస్ గా మార్చండి: కడియం శ్రీహరి

అసెంబ్లీ ఎన్నికల ఓటమి వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందన్నారు.

వరంగల్ లోక్ సభ సన్నా హక సమావేశంలో కడియం కీలక డిమాండ్‌ను కేటీఆర్ ముందు ఉంచారు. తెలం గాణ ప్రజలు టీఆర్ ఎస్‌ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ ను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు.

టీఆర్ఎస్‌తో ఉన్న అటా చ్‌మెంట్, సెంటిమెంట్ బీఆర్ఎస్‌గా పేరు మార్చ డంతో పోయింద న్నారు. ఈ అంశంపై ఫోకస్ పెట్టి వెంట నే బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ ఎస్‌గా మార్చే విషయంలో పునరాలోచించాలని కేటీ ఆర్‌ను కడియం కోరారు.

పార్టీ పేరు మార్పుతో కనీసం 1-2 శాతం ఓట్లు పార్టీకి పడలేదన్నారు. బీఆర్ ఎస్‌ను టీఆర్‌ఎస్ గా మార్చాలని కార్యకర్తలు, నాయకులే కాకుండా మెజారిటీ ప్రజలు అభిప్రా యపడుతున్నారన్నారు.

టీఆర్ఎస్ పేరిట తిరిగి పార్టీ పేరు మార్చే ప్రతిపాదనను గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియం పార్టీ నేతలను కోరారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్ వస్తుండటంతో అధినేత కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

నేషనల్ పాలిటిక్స్‌లో ఎంట్రీ కోసం టీఆర్ఎస్ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా గులాబీ బాస్ మార్చిన విషయం తెలిసిందే.

ప్రైమ్ స్కానింగ్ సెంటర్... ఫ్రాడ్ స్కానింగ్ సెంటర్

తప్పుడు రిపొట్ లకు అడ్డగా స్కానింగ్ సెంటర్

నల్లగొండ పట్టణ కేంద్రంలో డాక్టర్స్ కాలనీలో గల ప్రైమ్ స్కానింగ్ సెంటర్ తప్పుడు రిపొట్ లకు అడ్డగా మారింది. కొంత మంది డాక్టర్లు తమ సొంత లాభం కోసం ఆ స్కానింగ్ సెంటర్ కి రిఫర్ చేయగా వాళ్లకు కమిషన్ ముట్టడం ఆనవాయితీగా వస్తోంది.

అదే క్రమంలో ఒక యువకుడు తనకు గ్యాస్ ప్రాబ్లెమ్ రాగ పట్టణ కేంద్రంలో గల సాయి శ్రీనివాస హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్ స్కానింగ్ చేయించాలని ప్రైమ్ స్కానింగ్ సెంటర్ కి రిఫర్ చేయగా ఆ యువకుడు అక్కడ కి వెళ్లగా ఆ స్కానింగ్ సెంటర్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి స్కానింగ్ తీసి ఆ యువకుడికి అపెండిక్స్ ఉంది అని తొందరగా సర్జరీ అవసరం అని అన్నారు.

ఇది గమనించిన ఆ యువకుడు మళ్ళీ తిరిగి అపూర్వ స్కానింగ్ సెంటర్ కి వెళ్లి మళ్ళీ స్కానింగ్ తీయగా ఆ యువకుడికి ఎటువంటి సమస్య లేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ యువకుడు తిరిగి తన స్నేహితుల తో కలిసి ప్రైమ్ స్కానింగ్ సెంటర్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ని నిలదియగా

డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ఆ యువకుడికి కొంత డబ్బు ను ఇస్తా అనడంతో అందుకు ఆ యువకుడు నిరాకరించడం తో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి కొంత మంది డాక్టర్లు పుల్ల రావు మరియు సురక్ష డాక్టర్ రమేష్ కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ యువకుడి పై పిర్యాదు చేశారు. ఆ తరువాత ఆ యువకుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి పై కేసు పెట్టడం జరిగింది.

ఢిల్లీ ని వణికించిన భూకంపం

ఢిల్లీలోఈరోజు భూకంపం సంభవించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది.

దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది.

ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.

Budget Session: జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..

వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది.

ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్‌ సమావేశాలు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది..

టీఎస్ పిఎస్పీ బోర్డు చైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్

అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత ఐదు గ్యారంటీల అమలుకు ముందడుగు వేసింది.

ప్రజాపాలన - అభయహస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిం చింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికా రంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది.

ఫిబ్రవరిలోనే ఉద్యోగాల నియామకాలు మొదలు పెడుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి.

అతి త్వరలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులను సర్కార్ నియమించనుంది. చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్‌ను నియమించే అవకాశం ఉంది.

ఇటీవలే యూపీఎస్సీ ఛైర్మన్‌ను సీఎం రేవంత్ కలిసిన విషయం తెలిసిందే. పారదర్శకంగా బోర్డు ఉండేలా కసరత్తు చేపట్టారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులు ఉండనున్నారు.

బోర్డులో ఉండాల్సిన నిపుణుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సీఏం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన కలిపి రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది.

మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..'మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని రుణాలు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి.

ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనం.

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్‌ నిర్మాణ పనులను అధికా రులతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామల మవు తుందన్నారు. వీలైనంత తొందరగా ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అంది స్తామని చెప్పారు.

ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్‌ ప్రధానమైనదని, పనులు రెండు వైపుల నుంచి చేసుకుంటూ రావాలన్నారు.సీతారామ ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై ఈ నెల 8న హైదరాబాద్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి నీటి పారుదలశాఖ అధికారులతో మంత్రి తుమ్మల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మే నెలా ఖరు కల్లా సీతారామ ప్రాజెక్ట్‌ పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతి పదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా రిజర్వా యర్‌, లంకాసాగర్‌ చెరువు, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు.

ఏనూరు వద్ద లింకు కెనాల్‌ పనులకు టెండర్లు పూర్తి చేసి, పనులు మొదలు పెట్టాలన్నారు. యాతాల కుంటలో భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్‌ ద్వారా లంకసాగర్‌, బేతుపల్లి కెనాల్‌కు ఈ సీజన్‌లో సాగునీరు ఇవ్వొచ్చన్నారు.

సత్తుపల్లి కెనాల్‌కు సంబం ధించి భూసేకరణకు రూ.12 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాలేరు టన్నెల్‌ పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయితే పాలేరు రిజర్వాయర్‌కూ జలాలు తీసుకురావొచ్చన్నారు.

యువకుడి ప్రాణం తీసిన చికెన్ ముక్క

తెలంగాణకు వలస వచ్చిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫారుఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్నారు.

అయితే వారిద్దరు నిన్న రాత్రి చికెన్ తీసుకువచ్చి దావత్ చేసుకోవాలను కున్నారు. ఇందుకు అనుగుణంగా ఇద్దరు ఏర్పాట్లు చేసుకు న్నారు. చికెన్‌తో పాటు నంజుకో వడానికి పూరి కూడా వండుకున్నారు.

అందులోకి మద్యం కూడా తీసుకొచ్చారు. అయితే హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది.

మద్యం సేవించి ఇద్దరు భోజనం చేస్తుండగా జితేంద్రకుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో ఏమో అని తేరుకునేలోపే ధర్మేందర్ అపస్మారకస్థితికి చేరుకున్నాడు.

కాసేపటికి అతన్ని గమనించిన ధర్మేందర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే ధర్మేందర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవ డంతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చే చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

సీఎం రేవంత్ రెడ్డి తో గూగుల్ గ్రూప్ వైస్ చైర్మన్ & ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పాలనలో దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతున్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం నివాసంలో ఈరోజు ఉదయం ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గ్రూప్‌ వైఎస్ చైర్మన్ తమ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం నివాసంలో ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధ తను వ్యక్తం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు అవుతా మన్నారు.

అలాగే తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి వివరించారు..

గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుద లలపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు.

ఈ సమావే శంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి; సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గ‌త‌రాత్రి ఆతిధ్యం ఇచ్చారు.

అమెరికా, ఇరాన్, తుర్కియే, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్, బ్రిట‌న్, జ‌పాన్ , థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ ట్రీట్ కు హాజర‌య్యారు.

ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యు న్నతికి నూతనంగా ఏర్పా టు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ‘అభయహస్తం’తో అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర నేతలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం సమానత్వం, పారదర్శకతతో పనిచేస్తోం దని, వెల్లడించారు.

ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. యువత భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశా లను ఆయా దేశాలు సద్వినియోగం చేసుకో వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.

తెలంగాణను పారిశ్రామి కంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిణి స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు