ఏపీలో 108, 104 సిబ్బంది సమ్మె నోటీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు..

ఈ మేరకు సమ్మె నోటీసుల ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మొత్తం 7వేల మంది ఉద్యోగులు 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని కోరారు. ఈ నెల 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు..

గందరగోళం లేకుండా ఓటరు జాబితా సవరణకు చర్యలు: ముకేశ్‌ కుమార్‌ మీనా

అమరావతి: ఈ ఏడాది ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా తెలిపారు..

ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12లోపు పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు

మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చాం. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం

చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టాం. అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్‌వోలపై చర్యలు తీసుకున్నాం. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశాం. జీరో డోర్ నంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించాం. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయి అని ముకేశ్‌కుమార్‌ మీనా వివరించారు

వాళ్లిద్దరు ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తా: మాజీ ఎంపీ లగడపాటి

రాజమహేంద్రవరంలో: రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను ఆయన కలిశారు

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..

కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందిమార్గమధ్యంలో హర్షకుమార్‌ను కలిశా. ప్రజల కోసం భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్‌ను విడిచిపెట్టాం. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో మేం పూర్తిగా విభేదించాం. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్షకుమార్‌ ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తా. అవసరమైతే వారి తరఫున ప్రచారం చేస్తా. గతంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం చాలా సంతోషం'' అని లగడపాటి వెల్లడించారు..

నేడు ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో వాతావరణం సడెన్‌గా మారింది. ఒక్కసారిగా భారీ మేఘాలతో అల్పపీడనం లాంటిది పరుగులు పెడుతూ ఏపీవైపు వస్తోంది. ఇప్పటికే ఇది తమిళనాడు దగ్గరకు వచ్చేసింది.

ఇవాళ ఏపీకి చేరే అవకాశం ఉంది . అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన ఉంది అని భారత వాతావరణ విభాగం చెప్పింది.

తాజా వాతావరణ బులిటెన్ ప్రకారం.. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ శ్రీలంక నుంచి బయలుదేరి.. పశ్టిమ మధ్య బంగాళాఖాతం గుండా పరుగులు పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతానికి వస్తోంది.

దీని మేఘాలు ఇప్పటికే ఏపీపైకి వచ్చేశాయి. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో 5 రోజులపాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి అనీ, అలాగే తమిళనాడు, కేరళలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయనీ, అలాగే జనవరి 8న ఏపీలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం బాగా ఉంది అని చెప్పింది.

మరింత స్పష్టత కోసం శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను చూస్తే, ఇవాళ తమిళనాడు తీరంలో ఆల్రెడీ వానలు పడుతు న్నాయి. ఉదయం నుంచే రాయలసీమలో భారీ మేఘాలున్నాయి. ఇవి మధ్యాహ్నానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ

అయోధ్య రామయ్య అక్షింతలకు ప్రత్యేక పూజలు

జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ లో శ్రీ భక్త మార్కండేయ దేవాల యంలో సోమవారం అయోధ్య శ్రీ రాములవారి అక్షింతలకు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం పూజిత అక్షింతలు గడపగడపకు వితరణ కార్యక్రమం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా బోగ శ్రావణి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఓ పి ఎస్ సాధన కోసం రిలే నిరాహార దీక్షలు

  రైల్వే శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరికీ పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్  నడికుడి -నల్లగొండ బ్రాంచ్ ల ఆధ్వర్యంలో ఏఐఆర్ యఫ్ పిలుపుమేరకు  నల్లగొండ రైల్వే ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అందుకోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తూ అంబానీ, ఆదానిలా రైల్వేలను ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.

   బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ కృష్ణారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ సెల్ తెలంగాణ ఏపీ ప్రతినిధి సాంబశివరావు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను మానుకోవాలని వెంటనే పాత పెన్షన్ పథకాన్ని ని పునరుద్ధరించాలని కోరారు కార్మికుల పోరాటాల కు మద్దతు తెలిపారు

      ఈ నిరాహార దీక్షలో నల్లగొండ సూపర్వైజర్స్ సాంబశివరావు ,సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ చైర్మన్ ఎం రామభద్ర రావు, కార్యదర్శి కె వెంకటేష్, ట్రెజరర్ సిహెచ్ ఐలేని నడికుడి బ్రాంచ్ కార్యదర్శి వి ఎస్ సాయికుమార్ అసిస్టెంట్ సెక్రటరీ కే ప్రసాద్ వైస్ చైర్మన్ అబ్రహం కోశాధికారి ఎం శివప్రసాద్,ఆర్ స్వామిరావు, కె భిక్షపతి, వివిధ విభాగాలను ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు

గురువారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు

ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు

నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ వారికి పుష్పగుచ్ఛాన్ని అందించి పరామర్శించారు. 

అనంతరం కేసీఆర్ గారి యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.

కాగా బేగం పేటకు ప్రత్యేక విమానం లో చేరుకున్న సీఎం జగన్ ను…మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఆహ్వానించారు.

సీఎం జగన్ వెంట ఎంపీ మితున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.

అందరి ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి

దేశంలో క్రిస్మస్ పర్వదినాన ప్రేమ విందును ప్రారంభించిన ఘనత బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలోనే క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినాన బట్టలు పంపిణీ చేసి అధికారంలోకి వచ్చాక దాన్ని అధికారికంగా చేసిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ దే అన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను గౌరవించే సాహసం చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. అందరి ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి అని అదే ఆరోగ్యవంతమైన సమాజం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నేడు క్రిస్మస్ పర్వదినాన బట్టలు పంపిణీ చేసి ప్రేమ విందు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రైస్తవులంతా ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఆర్డిఓ వీరబ్రహ్మ చారి, జెడ్పి సీఈవో సురేష్, తాసిల్దార్ శ్యాంసుందర్, జడ్పిటిసి జీడి బిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, పీస్ట్ కమిటీ అధ్యక్షులు పుల్లురి డానియల్, సెక్రటరీ ఎల్క ప్రభాకర్, వి.బోయాజ్, కోడూరి హేజ్ర, మామిడి ఎలీషా రాజు, మీసాల గోవర్ధన్, మీసాల ప్రభుదాస్, రమేష్ బాబు, సైమన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు పెద్దపంగు స్వ రూప, మైనార్టీ నాయకులు పూర్ణ శశికాంత్, కల్లెపల్లి మహేశ్వరి తదితరులు ఉన్నారు.

బిజెపి సీనియర్ నేత శ్రీరామోజు షణ్ముకజన్నన్న మృతి మాజీ మంత్రి జగదీష్ రెడ్ది దిగ్భ్రాంతి

బిజెపి సీనియర్ నేత శ్రీరామోజు షణ్ముఖజన్నన్న మరణం పట్ల మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన జన్నన్న ఇంటికి చేరుకున్న ఆయన జన్నన్న పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి నిబద్ధత కలిగిన నేత లేకపోవడం వర్తమాన రాజకీయాలకు తీరని లోటుగా ఉంటుందన్నారు.బి ఆర్ యస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొంత కాలం టి ఆర్ యస్ లో కలసి పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన షణ్ముక కుటుంబ సబ్యులను పరామర్శించారు.

పదవులు ఎవరికి శాశ్వతం కాదు అభివృద్ది ఎంత చేశామనేదే ముఖ్యం పదవి ఎదైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృ

 పదవులు ఎవరికి శాశ్వతం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గం పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం లో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంల పాల్గొన్న జగదీష్ రెడ్డి పశువైద్య, ఉధ్యానవన, నీటి పారుదల, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖ, ప్రాధమిక విద్య, పౌర సరఫరా, ఆరోగ్య, రోడ్లు రహదారులు తో పాటు పలు శాఖల ఆధ్వర్యంలో లో జరిగిన, జరుగుతున్న , జరుగాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ పదవులు ఎవరికి శాశ్వతం కాదని అధికారంలో మనం ఎంత అభివృద్ది చేశామో ముఖ్యమని ఆయన అన్నారు. బిఆర్ఎస్ అధికారం రాకముందు పల్లెలు, పట్టణాలు ఎలా ఉన్నాయో బిఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ది జరిగిందో అధికారులే సాక్షమని అన్నారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలి అన్నారు. మీరు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు భవిష్యత్తు తరాలకు చిహ్నం గానిలబడాలని సూచించారు.గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు.బిఆర్ఎస్ పాలనలో పార్టీలకతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు.

అదే తరహా పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో జరగవలసిన పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అభివృద్ది కొనసాగించేందుకు పూర్తిగా మద్దతు తెలుపుతామని, అవసరమైతే పోరాటాలకు కూడా సిద్దమని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేపడితే తమకు పోరాటాలు కొత్తేమీ కాదని తన ఎనిమిదవ తరగతి నుండి పోరాటాలు చేస్తున్నామని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి భాగస్వామ్యం కావాలని సర్పంచులకు సూచించారు. కెసిఆర్ ఏ విధంగా రాష్ట్రం అభివృద్ది చేయాలని చిత్తశుద్ధితో పనిచేశారో సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు వార్డుల అభివృద్ధికి కృషి చేయాలి అని కోరారు ఎంపీపీ నెమ్మాధి బిక్షం ఆధ్వర్యంలో లో జరిగిన సమావేశంలో జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, వైస్ ఎంపీపీ సింగా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.