బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు

గురువారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు

ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు

నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ వారికి పుష్పగుచ్ఛాన్ని అందించి పరామర్శించారు. 

అనంతరం కేసీఆర్ గారి యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.

కాగా బేగం పేటకు ప్రత్యేక విమానం లో చేరుకున్న సీఎం జగన్ ను…మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఆహ్వానించారు.

సీఎం జగన్ వెంట ఎంపీ మితున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు.

అందరి ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి

దేశంలో క్రిస్మస్ పర్వదినాన ప్రేమ విందును ప్రారంభించిన ఘనత బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలోనే క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినాన బట్టలు పంపిణీ చేసి అధికారంలోకి వచ్చాక దాన్ని అధికారికంగా చేసిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ దే అన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను గౌరవించే సాహసం చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. అందరి ఆచారాలు సాంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి అని అదే ఆరోగ్యవంతమైన సమాజం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నేడు క్రిస్మస్ పర్వదినాన బట్టలు పంపిణీ చేసి ప్రేమ విందు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రైస్తవులంతా ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఆర్డిఓ వీరబ్రహ్మ చారి, జెడ్పి సీఈవో సురేష్, తాసిల్దార్ శ్యాంసుందర్, జడ్పిటిసి జీడి బిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, పీస్ట్ కమిటీ అధ్యక్షులు పుల్లురి డానియల్, సెక్రటరీ ఎల్క ప్రభాకర్, వి.బోయాజ్, కోడూరి హేజ్ర, మామిడి ఎలీషా రాజు, మీసాల గోవర్ధన్, మీసాల ప్రభుదాస్, రమేష్ బాబు, సైమన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు పెద్దపంగు స్వ రూప, మైనార్టీ నాయకులు పూర్ణ శశికాంత్, కల్లెపల్లి మహేశ్వరి తదితరులు ఉన్నారు.

బిజెపి సీనియర్ నేత శ్రీరామోజు షణ్ముకజన్నన్న మృతి మాజీ మంత్రి జగదీష్ రెడ్ది దిగ్భ్రాంతి

బిజెపి సీనియర్ నేత శ్రీరామోజు షణ్ముఖజన్నన్న మరణం పట్ల మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన జన్నన్న ఇంటికి చేరుకున్న ఆయన జన్నన్న పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి నిబద్ధత కలిగిన నేత లేకపోవడం వర్తమాన రాజకీయాలకు తీరని లోటుగా ఉంటుందన్నారు.బి ఆర్ యస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొంత కాలం టి ఆర్ యస్ లో కలసి పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన షణ్ముక కుటుంబ సబ్యులను పరామర్శించారు.

పదవులు ఎవరికి శాశ్వతం కాదు అభివృద్ది ఎంత చేశామనేదే ముఖ్యం పదవి ఎదైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృ

 పదవులు ఎవరికి శాశ్వతం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గం పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం లో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంల పాల్గొన్న జగదీష్ రెడ్డి పశువైద్య, ఉధ్యానవన, నీటి పారుదల, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖ, ప్రాధమిక విద్య, పౌర సరఫరా, ఆరోగ్య, రోడ్లు రహదారులు తో పాటు పలు శాఖల ఆధ్వర్యంలో లో జరిగిన, జరుగుతున్న , జరుగాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ పదవులు ఎవరికి శాశ్వతం కాదని అధికారంలో మనం ఎంత అభివృద్ది చేశామో ముఖ్యమని ఆయన అన్నారు. బిఆర్ఎస్ అధికారం రాకముందు పల్లెలు, పట్టణాలు ఎలా ఉన్నాయో బిఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ది జరిగిందో అధికారులే సాక్షమని అన్నారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలి అన్నారు. మీరు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు భవిష్యత్తు తరాలకు చిహ్నం గానిలబడాలని సూచించారు.గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు.బిఆర్ఎస్ పాలనలో పార్టీలకతీతంగా అభివృద్ధి జరిగిందన్నారు.

అదే తరహా పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆశిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో జరగవలసిన పనులపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అభివృద్ది కొనసాగించేందుకు పూర్తిగా మద్దతు తెలుపుతామని, అవసరమైతే పోరాటాలకు కూడా సిద్దమని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేపడితే తమకు పోరాటాలు కొత్తేమీ కాదని తన ఎనిమిదవ తరగతి నుండి పోరాటాలు చేస్తున్నామని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి భాగస్వామ్యం కావాలని సర్పంచులకు సూచించారు. కెసిఆర్ ఏ విధంగా రాష్ట్రం అభివృద్ది చేయాలని చిత్తశుద్ధితో పనిచేశారో సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు వార్డుల అభివృద్ధికి కృషి చేయాలి అని కోరారు ఎంపీపీ నెమ్మాధి బిక్షం ఆధ్వర్యంలో లో జరిగిన సమావేశంలో జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, వైస్ ఎంపీపీ సింగా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.

ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన సందర్భంగా.. మెదక్ పార్లమెంటు సభ్యుడిగా లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన సభ్యత్వాన్ని ఉపసంహరించు కుంటు రాజీనామా పత్రం సమర్పించారుఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మెదక్ ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలుఅభివృద్ధి పనులు, 10 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు

ఈ క్రమంలో రెండు సార్లు భారీ మెజార్టీ తో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు

కెసిఆర్ పాలన లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జోగులాంబ నుంచి ఆలంపూర్ వరకు అందరూ బిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయినప్పటికీ సూర్యాపేట మాత్రం బొడ్రాయిలానిలిచి గెలిచిందని అన్నారు. మళ్లీ ఎన్నికల వరకు ఒక్కటి లేకుండా అన్ని గెలుస్తామన్నారు. మంచి కొరకు నిలబడి త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర సూర్యాపేట ప్రజలదని అందుకు నా ఈ గెలుపే నిదర్శనం అన్నారు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జరిగిన లోటుపాట్లను ఆలోచన చేసుకావాలని అవి మరల పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు కుట్రపూరితంగా పదేళ్లు అధికారంలో ఉన్నారని ఒక వాదన తీసుకువచ్చి తప్పుదోవ పట్టించారని అన్నారు. రెండుసార్లు తెలంగాణలో అధికారం ఇస్తే కెసిఆర్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా చేశారని అన్నారు. రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గెలిచేందుకు నీళ్లు కరెంటు రోడ్లు సరిపోతాయని అంటున్నారన్నారు. కెసిఆర్కు ఉన్న విజన్ ఆలోచన ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్లకు లేదని అన్నారు ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారని ప్రజల ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలన్నారు. నాలుగేండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని ఆ రాష్ట్రం ముందు ముందు మంచిగా ఉండాలంటే మనం ఆ బాధ్యత తీసుకోవాలన్నారు మనం ముందుగా అనుకున్నట్లుగానే చిల్లర వేషాలు మొదలయ్యాయని ఇవి మన నల్లగొండలో ముఖ్యంగా సూర్యాపేటలో అధికంగా ఉంటాయన్నారు. కెసిఆర్ కొట్లాటలు గొడవలు ఉండొద్దని అవి అభివృద్ధికి ఆటంకాలని పది ఏళ్లుగా ప్రశాంతంగా ఉంచారాని గుర్తు చేశారు. మనలాగా చేయడం ఎవరితోనూ కాదని అది అందరికీ తెలుసని అన్నారు ఎన్నికల ముందే నేను చెప్పినట్లుగానే వృద్ధ సింహం గాండ్రిస్తుందని అసెంబ్లీకి పోకున్నా అన్ని చేస్తామని అంటున్నాడని ఎలా చేస్తాడు ఏం చేస్తాడు నాలా 24 గంటలు కష్టపడి నాతో కలిసి నాలుగు గంటలకు లేస్తాడా అని అన్నారు సూర్యాపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ఆలోచనతో డివైడర్ కట్టించామని ఇప్పుడు ఆ డివైడర్ను తొలగించి రోడ్డు ప్రమాదాలకు కారకులు కాబోతున్నారని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన నాడే బోరు బావులు మూసివేయించాడని బోరు బావుల్లో పడితే పెద్ద వార్త అని గత పదేళ్లగా ఒక పిల్లవాడు కూడా బోరుబావిలో పడిన సంఘటన లేదన్నారు చేష్టలతో ప్రజలను మెప్పించలేరని తిరుగులేని అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు మనం ఒకేలా ఉన్నామని ఉంటామని అన్నారు. కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని ఇప్పుడు పాత పద్ధతి వేస్తామని అంటున్నారని అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాము అవసరమైతే కొత్త రుణాలు తీసుకోమన్నారు అది కూడా అమలు కాలేదు అన్నారు ధాన్యంకు కింటాకు భోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారని ఇంతవరకు దాని వూసే లేదనీ అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చరని నెరవేర్చినట్లు చరిత్రలో కూడా లేదన్నారు రోజులు కాదు కదా 900 రోజులు ఆగిన హామీలు అమలు కావని ప్రజల నుంచి ప్రశ్న రావాలని అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారు. ఇవ్వడం చేతకాక దాని నుంచి తప్పించుకునేందుకు అప్పులు చేశారని అంటారని అసెంబ్లీలో నన్ను అడిగితే దానికి సమాధానం నేను చెప్పేవాన్ని అన్నారు గత ప్రభుత్వాల్లో 6 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే ఇప్పుడు 18 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నామని, అప్పుడు జెన్కో ఆస్తులు 18 వేల కోట్లు అయితే ఇప్పుడు 50 వేల కోట్లు అయ్యాయనిఇప్పుడొచ్చింది ఆరు గంటల కరెంటు అయితే ఇప్పుడు నేను ఇచ్చేది 24 గంటల కరెంట్ అని అన్నారు. చేసేందుకు దమ్ము ధైర్యం ఉండాలని సాకులు చెబితే నడవదని అసెంబ్లీలో చర్చ వాళ్ళు పెట్టడం కాదు నేనే పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతాను అన్నారు. నడిపిన వారమంతా అసెంబ్లీలోనే ఉన్నామని మాట్లాడతామని అధికారం ఎక్కువ రోజులు ఏం ఉండదని అవకాశాలు వాళ్లే ఇస్తారని మనంఅందిపుచ్చుకోవాలన్నారు. రెండు మూడు రోజుల జరుగుతున్న సంఘటనలతో ఇక్కడ నేను గెలిచాను కాబట్టి నాకు ఓటు వేయని వారు కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారని అన్నారు. అధికారం ఉన్న లేకున్నా అనిగిమనిగి ఉండడం రాజకీయంగా తరగని పెట్టుబడి అని అన్నారు. అధికారంలో ఉన్న వారి వైపే అధికారులు ఉంటారని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలో స్పష్టత వస్తుందని దానిపై ఆలోచన చేద్దామన్నారు ప్రజలు విజ్ఞులని వారు ఆలోచన చేస్తారని అన్నారు పార్టీ ఏ పిలుపునిచ్చిన వెంటనే స్పందించడమే మనప్రధాన బాధ్యతఅన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల తరఫున పోరాడటమే మన ప్రధాన కర్తవ్యమని దీన్ని నాయకులు కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని చైతన్యవంతులై పని చేయాలని పిలుపునిచ్చారు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖానలో పరామర్శించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు, యశోద డాక్టర్లను కలిసి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎంవీ రావు తదితరులున్నారు.

సీఎం వెంట మంత్రి శ్రీమతి సీతక్క, శ్రీ షబ్బీర్ అలీ తదితరులున్నారు.

మహిళలకు RTC బస్సులలోఉచిత ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి... నూనె వెంకట్ స్వామి

RTC బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం మంచిదే, ప్రజలందరూ దీన్ని హర్షిస్తున్నారు. ఒకటి మంచి చేయబోతే మరొకటి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులే ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవడమ్, అంతంత మాత్రంగా ఉన్న ఆటో డ్రైవర్ల జీవితలు ఈ కారణం చేత అభద్రతకు ఉపాధి కోల్పోవడానికి కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎటువంటి పథకాలు కానీ ఆదుకోవడం గాని జరుగుతున్న పరిస్థితి లేదు. గతంలో ఉన్న BRS ప్రభుత్వం గానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఆటో డ్రైవర్లను ఏ విధంగాను ఆదుకోలేదు. ఈ కారణం చేత భార్య మెడ పై ఉన్న పుస్తేలను కూడా కుదువబెట్టి ఆటోలను తెచ్చి, ఇన్సూరెన్స్లను కట్టి, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నూతన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల యూనియన్లను అసోసియేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పిలిచి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఏ చర్యల ద్వారా ఉపాధి నిలబడుతుందో ఆ చర్యలను చేపట్టాలి

తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం...

తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతోన్న ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు

కరెంటు ఆర్థిక స్థితిగతులను దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి దాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టినాడు

కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రజలు తప్పు దోవ పట్టించడానికి ఈ పని చేశారు

ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దు

ఈరోజు ఆయన పిలిపించి 85 వేల కోట్ల అప్పు ఎలా అయింది ఎందుకయింది, ఎలా అయింది, ఏమి కొన్నారు. ఆయన ద్వారానే ప్రజలకు తెలిపే ప్రయత్నము

ఒకవేళ లెక్కలు సరిగ్గా తేలకపోతే, అప్పుడప్పుడే  ప్రభాకర్ రావు ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది

కరెంటు సెగ మన మాజీ మంత్రుల కు తగిలే అవకాశం ఉంది, , కెసిఆర్ అనారోగ్యంతో, హాస్పిటల్ యశోదలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పేరిట విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది

ఇప్పుడే అందిన సమాచారం, ప్రభాకర్ రావు, విదేశాలకు పారిపోయే ప్రయత్నం, అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. చూద్దాం ఏం జరుగుతుందో