దళిత మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

 నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన వల్లందాసు మంజుల (35) దళిత వివాహిత మహిళను అత్యంత దారుణంగా చున్నీతో ఉరిబెట్టి రాళ్లతో కొట్టి చంపిన వాజిద్ మరికొంతమంది నిందితులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున mrps జిల్లా సీనియర్ నాయకులు బాకరం శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షం డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాదారు. దళిత మహిళలపై అత్యంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయని నిందితులు ఏదేచ్ఛగా తిరుగుతున్నారని ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు విధించాలని దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, డిమాండ్ చేశారు. నిందితులపైన హత్య, sc st అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మంజుల కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక dsp గారు సమగ్రంగా విచారణ జరిపి దోషులను కటినంగా శిక్షించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కెవిపిస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను విద్యార్థి సంగం అధ్యక్షులు కొండేటి మురళి కత్తుల సన్నీ మృతురాలి కుమారుడు మరియు పోతే పాక సహదేవ వెలుగుపల్లి వార్డు మెంబర్లు పోతుపాక కిరణ్ పోతుపాక సతీష్ నాగార్జున బ్రహ్మచారి గ్రామస్తులు పూతపాక యాదయ్య పోతుపాక లింగయ్య పూతపాక రవి పూతపాక సైదులు పోతపాక నవీన్ చింతపల్లి వెంకన్న కండే యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో కారు టాప్ గేర్

కారు స్పీడుకు చెల్లాచెదురు అవుతున్న కాంగ్రెస్, బిజెపిలు. 

ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

కాంగ్రెస్‌, బీజేపీ వీడి గులాబీ కండువా కప్పుకుంటున్న నేతలు

మంత్రి జగదీష్ రెడ్డి వ్యూహాంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది సూర్యాపేట నియోజకవర్గం లో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సూర్యాపేట నియోజకవర్గం లో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు సొంతపార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. కారు స్పీడు కు కాంగ్రెస్ , బిజేపి లు చెల్లాచెదురు అవుతున్నాయి. మంత్రి,బిఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి వ్యూహాంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్‌, బిజేపి లు ఖాలీ అవుతుండగా, భారీ మెజారిీ విజయం దిశగా జగదీష్ రెడ్డి దూసుకుపోతున్నారు.

సీఎం కేసీఆర్‌తోనే తండాల అభివృద్ధి

 తండాలను పంచాయితీ లుగా చేసిన మానవతవాధి కేసిఆర్

చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ,బీజేపీకి లకు గుణపాఠం చెప్పాలి

త్వరలోనే ‘గిరిజన బంధు’ అమలు చేస్తాం 

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే నా ధ్యేయం

ఎకరానికి లక్ష ఆదాయం వచ్చే లా చేయడమే నా లక్ష్యం

తండాలను పంచాయితీ లుగా చేసిన గొప్పమానవతవాధి ముఖ్యమంత్రి కేసిఆర్ అని సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట రూరల్ మండలం రాజా నాయక్ తండ, లక్ష్మీ నాయక్ తండ, చివ్వెంల మండలం బడితండ,పీర్ల తండా,మున్యానాయక్ తండ, పాండ్య నాయక్ తండా లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారంగిరిజన తండాలు, గూడేలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటి వరకు తండాలను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవన్నారు. స్వరాష్ట్రంలోనే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. మిషన్‌భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తు న్నామని తెలిపారు. తండాలకు రహదారులు నిర్మించామని పేర్కొన్నారు. గతంలో జరిగిన అభివృద్దిని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్దిపై బేరీజు వేయాలని ప్రజలకు సూచించారు.గత ప్రభుత్వాలు తండాల అభివృద్ధి గురించి పట్టించు కో కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్‌ గిరిజనుల ఆరాధ్యుడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గిరిజన కుటుంబ సంఘటన నుంచే కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని త్వరలో భూమిలేని గిరిజనుల కోసం గిరిజన బంధు పథకం వస్తుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి గిరిజనులు అండగా నిలువాలని కోరారు.

సూర్యాపేట లో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందే కనబడుతుందని అన్నారు.గతంలో పాలించిన దామోదర్ రెడ్డి తన హయాంలో ఏమి చేయకపోగా, కొట్లాటలను ఘర్షణలను ప్రోత్సహించి, మూడు కొట్లాటలు ఆరు కేసులను ఇచ్చాడే తప్ప గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలవేళ మాయమాటలు చెబుతున్న దామోదర్ రెడ్డిని ఏం చేశాడో ప్రజలే ప్రశ్నించాలని కోరారు. మళ్లీ ఆశీర్వదిస్తే ఎకరానికి లక్ష ఆదాయం వచ్చే విధంగా చేయడమే నా లక్ష్యం అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలనిన్నదే నాధ్యేయం ఆన్న మంత్రి, దానికి కావాల్సిన ప్రణాళిక నా దగ్గర సిద్ధంగా ఉందన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే , డ్రై పోర్టు తీసుకొచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తానని అన్నారు. రాబోయే డ్రైపోర్టుతో మీ భూముల ధరలకు రెక్కలు వస్తాయని, అందరూ కోటీశ్వరులు కావడం ఖాయం అన్నారు. తండాలలో అభివృద్ధిని పరుగులు పెట్టించి

నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తానన్నారు.

భాస్కర్ రావు గెలుపు కోరుతూ బాపూజీ నగర్ లో బారి చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్థి భాస్కరరావు గారి గెలుపును మరియు మిర్యాలగూడ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉమ్మడి బాపూజినగర్ నుండి వివిధ పార్టీల యువ నాయకులు దొంతరబోయిన శ్రీనివాస్ , సింగిరాల విజయ్,Sk ఎక్బాల్ ,పెంట సైదులు,సింగిరాల రవి, అకులపల్లి సుధాకర్,సాంబశివ రావు, మున్నయ్య, షబ్బీర్,లతీఫ్ బుచ్చయ్య, రఫీ, ధర్మేంద్ర మీసాల తదితరులు మునిసిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుగారి అధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు గారి సమక్షంలో బీ ఆర్ యస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంజనేయ రాజు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, పున్నా రాధ కృష్ణ, యార్రమళ్ళ దినేశ్, చిన్న మల్లయ్య, మీసాల జగదీష్, పెంకే రాంబాబు, sk అజ్గర్, ఆవుల బాలు యాదవ్, సత్యనారాయణ చారి, కుంచం శివకృష్ణ, పెరుమాళ్ల ధనమ్మ, మర్రి పద్మ తదితరులు పాల్గొన్నారు

అలుపెరగని సూర్యాపేట గులాబీ సేన

సూర్యాపేట లో బీఆర్‌ఎస్‌ ప్రచారం అలుపెరగకుండా సాగుతున్నది. రాష్ట్ర మంత్రి,అభ్యర్ధి జగదీష్ రెడ్డి తొ పాటు శ్రేణులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరూరా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు పోలింగ్ సమీపిస్తున్న కొద్ది బిఆర్ఎస్ లో కి కాంగ్రెస్ ,బిజెపి నేతలు క్యూ కడుతున్నారు. చెరికల తో చివ్వెంల మండలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది.. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, సీనియర్ నాయకులు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రవి నాయక్, కాంగ్రెస్ జడ్పీటిసి అభ్యర్ధి సురేష్ నాయక్ తొ పాటు , బిజేపి నాయకులు రాజేందర్ సురేష్, యాదగిరి సాయికుమార్, గిరి లు జాయిన్ అయ్యారు. వస్త్రం తండాలో బిజేపి చెందిన వార్డు మెంబర్లు , పెన్పాడు మండలం లింగాల గ్రామానికి చెందిన టిడిపి సిపిఎం పార్టీకి చెందిన యూత్ నాయకులు అనపంగా సైదులు, జానయ్య ,మట్టయ్య మధు యాదవ్ పవన్ లు బిఆర్ఎస్ చెరారు. ఆత్మకూరు మండలం చెందిన బొప్పారం నుండి కాంగ్రెస్ నాయకులు రంగయ్య, ప్రతాప్ రెడ్డి,తుమ్మల పెన్ పహాడ్ గ్రామాల నుండి ఉయ్యాల రమేష్ నవీన్ వెంకటేష్, ప్రవీణ్ ,గణేష్, సైదులు , బిఆర్ఎస్ లో చేరగా, కండువాలు కప్పిన మంత్రి సాదరంగా ఆహ్వానించారు.

పతి కోసం సతీమణి ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి ,జగదీష్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ.. ఆయన సతీమణి సునిత జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.సూర్యాపేట అభివృద్ధికి జగదీష్ రెడ్డి చేస్తున్న ,చేపట్టబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. సూర్యాపేట ను మరింత అభివృద్ధి చేసేందుకు మరోమారు ఆశీర్వదించాలని కోరారు . సూర్యాపేట అభివృద్ధి విషయానికొస్తే రాష్ట్ర ఏర్పాటుకు ముందు తర్వాత అన్న పద్ధతిలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

BRSకు జై కొట్టిన రాష్ట్ర మాల సంఘాల JAC

అభివృద్ధి అంటేనే కంచర్ల ... కంచర్ల అంటేనే అభివృద్ధి..

మాలల సమస్యలను పరిష్కరించే సత్తా BRSకే ఉందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల JAC ఛైర్మన్ చెరుకు రాంచందర్ అన్నారు.

VT కాలనీలోని MLA గారి క్యాంప్ అఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ మాట్లాడుతూ.. 

20 ఏళ్ళు MLAగా ఉండి కోమటిరెడ్డి నల్గొండకు ఏం అభివృద్ధి చేశారో చెప్పకుండా.. స్కీములంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 

నల్గొండ అభివృద్ధి అంటేనే కంచర్ల భూపాల్ రెడ్డి గారని.. అంచలా నల్గొండను అభివృద్ధి చేశారని, ఇది ఎవరో చెప్పడం కాదూ.. నల్గొండను చూస్తేనే తెలుస్తుందని అన్నారు. అందుకే రెండో దఫా కంచర్ల భూపాల్ రెడ్డి MLAగా 50 వేల మెజారిటీతో గెలుస్తారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ది కోసం CM KCR అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, దళిత బంధు ద్వారా దళితులను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు KCR తీసుకున్న చొరవ అద్వితీయమైనదని ఆయన కొనియాడారు.  

125 అడుగుల అంబెడ్కర్ విగ్రహంతో పాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయమన్నారు

ఆడపడుచుల పెళ్ళిళ్ళ కొరకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు..

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ఛైర్మన్ తాళ్ళపల్లి రవి , కన్వీనర్ నల్లాల కనకరాజు , వినోద్ కుమార్, నరసింహ, మేక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జగదీషన్న పై అభిమానం చాటిన టైలర్ అన్న

సూర్యాపేట లో అభివృద్ధి పరుగులు పెట్టించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగదీష్ అన్నకు మద్దతుగా సబ్బండ వర్గాలు ఏకమవుతున్నాయి. సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ వద్ద ఓ టైలర్ అన్న చాటిన అభిమానమే దీనికి నిదర్శనం. తమ షాపు ముందు నుండి మంత్రి కాన్వాయ్ వెళ్లడానికి గమనించిన టైలర్ దేవేంద్ర చారి పరుగున వెళ్లి కాన్వాయ్ ను ఆపాడు. దేవేంద్ర చారి రాకను గమనించిన మంత్రి వాహనం ఆపాల్సిందిగా సిబ్బందికి సూచించారు. మంత్రి వద్దకు చేరుకున్న దేవేంద్ర చారి సూర్యాపేటలో మీరు చేసిన అభివృద్ధికి ఉడతా భక్తిగా మీరు సమ్మతిస్తే నా చేతులతో మీకు బట్టలు కుట్టి బహుమానంగా ఇస్తానని తన కోరికను మంత్రికి తెలిపారు. టైలర్ అన్న కోరికకు మొదట ఆశ్చర్యపోయిన మంత్రి, అతని కోరిక మేరకు కాన్వాయ్ దిగి టైలర్ దుకాణంలోకి వెళ్లి కొలతలు ఇచ్చారు. మంత్రి రాకతో చెప్పలేని ఆనందంతో కొలతలు తీసుకున్న టైలర్ దేవేంద్ర చారి తన కోరికను తీర్చిన మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో సూర్యాపేట ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు వచ్చాయని, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో జీవన్ సాగిస్తున్నామని దేవేంద్ర చారి తెలిపారు. మూడోసారి మంత్రి జగదీష్ రెడ్డి సాధించడం ఖాయం అన్న చారి, పట్టణ ప్రజలంతా జగదీష్ అన్నకు అండగా నిలబడి భారీ మెజార్టీతో మూడవ సారి గెలిపించాలని కోరారు.

నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నామినిషన్ ప్రక్రియ ముందు తమ కుటుంబానికి సెంటిమెంట్ గా వస్తున్న పలు ఆలయాలను సందర్శించారు. తొలుత ఆత్మకూర్ మండలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాధం తీసుకున్నారు. ఆ తరువాత నకిరేకల్ నియోజకవర్గం లోని పాలెం లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ముడుపుకట్టి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ నుండీ అర్వపల్లి లోని శ్రీశ్రీశ్రీ యోగానంద లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో తుంగతుర్తి టిఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత సూర్యాపేట పట్టణం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు.

అనంతరం తన నివాసానికి చేరుకుని అక్కడ తన తండ్రి చంద్రారెడ్డి, అక్కా- బావ గారైన కట్టా శేఖర్ రెడ్డి- రేణుక దంపతులకు, అన్న వదినలు రమేష్ రెడ్డి,- మణిమాల దంపతులకు పాదాభివందనం చేశారు.అనంతరం నియోజకవర్గ నలుమూలల నుండి స్వచ్ఛందంగా తరలి వచ్చిన పార్టీ నేతలు,కార్యకర్తల నినాదాల నడుమ ధర్మ బిక్షం చౌరస్తాకు వెళ్లారు. అక్కడి నుండి పాదయాత్ర ద్వారా ర్యాలీ గా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు బయలుదేరి వెళ్లారు.

సూర్యాపేట ప్రజల ధైర్యం భీఆర్ఎస్

60 ఏళ్ళు నాశనమైన సూర్యాపేటను అభివృద్ధి చేసిన ఘనత భీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో విద్యానగర్ పార్టీ కార్యాలయంలో 35 వ వార్డు చర్చి కాంపౌండ్ కు చెందిన కాంగ్రెస్ బిజెపి నేతలు ముకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయ శేఖర్, రాంబాబు, రాజశేఖర్ లతోపాటు 400 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు గులాబీ తీర్దం పుచ్చుకున్నారు. మంత్రికి మద్దతుగా ఏకగ్రీవంగా తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సూర్యాపేట ప్రజల ధైర్యం భీఆర్ఎస్ పార్టీ అన్నారు. సూర్యాపేటలో అభివృద్ధి కారు స్పీడ్ తో వెళ్తుందన్న మంత్రి, 2014లో కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట ప్రజలను మూసి మురికి నీటి పీడ నుండి విముక్తి కల్పించి, గోదావరి జలాలను తీసుకొచ్చిందన్నారు. గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే నే పెద్ద యజ్ఞం చేసే పరిస్థితులు ఉండేవన్నారు. సూర్యాపేట అభివృద్ధి నే ప్రామాణికంగా పని చేసిన నేను ఆనాడు ప్రజలకు చెప్పకున్నా మెడికల్ కళాశాల ను తెచ్చాను అన్నారు.. ఆనాడు కారు గుర్తుకు వేసిన ఓటు సూర్యాపేట కు బోటు తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చింది అన్నారు. సూర్యాపేట లో వ్యాపారులు ధైర్యం గా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారంటే దానికి కారణము ఇక్కడి శాంతి భద్రతలు, ఇక్కడ నెలకొని ఉన్న ప్రశాంత వాతావరణమే అన్నారు. ప్రస్తుతం సూర్యాపేట కు వచ్చిన షాపింగ్ మాల్సే సూర్యాపేట అభివృద్ధికి గీటురాయిగా పేర్కొన్నారు.

మంది ని ముంచడానుకి దొంగలంతా ఒక్కటవుతున్నారన్న మంత్రి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ అన్నారు. ఓటు విలువ చాలా గోప్పదన్న మంత్రీ, మన తల రాతను నిర్ణయించేది మనం వేసే ఓటే అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సూర్యాపేటకు లొ పారిశ్రామిక హభ్ ను ఏర్పాటుచేసి పదివేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తానని పేర్కొన్నారు. చెప్పిన హామీలన్నీ నెరవేర్చడంతోపాటు, చేయబోయే కార్యక్రమాలను లిఖితపూర్వకంగా ప్రజల ముందు ఉంచిన ఏకైక పార్టీ దేశంలో బిఆర్ఎస్ మాత్రమే అన్నారు. లిఖితపూర్వకంగా ప్రజలకు హామీ ఇచ్చే ధైర్యం మరే పార్టీకి లేదన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే జరుగుతున్న అభివృద్ధి పనులను కొనసాగించడంతోపాటు, రైతు బీమా తరహాలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు పెంపు, ఆసరా పెన్షన్లు 5000 రూపాయలు, దివ్యాంగులకు 6000, సౌభాగ్య లక్ష్మి, అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్న బియ్యం, కెసిఆర్ ఆరో ఆరోగ్య రక్ష ద్వారా 15 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం, ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు, అగ్రవర్ణ పేదలకు సైతం గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సబ్బండావర్గాల సంక్షేమమే భీఆర్ఎస్ లక్ష్యం అన్న మంత్రి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.