మాదిగల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలిపిన నల్లగొండ MRPS అధ్యక్షులు
మాదిగల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం
కంచర్ల భూపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా కమిటీ
కంచర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించి మాదిగల సత్తా చూపించాలి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాదిగల ద్రోహి
బిజెపి కాంగ్రెస్ లు మాదిగల ప్రథమ శత్రువులు
నల్లగొండ నియోజక అభివృద్ధి, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కంచర్ల భూపాల్ రెడ్డి తోనే సాధ్యం
దళిత బంధు నిరంతరం జరిగే ప్రక్రియని ప్రతి దళిత కుటుంబానికి అందుతుంది
ఎస్సీ ల వర్గీకరణకు.. కెసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉండటం హర్షణీయం
----- మారపాక నరేందర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ టీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు.
నేడు..వీటీ కాలనీ లోని నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో... ఎమ్మార్పీఎస్... టిఎస్.. జిల్లా శాఖ అధ్యక్షులు.. మారపాక నరేందర్... ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో... వారు మాట్లాడుతూ..మాదిగల అభివృద్ధి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని.. వారి నాయకత్వంలోనే అనేక సంక్షేమ ఫలాలు మాదిగలు అనుభవిస్తున్నారన్నారు.. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో.. నల్గొండ నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న.. కంచర్ల భూపాల్ రెడ్డి గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని.. ఈ ఎన్నికల్లో భూపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మాదిగల సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు..
బిజెపి కాంగ్రెస్ పార్టీలు మాదిగల ప్రధాన శత్రువు అని ఆ పార్టీలను భూస్థాపితం చేయాలని మాదిగలకు పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడే మోదీకి, కిషన్ రెడ్డికి.. వర్గీకరణ గుర్తుకొస్తదని అన్నారు... నల్లగొండ అభివృద్ధి కంచర్ల భూపాల్ రెడ్డి గారితోనే సాధ్యమని.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కంచర్ల భూపాల్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని... నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని .. అందుకే తాము వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళిత ద్రోహి అని... కాంగ్రెస్ పార్టీ స్కాముల పార్టీ అని బిజెపి మతతత్వ పార్టీ అని.. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలకు తమ మద్దతు ఉండదన్నారు... దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని.. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఈ పథకం అందుతుందని కెసిఆర్ ప్రకటించడం హర్షినియమని.. ఈ ఎన్నికల్లో మాదిగలంతా కూడా బిఆర్ఎస్ పార్టీకి.. తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి విజయం కోసం కృషి చేస్తామని తెలియజేశారు..
ఈ ప్రెస్ మీట్ లో ... పుల్లెంల ఏడుకొండలు మాదిగ ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పుల్లెంల యాదయ్య మాదిగ,..
బొస్క శ్రీను మాదిగ తిప్పర్తి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు,
బరిగల యాదయ్య మాదిగ నల్లగొండ మండల అధ్యక్షులు.
పెరిక వెంకటేశ్వర్లు కనగల్ మండల అధ్యక్షులు... లింగయ్య మాదిగ మాడుగుల రమేష్ మాదిగ జానయ్య మాదిగ కొమ్ము సుదర్శన్ మాదిగ నరేందర్, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.



ప్రస్తుతం దేశం ఉల్లి ధరల్లో గణనీయమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది. గతంలో కిలో ఉల్లి ధర రూ. 30 నుంచి రూ. 40గా మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుతం, ఉల్లిపాయలను చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక కిలో ఉల్లిపాయలను రూ. 80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు.
BRS కంచర్ల భూపాల్ రెడ్డి గారికి MIM మద్దతు ..

మునుగోడు లో బీఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నాం.
Bank Loan Rules: బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్‌బీఐ నుంచి శుభవార్త, జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.
బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి.
బిఎస్పి పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి అందోజు శంకరా చారి నామినేషన్ విత్డ్రా.
Nov 19 2023, 15:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.5k