టీడీపీ అధినేత చంద్రబాబు గారిని తక్షణం రాజమండ్రి జైలు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కి చేర్చాలి.. ఆలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం రంగాపురం గ్రామం లో బాబు తో నేను మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. నార్పల గూగూడు రోడ్డు లో ధర్నా చేసి రోడ్డు మీద విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు తక్షణమే జైలు నుంచి మంగళగిరి లో కేంద్రం ప్రభుత్వం ఆదీనం లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కు చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని,ఈవైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు అదే స్ఫూర్తితో రాబోయే ఆరు నెలల పాటు ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త సైనికుడై ముందుకు సాగాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు గారి ఆక్రమ అరెస్టు వివరిస్తూ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దాంతోపాటు బాబు తో నేను కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మనమందరం సమిష్టిగా ఉంటూ పోరాటం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్, బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, రంగాపురం ముగేతిమ్మామ్ పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Oct 14 2023, 07:50