Anantapur

Oct 14 2023, 07:43

టీడీపీ అధినేత చంద్రబాబు గారిని తక్షణం రాజమండ్రి జైలు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కి చేర్చాలి.. ఆలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం రంగాపురం గ్రామం లో బాబు తో నేను మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. నార్పల గూగూడు రోడ్డు లో ధర్నా చేసి రోడ్డు మీద విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు తక్షణమే జైలు నుంచి మంగళగిరి లో కేంద్రం ప్రభుత్వం ఆదీనం లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కు చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని,ఈవైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు అదే స్ఫూర్తితో రాబోయే ఆరు నెలల పాటు ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త సైనికుడై ముందుకు సాగాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు గారి ఆక్రమ అరెస్టు వివరిస్తూ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దాంతోపాటు బాబు తో నేను కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మనమందరం సమిష్టిగా ఉంటూ పోరాటం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్, బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, రంగాపురం ముగేతిమ్మామ్ పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Anantapur

Oct 14 2023, 07:34

యాంత్రికరణ పరికరాలను సబ్సిడీ పై సరఫరా చెయ్యండి.... జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు , కన్వీనర్ శ్రీ ఆలూరి రమణ రెడ్డి గారు..
యాంత్రికరణ పరికరాలను సబ్సిడీ పై సరఫరా చెయ్యండి.... జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు , కన్వీనర్ శ్రీ ఆలూరి రమణ రెడ్డి గారు.. మండలములోని వ్యవసాయ కార్యాలయం లో మండల వ్యవసాయసలహా మండలి అధ్యక్షులు శ్రీ పెద్దకొండయ్య అధ్యక్ష్యతన జరిగిన సమావేశం లో జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో పశుసంపద తగ్గినందులవలన కూలీల కొరత ఉన్నందులవలన యాం త్రికరనదిశగా రైతులు అడిగిడుతున్నారని ప్రస్తుతం గ్రూపుల వారీగా రైతుభరోసా కేంద్రాలలో సబ్సిడీ పై సరఫరా చేసారని వ్యక్తిగతంగా కూడా సబ్సిడీ పై మినీ ట్రాక్టర్ లు టార్పాలిన్ లు 50% సబ్సిడీ తో స్ప్రేయర్ లు పంపిణి చేసేటట్టు ప్రత్తిపాదనలు పంపాలని కోరారు. ADA శ్రీ రవి గారు మాట్లాడుతూ పప్పు శనగను 4గ్రాములలో పంపిణి చేస్తున్నామని గతంలో గరిష్టంగా ఒక క్వింటల్ మాత్రమే సరఫరా చేసేవారమణి ఇప్పుడు గరిష్టంగా 5 ఎకరాలు ఉన్న రైతుకు 2 క్వింటాలు 40% సబ్సిడీ తో సరఫరా చేస్తున్నామని అదనంగా 300 క్వింటాల్లకు ప్రత్తిపాదనలు ఉన్నతధికారులకు పంపమని వచ్చిన వెంటనే సరఫరా చేస్తామని,పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు ekyc పూర్తి చెయ్యాలని తెలియజేసారు.AD పశుస oవర్ధక శాఖ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ పశువులలో ముద్ద వ్యాధి నివారణకు టీకాలు వేసుకోవాలని గడ్డి విత్తనాలు 75% సబ్సిడీ తో సరఫరా చేస్తున్నామని తెలియజేసారు.మైక్రో ఇరిగేషన్ అధికారిని మాట్లాడుతూ 600 డ్రిప్ యూనిట్ లు మండలమునకు వచ్చాయని 220 మంజూరు చేశామని మిగతా వాటికీ రైతులు డి డి లు తియ్యవలేనని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు చేదుళ్ల శ్రీనివాస రెడ్డి,కొర్రపాడు ఉపసర్పంచ్ శ్రీనివాసరెడ్డి, JCS కన్వీనర్ బయపురెడ్డి, రేకులకుంట లక్ష్మీనారాయణ, కొండా రెడ్డి, ఎంపీటీసీ శివా రెడ్డి, డీలర్ ల సంగంఅధ్యక్షులు రమాకాంత్, rbk ఇంచార్జి లు ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

Anantapur

Oct 14 2023, 07:27

అమ్మవారికి బోనం సమర్పించి న మండల ఎంపీపీ దాసరి సునీత గారు..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామంలోని పెద్దమ్మ తల్లి 5 వ బోనాల జాతర కార్యక్రమంలో అమ్మవారికి బోనం సమర్పించి న మండల ఎంపీపీ దాసరి సునీత గారు

Anantapur

Oct 14 2023, 07:20

అమ్మవారిని దర్శించుకున్నా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెడ్పిటిసి నీలం భాస్కర్ చేపల రమణ టి సూర్యనారాయణ రెడ్డి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి 5వ బోనాల వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెడ్పిటిసి నీలం భాస్కర్ చేపల రమణ టి సూర్యనారాయణ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

Oct 14 2023, 07:11

బుక్క రాయసముద్రం మండలం ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పసలూరి గ్రామమునందు పల్లెనిద్ర చేసిన ఎస్సై రూస్సేంద్ర బాబు
బుక్క రాయసముద్రం మండలం ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పసలూరి గ్రామమునందు పల్లెనిద్రలో భాగంగా ఇటుకలపల్లి ఎస్సై రూస్సేంద్ర బాబు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలతో వారు మాట్లాడుతూ గ్రామమునందు అసాంఘిక కార్యక్రమాలు కానీ జూదం పేకాట పేకాట మద్యం కోడిపందాలు మటక అధిక వడ్డీలు వంటి ప్రధానమైన సమస్యలు వాటి నుండి జరుగు అనర్థాలను ప్రజలకు తెలియజేయడం జరిగినది ఎవరైనా చట్టానికి అతిక్రమించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యంగా యువత అసాంఘిక కార్యక్రమాల వైపు పోకుండా తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అందరము బాగుందాము అందరిలోనూ మనం ఉందాం అని ప్రజలతో కలిసి మమేకమైనారు పసలూరు గ్రామంలో పల్లెనిద్ర ద్వారా కార్యక్రమం నిర్వహించారు

Anantapur

Oct 14 2023, 07:04

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య సలహాదారులు శ్రీ ఆలూరు సాంబశివ రెడ్డి గారు...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు లో ఉన్న డాక్టర్ B R అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు 26-11-2023 న సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారి చేతుల మీదుగా పాఠశాల నందు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ పాఠశాల భవనం ప్రారంభోత్సవ రోజున ఎమ్మెల్యే గారు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆ రోజే మాట ఇచ్చరు. అందుకు ఈరోజు ఆ స్కూల్ ఆవరణలో విగ్రహ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎడ్యుకేషన్ సీఈవో శ్రీ ఆలూరు సాంబశివ రెడ్డి గారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి కావాలని ఆలూరు సాంబశివ రెడ్డి గారు గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బుక్కరాయసముద్రం మండలం జడ్పిటిసి నీలం భాస్కర్ ,వజ్రం గంగరాజు, రేకులకుంట లక్ష్మీనారాయణ, పాలు గుండప్ప పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Anantapur

Oct 12 2023, 18:02

Flash News.. పాము కాటుకు గురై మరణించిన రైతు మల్లికార్జున రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన.. అనంతపురం టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
సింగనమల మండలం ఏకులనాగేపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున్ రెడ్డి తన సొంత పొలంలో బెండకాయలు కోస్తుండగా పాము కాటుకు గురై తీవ్ర అవస్థత గురైన ఆయనను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు మరణించిన రైతు మల్లికార్జున రెడ్డి మృతదేహాన్ని ఆయన కుటుంబాన్ని అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి గుమ్మేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్రెడ్డి భాష ధనుంజయ శ్రీనివాసులు తదితరులు పరామర్శించి రైతు కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది

Anantapur

Oct 12 2023, 17:53

జగనన్న కాలనీలలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతల వివాదంపై స్పందించిన జడ్పిటిసి నీలం భాస్కర్
విమర్శించడమే పనిగా పెట్టుకుని విమర్శిస్తున్న ప్రపంచ మేధావులారా ఓక్కోక్క ఇంకుడు గుంతకు 2000 రూపాయలు లాభం ఉంది అని అంటున్నారు అలాంటప్పుడు ఆ కాంటాక్ట్ వర్క్ మొత్తం మీకే ఇస్తాము మీరే చేయండి. నిజంగా ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ సరి చేయండి ఇక్కడ ఇలా కాకుండా ఇంకో రకంగా చేయండి అని చెప్పడం గొప్ప. మొత్తం ఈ పథకమే తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇంకుడు గుంతల కోసం ఉపయోగించే రింగులలో నాసిరకం మేలురకమని ఉండవు రింగులు తయారు చేసే వారిని బట్టి దాని మన్నిక ఉంటుంది. వందలలో పనులు జరిగేటప్పుడు ఎక్కడో ఒకచోట తప్పు జరగడం సహజం కానీ మొత్తం పని అంతా తప్పు అనడం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టు అంటున్నారు ఇది మీరు మద్దతుగా ఉన్న గత ప్రభుత్వంలో వారికి వర్తిస్తుంది కానీ ఈ ప్రభుత్వంలో పని చేసే మాకు కాదు. నేను మేధావి అనుకోవడం తప్పుకాదు కానీ అంతా నాకే తెలుసు అనుకోవడంలోనే మనమంటే ఏమిటో తెలుస్తుంది.

Anantapur

Oct 12 2023, 17:46

జగనన్నా మీ పేరుతో ఉన్న కాలనీల్లో నడి రోడ్డు మీద ఇంకుడు గుంతల బాగోతం కళ్ళారా చూడన్నా సిపిఎం విజ్ఞప్తి
జగనన్నా మీ పేరుతో ఉన్న కాలనీల్లో నడి రోడ్డు మీద ఇంకుడు గుంతల బాగోతం కళ్ళారా చూడన్నా సిపిఎం విజ్ఞప్తి ఈ రోజు సిపిఎం బుక్కరాయసముద్రం మండల కమిటీ విలేఖరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ. నల్లప్ప, మండల కార్యదర్శి ఆర్. కుల్లాయప్ప పత్రికా ప్రకటన విడుదల చేసారు.* *సోప్ పిట్స్ (ఇంకుడు గుంతలు) ఎవరి లబ్ధికోసం సిపిఎం సూటి ప్రశ్న. ఈ సందర్భంగా నాయకుల మాట్లాడుతూ 2018-19 లో ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వ్యక్తి గతంగా ఇళ్ల దగ్గర తమ ఖాళీ జాగాలో ఏర్పాటు చేసుకొని వర్షం నీరు, ఇంట్లో ని స్నానం, బట్టలు. నీళ్లు భూగర్భంలో ఇంకెందుకు ఉద్దేశించింది. ఉపాధి పనుల్లో ఎక్కడా కాంట్రాక్టర్ బృందం చేయాలనే నిబంధన లేదు.* *సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగే విధంగా లబ్దిదారుల ద్వారా చేయించాల్సిన పనులు* *అత్త సొమ్లుకు అల్లుల్లు ఎదురు చూపు :-* *జగనన్న కాలనీల్లో కేంద్రం నుండి రూ.1.5 లక్షలు నిధులతో ఇల్లు నిర్మిస్తూ, కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులను లబ్దిదారులకు ఇవాల్సిన 30 వేల రూపాయల ల్లో మరుగుదొడ్డి నిర్మాణానికి (23 వేలు) పోగా మిగిలిన 7 వేల రూపాయల్లో ఇంకుడు గుంత కోసం ఇవ్వాలని ఉంది. ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై లబ్దిదారుల ప్రమేయం లేకుండానే నడి రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుంది, లబ్దిదారులు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న వారికి ఈ నిధులను నేరుగా అర్హతను బట్టి ఇవ్వవచ్చు. అందుకు వారు గుంతలు సిమెంట్ రింగులు వేసినట్లు తీసుకున్న చిత్రాల ద్వారా అర్హతను గుర్తించి ఇవ్వవచ్చు. జగనన్న కాలనీల్లో రోడ్లు సరిగాలేవు. డ్రైనేజీ కాలువలు వేయవచ్చు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి తప్ప మరొకటి కాదని సిపిఎం మండల కమిటీ భావిస్తున్నది.* *నడి రోడ్లపై ఇంకుడు గుంతాల బుద్ది ఉన్న ఏ ఇంజనీరు చేయించరు.:-* *కాలనీల్లో గృహ నిర్మాణ శాఖ నుండి విధులు నిర్వర్తించే అధికారులు లబ్దిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ అధికారులకు నడిరోడ్ల మీద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని తెలియవా? తెలిసిన మేము కాదు కాపురాలు ఉండేది జనం కదా ఎవరు నాశనం అయితే నాకేమీ మా జీతాలు, మాకు టిఫిన్లు, ఇతర రూపాల్లో ఇస్తే ఊడిగం చేస్తుంటారా అని ప్రజలు అనుకుంటున్నారు.* *నడి రోడ్డు పై ఇంకుడు గుంతలు కొత్త తరహా నిర్మాణాలకు తెర లేపిన ఓ ఇంజనీరు గిన్నిస్ రికార్డ్ జాబితాకు ఎంపిక చేయాలి.* *అధికార పార్టీ నాయకుల అబ్ది కోసం లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్న సిబ్బంది :-* *ఇంకుడు గుంతల నిర్మాణం గురించి కొద్ది మంది లబ్దిదారులు ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి అయ్యి, ఖాళీ జాగాలు లేని వారు మీ కొంప ముందు రోడ్డులో వేసుకోవాలి. ప్రతి నాకొడుకు కు చెప్పాలి, మాకు వీకే పనులు లేవా అనే విధంగా మరి బరితెగించి లబ్దిదారుల మీదకు దుర్భాషలు మాట్లాడే ధైర్యం ఎవరిచ్చారు. మేము పని చేసేది ప్రజలకు కాదు కాంట్రాక్టర్ల కు అన్న చందంగా పనితీరు కనబడుతున్నదని లబ్దిదారులను కదిలిస్తే తెలుస్తుంది. స్వయాన సిపిఎం నాయకులు ఈ విషయమై సంబంధిత అధికారిని వివరణ అడిగితే ఇది అంతా వృదా కొత్తగా రోడ్లు, డ్రైనేజీ కాలువలు వేస్తే తొలగించాల్సిందే నేను చెప్పలేను అని నర్మగర్భంగా చెప్పారు.* *ఇంకుడు గుంతల వల్ల ఎవరికి లాభం :-* *ఇంకుడు గుంతల అవినీతి బాగోతం బలే గమ్మత్తు జగనన్న కాలనీల్లో పట్టపగలు దొంగలు పడ్డారు. నిలువు దోపిడీలాభం కోసం తప్ప ప్రజల ప్రయోజనం శూన్యం. జగనన్న కాలనీల్లో 1200 ఇళ్లకు ఇంకుడు గుంతల నిర్మాణం కు 66 లక్షల పనులు మంజూరు ఉపాధి హామీ పథకం లో కాంట్రాక్టర్ల హావా. నిబంధనలు విరుద్ధంగా లబ్దిదారులకు కాకుండా కాంట్రాక్టర్ కు లబ్ది. ఇంత చేసిన ఒక్కటి ఉపయోగ పడదు, డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్లు వస్తే ఇంకుడు గుంతలు తొలగించాల్సినదే.* *లాభాలు కోసం ఆరాటం :-* *సిపిఎం మండల కమిటి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల నుండి సేకరించిన వివరాలు ముడి సరుకు ధరలు, ఇతర అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఒక్కొక్క ఇంకుడు గుంతకు మంజూరు అయినది రూ. 500/- లబ్ధిదారుకు చేతికి రూ. 500/- కాంట్రాక్టర్ జేబుల్లోకి రూ.5000/- ఎలా వెళ్తుందో చూద్దాం.* *కాంట్రాక్టర్ పెట్టే ఖర్చు మూడు రంగులకు, మూతకు రూ.1500/-, జెసి బి ఖర్చు గుంత కు 200/- సిమెంట్, కూలి ఖర్చు రూ. 1300/- , (ఇవి లబ్ధిదారుని నెత్తిన పెట్టుతున్నారు) మొత్తం ఖర్చు రూ. 3000/-లోపే, ఇంకా ఖర్చు కొంత తగ్గవచ్చు, లాభం ఒక్కొక్కదానికీ అక్షరాల రూ.2000/-, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉన్న జగనన్న అన్ని లే అవుట్ లలో దాదాపు 1200లకు పైగా మంజూరు అయ్యాయి.* *60% పైగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఇంకుడు గుంతలు (720) ఏర్పాటు చేసుకుంటే కాంట్రాక్ట్ బృందం పెట్టుబడి 21.6 లక్షలు లాభం 14.4 లక్షలు* *డబ్బులు వృదా తప్ప ప్రయోజనం శూన్యం :-* *ఇంత చేసినా ఇంకుడు గుంతలు వృధా గా పూడ్చడానికి తప్ప ఎందుకూ పనికి రావు. నిపుణులతో విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వాస్తయి. ఇన్ని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే వచ్చే ప్రయోజనం శూన్యం, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు వేస్తే వీటిని తొలగించాలి. సిమెంట్ రోడ్లు వేస్తే ఇంకుడు గుంతలు తొలగించాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినవి అన్ని రోడ్ల మీద నే ట్రాక్టర్లు, ఆటోలు ఇరుక్కుంటే దిక్కెవరు..* *సిపిఎం మండల కమిటీ గుర్తించిన అంశాలు:-* *1. నడి రోడ్డులో ఇరువైపులా*ఇంకుడు గుంతలు హౌసింగ్ ఏ ఇ కనుసన్నల్లో ఏర్పాటు చేస్తున్నది వాస్తవం కాదా ?* *2. నాసిరకం సిమెంట్ రింగులు, మూరెడు పైపు, పగిలిన రింగులు, మూతలు ఇస్తున్న మాట వాస్తవం కాదా ?* *3. కన్ను మూస్తే రెడు, కన్ను తెరిస్తే రెండు రంగులు లబ్ధిదారులు అడిగితే మూడు చూడక పోతే రెండే రింగులు* *4. పని చేశామని మమ అనిపిస్తున్న కాంట్రాక్టర్ బృందం.* *5. దూదరెకుల మదారమ్మ ఇంటి ముందు వేసిన మూడు రోజులకే ట్రాక్టర్ వెళ్ళడం తో నడి రోడ్డు లో వేసినవి విరిగిపోయిన రంగులు వాస్తవం కాదా ?* *6. కాసులు కురిపిస్తున్న ఇంకుడు గుంతలు లబ్ధిదారుల ప్రమేయం లేకుండా బిల్లు ల కోసం ఒత్తిడి* *7. ఈపాటికే ఇళ్ళల్లో చేరిన వారికి ఇంటి ముందు రోడ్డు మీదే రంగులు ఏర్పాటు, రింగులు వేయించుకోక పోతే బిల్లులు రావని బెదిరింపు* *8. ఒక లబ్దిదారు తాను స్వంతంగా నిర్మించుకున్న గుంతలను ధ్వంసం చేసి కాంట్రాక్టర్ బృందం కొత్తగా తవ్విన తీరు. నాసిరకం, పగిలిన రింగులు లబ్దిదారులకు ఇస్తున్న కాంట్రాక్ట్* *9. ఇంటికి రోడ్డు మీద ఉన్న ఇంకుడు గుంత కు కనెక్షన్ కోసం ఇస్తున్న పివిసి పైపు కేవలం అడుగు పైపు, ఒక బెండు,* *10.కొద్ది లబ్ధిదారులకు రెండే రెండు రింగులు ఇచ్చి మూడో రింగ్ ఇస్తామని చెప్పి రెండు రింగులతోనే పూడ్చిన ఘనులు, మిగిలిన పైపు ఎవరిస్తారు. నిలదీస్తే ఇస్తారు లేదంటే గోవిందా?* *11. మూడు సిమెంటు రంగులకు మూడు అడుగుల వ్యాసం తో మూడు అడుగుల ఎత్తు కు కనీసం ట్రాక్టర్ గుండ్రాల్లు అవసరం అవుతాయి. కానీ కాంట్రాక్టర్ బృందం ఒకే ట్రిప్పును మూడు చోట్లకు సర్ది సగం సగం గుంతలు పూడ్చి కూలితే యమపురికి దారులు నిర్మిస్తున్నారు.* *12. కాలనీల్లో ఉన్న 20 అడుగుల రోడ్డు లో ఇప్పటికీ డ్రైనేజీ కాలువల కోసం వదిలితే 16 అడుగుల్లో ఇంకుడు గుంత కు 12 అడుగులు వేసుకుంటే రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా చూడాలి.* *తక్షణం జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని జిల్లా ఉన్న స్థాయి ఇంజనీర్లుతో కమిటీ వేసి విచారణ జరపాలి.* *నిధులు వృదా కాకుండా కాలనీల్లో డ్రైనేజీ కాలువలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.* *మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టి చేయాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సి. నాగేంద్ర. బి. హరికృష్ణ, నెట్టికంటయ్య, సంజీవరెడ్డి, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.*

Anantapur

Oct 12 2023, 17:22

ఎస్కేయూ నందు యం. ఏ అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగం నందు ప్రవేశాలు కొనసాగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభం..
ఎస్కేయు నందు విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వర్సిటీ అధికారులు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని విభాగాలను రద్దు చేసుకుంటూ పోతున్న వర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఇప్పటికైనా మార్చుకొని యధావిధిగా ప్రవేశాలు నిర్వహించి మరియు రేస్లైజేషన్ పేరుతో విభాగాలు రద్దు చేయడం ఉన్న అధ్యాపకుల పోస్టులను ఇతర విభాగాలకు బదిలీ చేయడని ఆపాలి వర్సిటీ అధికారులు ప్రవేశాలను జరిపేంతవరకు ఈ దీక్షలో కొనసాగుతాయంటూ విద్యార్థి నాయకులు తెలియజేశారు ఈ దీక్షకు రాష్ట్ర యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి మద్దతిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి రాష్ట్ర యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆలోచనలతో ముందుకు పోవడాన్ని ఆయన ఖండించడం జరిగింది అదేవిధంగా ఈ దీక్షకు ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు మురళి, మంజునాథ్ జిల్లా విద్యార్థి నాయకుడు బండారు శంకర్ మద్దతు ఇవ్వడం జరిగింది వారు మాట్లాడుతూ వర్సిటీ అధికారులు ప్రవేశాలను కొనసాగించేంతవరకు మా మద్దతు ఉంటుందని తెలియజేశారు* *నిరాహార దీక్షలకు చేస్తున్న వ్యక్తులు డాక్టర్ .ప్రతాప్ , డాక్టర్ .తిప్పే స్వామి ఐసా యూనివర్సిటీ కార్యదర్శి రాజు నాయక్, వైస్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు డాక్టర్. అంకన్న, డాక్టర్. కల్లప్ప ఐసా రాష్ట్ర అధ్యక్షులు వేమన , ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి రజినీకాంత్ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ లీడర్ గిరి మరియు సుధీర్, రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.