జగనన్నా మీ పేరుతో ఉన్న కాలనీల్లో నడి రోడ్డు మీద ఇంకుడు గుంతల బాగోతం కళ్ళారా చూడన్నా సిపిఎం విజ్ఞప్తి
జగనన్నా మీ పేరుతో ఉన్న కాలనీల్లో నడి రోడ్డు మీద ఇంకుడు గుంతల బాగోతం కళ్ళారా చూడన్నా సిపిఎం విజ్ఞప్తిఈ రోజు సిపిఎం బుక్కరాయసముద్రం మండల కమిటీ విలేఖరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ. నల్లప్ప, మండల కార్యదర్శి ఆర్. కుల్లాయప్ప పత్రికా ప్రకటన విడుదల చేసారు.* *సోప్ పిట్స్ (ఇంకుడు గుంతలు) ఎవరి లబ్ధికోసం సిపిఎం సూటి ప్రశ్న. ఈ సందర్భంగా నాయకుల మాట్లాడుతూ 2018-19 లో ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వ్యక్తి గతంగా ఇళ్ల దగ్గర తమ ఖాళీ జాగాలో ఏర్పాటు చేసుకొని వర్షం నీరు, ఇంట్లో ని స్నానం, బట్టలు. నీళ్లు భూగర్భంలో ఇంకెందుకు ఉద్దేశించింది. ఉపాధి పనుల్లో ఎక్కడా కాంట్రాక్టర్ బృందం చేయాలనే నిబంధన లేదు.* *సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగే విధంగా లబ్దిదారుల ద్వారా చేయించాల్సిన పనులు* *అత్త సొమ్లుకు అల్లుల్లు ఎదురు చూపు :-* *జగనన్న కాలనీల్లో కేంద్రం నుండి రూ.1.5 లక్షలు నిధులతో ఇల్లు నిర్మిస్తూ, కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులను లబ్దిదారులకు ఇవాల్సిన 30 వేల రూపాయల ల్లో మరుగుదొడ్డి నిర్మాణానికి (23 వేలు) పోగా మిగిలిన 7 వేల రూపాయల్లో ఇంకుడు గుంత కోసం ఇవ్వాలని ఉంది. ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై లబ్దిదారుల ప్రమేయం లేకుండానే నడి రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుంది, లబ్దిదారులు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న వారికి ఈ నిధులను నేరుగా అర్హతను బట్టి ఇవ్వవచ్చు. అందుకు వారు గుంతలు సిమెంట్ రింగులు వేసినట్లు తీసుకున్న చిత్రాల ద్వారా అర్హతను గుర్తించి ఇవ్వవచ్చు. జగనన్న కాలనీల్లో రోడ్లు సరిగాలేవు. డ్రైనేజీ కాలువలు వేయవచ్చు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి తప్ప మరొకటి కాదని సిపిఎం మండల కమిటీ భావిస్తున్నది.* *నడి రోడ్లపై ఇంకుడు గుంతాల బుద్ది ఉన్న ఏ ఇంజనీరు చేయించరు.:-* *కాలనీల్లో గృహ నిర్మాణ శాఖ నుండి విధులు నిర్వర్తించే అధికారులు లబ్దిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ అధికారులకు నడిరోడ్ల మీద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని తెలియవా? తెలిసిన మేము కాదు కాపురాలు ఉండేది జనం కదా ఎవరు నాశనం అయితే నాకేమీ మా జీతాలు, మాకు టిఫిన్లు, ఇతర రూపాల్లో ఇస్తే ఊడిగం చేస్తుంటారా అని ప్రజలు అనుకుంటున్నారు.* *నడి రోడ్డు పై ఇంకుడు గుంతలు కొత్త తరహా నిర్మాణాలకు తెర లేపిన ఓ ఇంజనీరు గిన్నిస్ రికార్డ్ జాబితాకు ఎంపిక చేయాలి.* *అధికార పార్టీ నాయకుల అబ్ది కోసం లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్న సిబ్బంది :-* *ఇంకుడు గుంతల నిర్మాణం గురించి కొద్ది మంది లబ్దిదారులు ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి అయ్యి, ఖాళీ జాగాలు లేని వారు మీ కొంప ముందు రోడ్డులో వేసుకోవాలి. ప్రతి నాకొడుకు కు చెప్పాలి, మాకు వీకే పనులు లేవా అనే విధంగా మరి బరితెగించి లబ్దిదారుల మీదకు దుర్భాషలు మాట్లాడే ధైర్యం ఎవరిచ్చారు. మేము పని చేసేది ప్రజలకు కాదు కాంట్రాక్టర్ల కు అన్న చందంగా పనితీరు కనబడుతున్నదని లబ్దిదారులను కదిలిస్తే తెలుస్తుంది. స్వయాన సిపిఎం నాయకులు ఈ విషయమై సంబంధిత అధికారిని వివరణ అడిగితే ఇది అంతా వృదా కొత్తగా రోడ్లు, డ్రైనేజీ కాలువలు వేస్తే తొలగించాల్సిందే నేను చెప్పలేను అని నర్మగర్భంగా చెప్పారు.* *ఇంకుడు గుంతల వల్ల ఎవరికి లాభం :-* *ఇంకుడు గుంతల అవినీతి బాగోతం బలే గమ్మత్తు జగనన్న కాలనీల్లో పట్టపగలు దొంగలు పడ్డారు. నిలువు దోపిడీలాభం కోసం తప్ప ప్రజల ప్రయోజనం శూన్యం. జగనన్న కాలనీల్లో 1200 ఇళ్లకు ఇంకుడు గుంతల నిర్మాణం కు 66 లక్షల పనులు మంజూరు ఉపాధి హామీ పథకం లో కాంట్రాక్టర్ల హావా. నిబంధనలు విరుద్ధంగా లబ్దిదారులకు కాకుండా కాంట్రాక్టర్ కు లబ్ది. ఇంత చేసిన ఒక్కటి ఉపయోగ పడదు, డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్లు వస్తే ఇంకుడు గుంతలు తొలగించాల్సినదే.* *లాభాలు కోసం ఆరాటం :-* *సిపిఎం మండల కమిటి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల నుండి సేకరించిన వివరాలు ముడి సరుకు ధరలు, ఇతర అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఒక్కొక్క ఇంకుడు గుంతకు మంజూరు అయినది రూ. 500/- లబ్ధిదారుకు చేతికి రూ. 500/- కాంట్రాక్టర్ జేబుల్లోకి రూ.5000/- ఎలా వెళ్తుందో చూద్దాం.* *కాంట్రాక్టర్ పెట్టే ఖర్చు మూడు రంగులకు, మూతకు రూ.1500/-, జెసి బి ఖర్చు గుంత కు 200/- సిమెంట్, కూలి ఖర్చు రూ. 1300/- , (ఇవి లబ్ధిదారుని నెత్తిన పెట్టుతున్నారు) మొత్తం ఖర్చు రూ. 3000/-లోపే, ఇంకా ఖర్చు కొంత తగ్గవచ్చు, లాభం ఒక్కొక్కదానికీ అక్షరాల రూ.2000/-, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉన్న జగనన్న అన్ని లే అవుట్ లలో దాదాపు 1200లకు పైగా మంజూరు అయ్యాయి.* *60% పైగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఇంకుడు గుంతలు (720) ఏర్పాటు చేసుకుంటే కాంట్రాక్ట్ బృందం పెట్టుబడి 21.6 లక్షలు లాభం 14.4 లక్షలు* *డబ్బులు వృదా తప్ప ప్రయోజనం శూన్యం :-* *ఇంత చేసినా ఇంకుడు గుంతలు వృధా గా పూడ్చడానికి తప్ప ఎందుకూ పనికి రావు. నిపుణులతో విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వాస్తయి. ఇన్ని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే వచ్చే ప్రయోజనం శూన్యం, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు వేస్తే వీటిని తొలగించాలి. సిమెంట్ రోడ్లు వేస్తే ఇంకుడు గుంతలు తొలగించాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినవి అన్ని రోడ్ల మీద నే ట్రాక్టర్లు, ఆటోలు ఇరుక్కుంటే దిక్కెవరు..* *సిపిఎం మండల కమిటీ గుర్తించిన అంశాలు:-* *1. నడి రోడ్డులో ఇరువైపులా*ఇంకుడు గుంతలు హౌసింగ్ ఏ ఇ కనుసన్నల్లో ఏర్పాటు చేస్తున్నది వాస్తవం కాదా ?* *2. నాసిరకం సిమెంట్ రింగులు, మూరెడు పైపు, పగిలిన రింగులు, మూతలు ఇస్తున్న మాట వాస్తవం కాదా ?* *3. కన్ను మూస్తే రెడు, కన్ను తెరిస్తే రెండు రంగులు లబ్ధిదారులు అడిగితే మూడు చూడక పోతే రెండే రింగులు* *4. పని చేశామని మమ అనిపిస్తున్న కాంట్రాక్టర్ బృందం.* *5. దూదరెకుల మదారమ్మ ఇంటి ముందు వేసిన మూడు రోజులకే ట్రాక్టర్ వెళ్ళడం తో నడి రోడ్డు లో వేసినవి విరిగిపోయిన రంగులు వాస్తవం కాదా ?* *6. కాసులు కురిపిస్తున్న ఇంకుడు గుంతలు లబ్ధిదారుల ప్రమేయం లేకుండా బిల్లు ల కోసం ఒత్తిడి* *7. ఈపాటికే ఇళ్ళల్లో చేరిన వారికి ఇంటి ముందు రోడ్డు మీదే రంగులు ఏర్పాటు, రింగులు వేయించుకోక పోతే బిల్లులు రావని బెదిరింపు* *8. ఒక లబ్దిదారు తాను స్వంతంగా నిర్మించుకున్న గుంతలను ధ్వంసం చేసి కాంట్రాక్టర్ బృందం కొత్తగా తవ్విన తీరు. నాసిరకం, పగిలిన రింగులు లబ్దిదారులకు ఇస్తున్న కాంట్రాక్ట్* *9. ఇంటికి రోడ్డు మీద ఉన్న ఇంకుడు గుంత కు కనెక్షన్ కోసం ఇస్తున్న పివిసి పైపు కేవలం అడుగు పైపు, ఒక బెండు,* *10.కొద్ది లబ్ధిదారులకు రెండే రెండు రింగులు ఇచ్చి మూడో రింగ్ ఇస్తామని చెప్పి రెండు రింగులతోనే పూడ్చిన ఘనులు, మిగిలిన పైపు ఎవరిస్తారు. నిలదీస్తే ఇస్తారు లేదంటే గోవిందా?* *11. మూడు సిమెంటు రంగులకు మూడు అడుగుల వ్యాసం తో మూడు అడుగుల ఎత్తు కు కనీసం ట్రాక్టర్ గుండ్రాల్లు అవసరం అవుతాయి. కానీ కాంట్రాక్టర్ బృందం ఒకే ట్రిప్పును మూడు చోట్లకు సర్ది సగం సగం గుంతలు పూడ్చి కూలితే యమపురికి దారులు నిర్మిస్తున్నారు.* *12. కాలనీల్లో ఉన్న 20 అడుగుల రోడ్డు లో ఇప్పటికీ డ్రైనేజీ కాలువల కోసం వదిలితే 16 అడుగుల్లో ఇంకుడు గుంత కు 12 అడుగులు వేసుకుంటే రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా చూడాలి.* *తక్షణం జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని జిల్లా ఉన్న స్థాయి ఇంజనీర్లుతో కమిటీ వేసి విచారణ జరపాలి.* *నిధులు వృదా కాకుండా కాలనీల్లో డ్రైనేజీ కాలువలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.* *మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టి చేయాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సి. నాగేంద్ర. బి. హరికృష్ణ, నెట్టికంటయ్య, సంజీవరెడ్డి, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.*
Oct 12 2023, 17:53