ఓటమి భయం తోనే సీఎం జగన్ రెడ్డి వ్యవస్థలను అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసారు.... ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
తప్పుడు కేసులు, అసత్య ప్రచారాలు చేస్తూ, దేశం గర్వించే నేత నారా చంద్రబాబు నాయుడు గారిని జైలులో పెట్టాలనే కక్ష్య తప్ప...ఆయన అరెస్టుకు ఎలాంటి కారణాలు, ఆధారాలు లేవు. లక్షకోట్ల రూపాయలు అవినీతితో ఆనాడే ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి జగన్ రెడ్డి అని అరాచక విధానాలను సామాన్య ప్రజలు కూడా ముక్తకంఠం తో వ్యతిరేకిస్తున్నరని అన్నారు.నార్పల మండలం నిలువురాయి గ్రామం లో *బాబుతో -నేను*,, *మరియు ప్రజా వేదిక- రచ్చబండ* కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి అక్రమ అరెస్ట్ గురించి తెలియజేసారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు.ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ ఏనాడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని వారు సైతం చంద్రబాబు గారికి బాసటగా నిలుస్తున్నారన్నారు. జగన్ రెడ్డి దుష్టపాలనను అంతమొందించాలని, చంద్రబాబు గారు చల్లని పాలన తిరిగి రాష్ట్రానికి అవసరమని అందరూ భావిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి విషకౌగిలి నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని అన్యాయంగా, జైల్లో పెట్టించి, తద్వారా జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు.అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు గారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. బాబుగారి అరెస్టును జీర్ణించుకోలేక జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు, బుత్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు చామూలూరు, నిలువురాయి టీడీపీ గ్రామ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు
Oct 11 2023, 20:33