పేదలపైవిద్యుత్ భారాలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లునిలిపివేయాలి.. డి.చిన్నప్పయాదవ్ సీపీఐ..
జీల్లాకౌన్సిల్ మెంబర్ వామపక్షాల పిలుపుమేరకు కల్లుమడీ గ్రామములో సీపీఐ అద్వర్యంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని కరపత్రాలు విడుధలచేసి కరపత్రాలుపంఫీణీ డి.చిన్నప్పయాదవ్ ,సీపీఐ మండలకార్యదర్శి టి.రామాంజినేయిలు అద్వర్యంలో పంఫీణీచేయడమైనది. ఈ సంధర్బంగా డి.చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ, శీతాకాలము వచ్చీనా వేసవి తలపించే గృహ విద్యుత్ బిల్లుభారీగా వస్తున్నాయి ప్రతినెల చార్జీలు విపరీతంగాపెంచి కేంద్రరాష్టప్రభుత్వాలుసామాన్యులపై పెనుభారము మోపుతున్నారు,కావున తక్షణమే పెంచినచార్జీలు తగ్గించాలి, 2000 సంవత్సరంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడారు. ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలర్పించారు. ప్రజలు తిరస్కరించిన ప్రపంచ బ్యాంకు సంస్కరణలను నేడు కేంద్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్ర సర్కార్ అమలు చేస్తోంది. భవిష్యత్తులో విద్యుత్ రంగం పూర్తిగా కార్పొరేట్ల కబంధహస్తాల్లోకి వెళుతున్నది. చార్జీలు మరింతగా భారం కానున్నాయి. తక్షణం విద్యుత్ భారాలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు ఆపాలి. ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలి . ప్రైవేటీకరణ ఆపాలి. విద్యుత్ చట్ట సవరణ ఉ పసంహరించుకోవాలి. ప్రజలందరూ చార్జీల భారం తగ్గింపు కొరకు, ప్రమాదకరమైన కార్పొరేటీకరణ విధానాలు రద్దుచేయాలి కోర్కెలు: విద్యుత్ బిల్లులు తగ్గించాలి. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలి. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు రాయితీని అందించాలి 200 యూనిట్లు లోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలి. విద్యుత్ సవరణ బిల్లు - 2022ను ఉపసంహరించుకోవాలి. పాల్గోన్నవారు, రామసుబ్బారెడ్ది, సుంకన్న,చంద్రా,ప్రకాశ్,శ్రీనివాసఅచారి,నల్లప్ప,నాగరాజు,పెద్దక్క,లక్ష్మి,బార్గవి,నల్లమ్మ,తదితరులుపాల్గోనడమైనది.
Oct 11 2023, 19:13