గూగుడు జంట దేవాలయాలల్లో, మసీదు లో,చర్చ్ లో ప్రత్యేక పూజలు చేసిన: అలం నరసా నాయుడు..
గూగుడు జంట దేవాలయాలల్లో, మసీదు లో,చర్చ్ లో ప్రత్యేక పూజలు చేసిన: అలం నరసా నాయుడు.. జగన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజాక్షేత్రంలో తెల్చుకుంటాం*.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పై అక్రమంగా కేసు పెట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వేదిస్తున్నడంతో చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని చంద్రుడిగా బయటకు రావాలని నార్పల మండలం గూగుడు గ్రామంలో హిందూ,ముస్లిం జంట దేవాలయాలు కుళ్ళాయస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలలో, మసీదు లలో,చర్చ్ లలో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా lరాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారుమాట్లాడుతూ మచ్చలేని చంద్రుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని జంట దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. వైయస్సార్సీపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు పై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు ఈ సైకో ప్రభుత్వానికి త్వరలో ప్రజలు ఓటు రూపంలో బుద్ది చెబుతారు అని అన్నారు. విద్యుత్ బిల్లులు ధరలు పెంచేస్తూ సంక్షేమ పథకాలకు కోత విధిస్తూ నవ మోసాల ప్రభుత్వంగా పేరుగాంచిందని ధ్వజమెత్తారు. అభివృద్ధిని మరచిపోయి ప్రశ్నించే వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేకత పెరగడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న భయంతోనే చంద్రబాబు అరెస్టుకు వైఎస్సార్ పార్టీ కుట్ర పన్నారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజాక్షేత్రంలో టెల్చుకుంటాం అని అన్నారు. టిడిపి హయాంలో 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని అన్నారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో 60 రూపాయలు అవినీతిని కూడా నిరూపించుకొలేక పోయారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు బుత్ ఇంచార్జ్ లు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Oct 11 2023, 19:08