కియాలాంటి పరిశ్రమలు ఎన్నో రాష్ట్రానికి తీసుకువచ్చి ఉద్యోగాలు ఇప్పించడం నేరమా... ఆలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 26వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష లో తలకు నల్లగుడ్డ కట్టుకొని నిరసన తెలపడం జరిగింది. *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు గారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. బాబుగారి అరెస్టును జీర్ణించుకోలేక జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జనసేన మండల కన్వీనర్ రామకృష్ణ,సిపిఐ మండల కన్వీనర్ గంగాధర్,రామయ్య, వైస్ మండల కన్వీనర్ భాస్కర్, సీనియర్ JSP లోకేష్,పెద్దన్న, శ్రీన,టీడీపీ మండల అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Oct 10 2023, 19:57