రాజకీయ కక్షతో చంద్రబాబు గారిపై పెట్టిన కేసులు ఖండిద్దాం తప్పుడు కేసులుపై గళ మెత్తుదాం.. ఆలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 25వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది.నిరాహార దీక్ష లో నల్లగుడ్డలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి కుండలతో సైకో పోవాలి సైకిల్ రావాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టేసి, అక్రమ కేసులు తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం హోదా కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని అన్నారు. న్యాయం చంద్రబాబు గారి వైపే ఉందని మా అధినేత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. నిరసన దీక్షలోఉన్నవారంతా వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సైకో పోవాలి... సైకిల్ రావాలి... అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్, VAITC జిల్లా నాయకురాలు నాగవేణి పాల్గొని మద్దతూ తెలపడం జరిగింది.bks నాయకులు కేశన్న, నారాయణస్వామి,మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Oct 08 2023, 07:46