రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు కాంతితో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నేను సైతం అంటూ కొవ్వొత్తుల వెలిగించి నిరసన వ్యక్తం చేసిన..చిన్న జలలాపురం సుధాకర్
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు కాంతితో చంద్రబాబు నాయుడు కు మద్దతుగా నేను సైతం అంటూ కొవ్వొత్తులతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల వెలిగించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిన్న జలలాపురం సుధాకర్ నరసింహులు నారాయణస్వామి ప్రసాద్ సురేష్ సతీష్ పాల్గొన్నారు
రాజకీయ కక్షతో చంద్రబాబు గారిపై పెట్టిన కేసులు ఖండిద్దాం తప్పుడు కేసులుపై గళ మెత్తుదాం.. ఆలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 25వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది.నిరాహార దీక్ష లో నల్లగుడ్డలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి కుండలతో సైకో పోవాలి సైకిల్ రావాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టేసి, అక్రమ కేసులు తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం హోదా కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని అన్నారు. న్యాయం చంద్రబాబు గారి వైపే ఉందని మా అధినేత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. నిరసన దీక్షలోఉన్నవారంతా వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సైకో పోవాలి... సైకిల్ రావాలి... అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్, VAITC జిల్లా నాయకురాలు నాగవేణి పాల్గొని మద్దతూ తెలపడం జరిగింది.bks నాయకులు కేశన్న, నారాయణస్వామి,మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూతలేరు బ్రిడ్జి పనులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
కూతలేరు బ్రిడ్జి పనులు పరిశీలన.. నార్పల మండల కేంద్రంలోని కూతలేరు బ్రిడ్జి పనులను రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి శనివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి తదితరులు
గూగూడు అభివృద్ధికి చర్యలు చేపట్టిన ప్రభుత్వ విద్యా సహదారులు.. ఆలూరు సాంబ శివారెడ్డి...
నార్పల మండలం గూగూడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ గూగూడు కుళ్లాయి స్వామి ఆలయ అభివృద్ధి కోసం అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు. గూగూడు కుళ్లాయి స్వామి భక్తాదుల కలలను వాస్తవ రూపం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శ్రీకారం చుట్టారు. సింగనమల నియోజకవర్గంకు ఎందరో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన గూగూడు అభివృద్ధి, భక్తాదులకు సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన చేయలేదు. ముఖ్యమంత్రి వైస్ జగనన్న స్ఫూర్తితో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబ శివారెడ్డిలు గూగూడు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా దాదాపు రూ.4 కోట్లు వ్యయంతో అంచనాలు వేస్తూ గ్రామ ప్రజలు, కుళ్లాయి స్వామి భక్తాదుల కలలను సాకారం చేయడానికి సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో గూగూడులో పర్యటించారు. కుళ్లాయి స్వామి భక్తుల సౌకర్యం కోసం అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, రోడ్డు విస్తరణ, భక్తులకు స్నానపు కొలను ఏర్పాటు, భక్తుల వాహనాల పార్కింగ్ ప్రదేశము, కళ్యాణ కట్ట, అభివృద్ధి పనులు చేయడానికి గ్రామంలో పర్యటించారు.
కేసులు నిలబడవు అని తెలిసి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతోంది=== అనంతపురం టీడీపి అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
కేసులు నిలబడవు అని తెలిసి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతోంది=== అనంతపురం టీడీపి అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి. కేసులు నిలబడేవని తెలిసి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతుందని సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ఆలం వెంకట నరస నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి పేర్కొన్నాడు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ని ఈ సైకో ప్రభుత్వం ఆధారాలు లేని కేసులో చంద్రబాబు నాయుడుని 28 రోజులుగా రిమాండ్ లో ఉంచి కక్ష సాధిస్తుందని ఎన్నాళ్ళు దుర్మార్గ పాలను కొనసాగిస్తారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రాయుడు నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి లోలూరు నారాయణస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాల్ వీరనారాయణ తదితరులు దీక్ష శివరంలో పాల్గొన్నారు
జిల్లా TNSF ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కు సంఘీభావం తెలిపిన *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు..
అనంతపురం అర్బన్ ఇంచార్జ్ వైకుంఠo ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష లో బాగంగా ఈరోజు జిల్లా TNSF ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కు సంఘీభావం తెలిపిన *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ కార్యక్రమం లో అనంతపురం అర్బన్ టీడీపీ నాయకులు సరిపూరి రమణ, శివబలా,నాటేష్, దేవుళ్ళ మురళీ, రాజారావు,నారాయణ స్వామి,రాంబాబు, కొండయ్య,TNSF నాయకులు గుత్తా ధనుంజయ నాయుడు, సాకే లక్ష్మీనరసింహ, ప్యారం భరత్, ప్రశాంత్, కప్పల నరేష్, శివ, ఓబుల్ రెడ్డి మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
దళితులపై దాడికి నిరసనగా మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి దళిత సంఘాల నాయకులు..
సింగనమల నియోజవర్గం గార్లదిన్నె మండలం ముకుందాపురం లో గత రాత్రి జరిగిన దళితులపై దాడికి నిరసనగా మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన దళిత సంఘాల నాయకులు
చెన్నంపల్లి గ్రామంలో సుమారుగా 403 మంది ఈ ఆరోగ్య సురక్ష క్రమంలో వారి ఆరోగ్య సమస్యలు చూపించుకోవడం జరిగినది..
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చెన్నంపల్లి గ్రామంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ డి సునీత గారు, జడ్పిటిసి నీలం భాస్కర్ గారు,YSRCP నాయకులు వెంకట్ రెడ్డి అన్న గారు, మండల కన్వీనర్ అంకె నరేష్ గారు, భయపు రెడ్డి అన్నగారు,మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి గారు, ఎంపీడీవో తేజోష్ణ గారు, నాగయ్య ఎంపీటీసీ గారు,రావడం జరిగినది. చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రఘు, జనరల్ సర్జన్ శరత్ రెడ్డి స్పెషల్ క్యాంపు కి హాజరయ్యారు. సుమారుగా 403 మంది ఈ ఆరోగ్య సురక్ష క్రమంలో వారి ఆరోగ్య సమస్యలు చూపించుకోవడం జరిగినది. 136 మందికి పరీక్షలు చేయడం జరిగినది.82 మందిని గవర్నమెంట్ ఆసుపత్రి అనంతపురంకి రిఫర్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల వైద్యాధికారి శ్రీహర్ష & వినోద్ తరపున సచివాలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.
కొత్త టయోటా రూమియన్ వాహనం ను ప్రారంభించిన అనంతపురం జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు సింగనమల మండలం నాగులగుగడ్డం గ్రామానికి చెందిన దాసరి గంగాధర్...
అనంతపురం టయోటా షోరూమ్ నందు ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ఆ తర్వాత కొత్త వాహనం టయోటా రూమియన్ ను ప్రారంభించిన అనంతపురం జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు సింగనమల మండలం నాగులగుగడ్డం గ్రామానికి చెందిన దాసరి గంగాధర్.
మేము సైతం బాబుకు మద్దతుగా రాచేపల్లి మాట్లాగొంది గ్రామపంచాయతీలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి...
మేము సైతం బాబుకు మద్దతుగా రాచేపల్లి మాట్లాగొంది గ్రామపంచాయతీలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ* *చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మేము సైతం అంటూ సింగనమల మండలం రాచేపల్లి మట్లగుంది గ్రామపంచాయతీలలో* *సైకో పాలనకు చరమగీతం పాడుదామని బాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనయుడు ముంటి మడుగు కేశవరెడ్డి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆదేశానుసారం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రామలలో చంద్రబాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని ఈ సైకో పాలనలో కక్ష తప్ప ప్రజలకు జరిగేది ఏమీ లేదని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ9261292612 నంబర్ కు మిస్సేడ్ కాల్ ఇస్తూ ప్రజలకు తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో సైకో పాలన తొలగిపోవాలంటే నారా చంద్రబాబునాయుడు గారికి మద్దతు తెలిపి 2024లో ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు* ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ దండు విజయ్ కుమార్ రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి మట్లగుంది పుల్లయ్య రమేష్ ఆదినారాయణ పాల గౌతం గణేష్ ప్రదీప్ రఘు రాముడు రాచేపల్లి శ్రీనాథ్ వెంకటస్వామి జిల్లా బీసీ సెల్ కార్యనిర్వ కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాల్ వీరనారాయణ జిల్లా ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు