కేసులు నిలబడవు అని తెలిసి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతోంది=== అనంతపురం టీడీపి అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
కేసులు నిలబడవు అని తెలిసి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతోంది=== అనంతపురం టీడీపి అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి. కేసులు నిలబడేవని తెలిసి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెడుతుందని సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ఆలం వెంకట నరస నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి పేర్కొన్నాడు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ని ఈ సైకో ప్రభుత్వం ఆధారాలు లేని కేసులో చంద్రబాబు నాయుడుని 28 రోజులుగా రిమాండ్ లో ఉంచి కక్ష సాధిస్తుందని ఎన్నాళ్ళు దుర్మార్గ పాలను కొనసాగిస్తారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రాయుడు నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి లోలూరు నారాయణస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాల్ వీరనారాయణ తదితరులు దీక్ష శివరంలో పాల్గొన్నారు
జిల్లా TNSF ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కు సంఘీభావం తెలిపిన *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు..
అనంతపురం అర్బన్ ఇంచార్జ్ వైకుంఠo ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష లో బాగంగా ఈరోజు జిల్లా TNSF ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కు సంఘీభావం తెలిపిన *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ కార్యక్రమం లో అనంతపురం అర్బన్ టీడీపీ నాయకులు సరిపూరి రమణ, శివబలా,నాటేష్, దేవుళ్ళ మురళీ, రాజారావు,నారాయణ స్వామి,రాంబాబు, కొండయ్య,TNSF నాయకులు గుత్తా ధనుంజయ నాయుడు, సాకే లక్ష్మీనరసింహ, ప్యారం భరత్, ప్రశాంత్, కప్పల నరేష్, శివ, ఓబుల్ రెడ్డి మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
దళితులపై దాడికి నిరసనగా మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి దళిత సంఘాల నాయకులు..
సింగనమల నియోజవర్గం గార్లదిన్నె మండలం ముకుందాపురం లో గత రాత్రి జరిగిన దళితులపై దాడికి నిరసనగా మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన దళిత సంఘాల నాయకులు
చెన్నంపల్లి గ్రామంలో సుమారుగా 403 మంది ఈ ఆరోగ్య సురక్ష క్రమంలో వారి ఆరోగ్య సమస్యలు చూపించుకోవడం జరిగినది..
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చెన్నంపల్లి గ్రామంలో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ డి సునీత గారు, జడ్పిటిసి నీలం భాస్కర్ గారు,YSRCP నాయకులు వెంకట్ రెడ్డి అన్న గారు, మండల కన్వీనర్ అంకె నరేష్ గారు, భయపు రెడ్డి అన్నగారు,మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి గారు, ఎంపీడీవో తేజోష్ణ గారు, నాగయ్య ఎంపీటీసీ గారు,రావడం జరిగినది. చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రఘు, జనరల్ సర్జన్ శరత్ రెడ్డి స్పెషల్ క్యాంపు కి హాజరయ్యారు. సుమారుగా 403 మంది ఈ ఆరోగ్య సురక్ష క్రమంలో వారి ఆరోగ్య సమస్యలు చూపించుకోవడం జరిగినది. 136 మందికి పరీక్షలు చేయడం జరిగినది.82 మందిని గవర్నమెంట్ ఆసుపత్రి అనంతపురంకి రిఫర్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల వైద్యాధికారి శ్రీహర్ష & వినోద్ తరపున సచివాలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.
కొత్త టయోటా రూమియన్ వాహనం ను ప్రారంభించిన అనంతపురం జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు సింగనమల మండలం నాగులగుగడ్డం గ్రామానికి చెందిన దాసరి గంగాధర్...
అనంతపురం టయోటా షోరూమ్ నందు ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ఆ తర్వాత కొత్త వాహనం టయోటా రూమియన్ ను ప్రారంభించిన అనంతపురం జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు సింగనమల మండలం నాగులగుగడ్డం గ్రామానికి చెందిన దాసరి గంగాధర్.
మేము సైతం బాబుకు మద్దతుగా రాచేపల్లి మాట్లాగొంది గ్రామపంచాయతీలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి...
మేము సైతం బాబుకు మద్దతుగా రాచేపల్లి మాట్లాగొంది గ్రామపంచాయతీలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ* *చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మేము సైతం అంటూ సింగనమల మండలం రాచేపల్లి మట్లగుంది గ్రామపంచాయతీలలో* *సైకో పాలనకు చరమగీతం పాడుదామని బాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనయుడు ముంటి మడుగు కేశవరెడ్డి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆదేశానుసారం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రామలలో చంద్రబాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని ఈ సైకో పాలనలో కక్ష తప్ప ప్రజలకు జరిగేది ఏమీ లేదని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ9261292612 నంబర్ కు మిస్సేడ్ కాల్ ఇస్తూ ప్రజలకు తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో సైకో పాలన తొలగిపోవాలంటే నారా చంద్రబాబునాయుడు గారికి మద్దతు తెలిపి 2024లో ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు* ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ దండు విజయ్ కుమార్ రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి మట్లగుంది పుల్లయ్య రమేష్ ఆదినారాయణ పాల గౌతం గణేష్ ప్రదీప్ రఘు రాముడు రాచేపల్లి శ్రీనాథ్ వెంకటస్వామి జిల్లా బీసీ సెల్ కార్యనిర్వ కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాల్ వీరనారాయణ జిల్లా ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
దేశం గర్వించదగ్గ నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు.... ఆలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 23 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు*, Bks కేశన్న, నాయుడు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ మా అధినేత నారా చంద్రబాబునాయుడు పై తప్పుడు కేసులు పెట్టారని సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులోనే చంద్రబాబు నాయుడు ని జైలుకు పంపారన్నారు, వైసీపీ పాలనలో అభివృద్ధి లేక గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయన్నారు. ఆర్భాటమే తప్ప అభివృద్ధి లేదన్నారు, ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా బుధందాలు మహిళలపై అత్యాచారాలు ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఎక్కువయ్యాయన్నారు. తెదేపా నాయకులపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన అధరం బెదరం చంద్రబాబు నాయుడు కోసం ఏమిటికైన సిద్ధమన్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల అయ్యేవరకు రిలే నిరహారదీక్షలు ఆపే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మట్కా నిర్వాహకులు అరెస్ట్ . 12 లక్షలు నగదు స్వాధీనం...
మట్కా నిర్వాహకులు అరెస్ట్ . 12 లక్షలు నగదు స్వాధీనం. అనంతపురం జిల్లా రాప్తాడు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి ఇటుకలపల్లి సిఐ నరేందర్ రెడ్డి
మంచిని చూడండి... మనసారా ఆశీర్వదించండి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
మంచిని చూడండి... మనసారా ఆశీర్వదించండి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి. ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని చూసి ప్రజలు మనసారా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నారు. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల, ముకుందాపురం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యమాన్ని ఆమె నిర్వహించారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ ఫలాల తీరు గురించి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా అని ఆరా తీశారు. గ్రామాల్లో వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో ప్రజల జీవితాలలో సంక్షేమ వెలుగులు నింపారన్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఖాతాల్లోకి అందిస్తున్నారన్నారు. నవరత్నాలతో జగనన్న రాష్ట్రంలో నవశకానికి నాంది పలికారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెన్నంపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం.. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్..
ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పౌష్టికాహారం గురించి అవగాహన ప్రజల్లో గ్రామంలో లభించే ఆహార పదార్థాలతోనే చిరుధాన్యాలతో మొలకలు గుగ్గిళ్ళు లడ్డులు హల్వా రొట్టెలు మొదలకు ఆహార పదార్థాలు వండి ప్రదర్శించి గ్రామ ప్రజలకు అర్హుదారులకు అందరికీ విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.ఇందులో మండల నాయకులు మండల అధికారులు మొదలగువారు ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కుమారి హేమలత, అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీదేవి, అంజనమ్మ, గీతామని, పుష్పలత, రామాంజనమ్మ, రాధ,మహాలక్ష్మి లు పాల్గొన్నారు..