TS: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
NLG: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామాలకు అత్యధిక నిధులు కేటయించాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం అధికార దుర్వినియోగమేనని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం చౌటుప్పల్, నకిరేకల్ లలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలపై త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్ఎస్పి తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యల వెనుక కేసీఆర్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు. తక్షణమే ఎన్నికల సంఘం మంత్రిపై చర్యలు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ నేతలకు పోలీసులు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించే తాయిళాలకు ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని అన్నారు. మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనామీషాలు లెక్కిస్తుందని, తక్షణమే రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదని ఆరోపించారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో భూసేకరణ జరుగలేదన్నారు. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ చేయలేదన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు పట్టించుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఐటిపాముల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. సూర్యాపేటలో వట్టే జానయ్య ను, నకిరేకల్ లో ఉన్నత విద్యావంతురాలైన మేడి ప్రియదర్శిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
దేవరకొండ: నియోజకవర్గ బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం
నల్లగొండ జిల్లా, దేవరకొండ:  బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా  నాన్ లోకల్ వ్యక్తి కి కేటాయించారని, నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ గ్రామాన తండ తండ ప్రతి గూడేలకు తీసుకెళ్లిన రామావత్ రమేష్ నాయక్ ను కాదు అని నాన్ లోకల్ వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విన్నవించుతూ..  సర్ దేవరకొండ నియోజకవర్గం లో ప్రతి ఒక్కరు కూడా నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ కేటాయించడానికి వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. వారి అభిప్రాయాలను, మా సూచనలను తీసుకొని మీరు పునరాలోచించి దేవరకొండ ప్రజలకు సుపరిచితుడు అయినటువంటి వ్యక్తి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వ్యక్తి ఎప్పుడు ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి సుమారు 2014, 2015 సం. నుండి స్వేరో నెట్వర్క్ లో కీలకంగా పనిచేసి తన మార్కును చూపించినటువంటి వ్యక్తి, కోవిడ్ టైంలో ఎందరినో అభాగ్యులను ఆదుకొన గొప్ప మానత్వం కలిగి వ్యక్తి రామావత్ రమేష్ నాయక్ కు బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నామని  వారు అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమావత్ రమేష్ నాయక్ చింతపల్లి మండల అధ్యక్షులు ముదిగొండ మొగిలయ్య, కోండమల్లేపల్లి మండల అధ్యక్షులు గ్యార యాదగిరి, నేరేడుగొమ్ము మండల రావులపల్లి ఆంజనేయులు, చందంపేట మండల అధ్యక్షులు కేతావత్ మంగులాల్ నాయక్, పెద్దఅడిశర్లపల్లి మండల అధ్యక్షులు ధర్మాపురం శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్, కోశాధికారి మత్తంగి జాన్,నల్లా శ్రీకాంత్, గ్యార సమేల్, అనిల్, అంజి, వెంకట్, శ్రీరాములు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
లెంకలపల్లి: గ్రామపంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య అనారోగ్యంతో బుధవారం మరణించడం జరిగింది.  గ్రామ పంచాయతీ కార్యదర్శి  గుర్రం ఉమాదేవి తో కలిసి గ్రామ సర్పంచ్ పాక నగేష్ గురువారం తిప్పర్తి లింగయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, వారి సతీమణి తిప్పర్తి జయమ్మ కు ఆర్ధిక సహాయం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా 'మానక్ మహోత్సవ్'
నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల స్టాండర్డ్స్ క్లబ్ ఆధ్వర్యం లో గురువారం 'మానక్ మహోత్సవ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుంచి టి.రాకేష్, జాయింట్ డైరెక్టర్ మరియు జి‌. ప్రభాకర్ రిటైర్డ్ డి‌ఎస్‌ఓ పాల్గొని హాల్ మార్క్ తదితర స్టాండర్డ్స్ ప్రాముఖ్యతను, BIS పనితీరును వివరించారు. ప్రిన్సిపాల్ డా.ఘన్ శ్యామ్ మాట్లాడుతూ..నిత్య జీవితంలో స్టాండర్డ్స్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో  విద్యార్ధినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు BIS తరపున పది వేల రూపాయల నగదు బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, ఏ‌ఈసి డా.వెంకట కృష్ణ, అధ్యాపకులు రాజశేఖర్, యాదగిరి, నరసింహ రాజు, బిక్షమయ్య, అరుణ, నరేష్ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
లెంకలపల్లి: తిప్పర్తి లింగయ్యకు ఘన నివాళి
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి  గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వర్కర్స్ సీనియర్ నాయకుడు కామ్రేడ్ తిప్పర్తి లింగయ్య కు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ.. కామ్రేడ్ తిప్పర్తి లింగయ్య  గ్రామపంచాయతీ వర్కర్స్ గా పనిచేస్తూ మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ చురుగ్గా ఉద్యమంలో పాలుపంచుకొని ముందుకెళ్లాడని ప్రజా ఉద్యమానికి సిఐటియు కీలకంగా పని చేశాడని, ఆయన లోటు పూడ్చలేనిదని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు  నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షుడు వట్టిపల్లి హనుమంతు, మండల కార్యదర్శి ఊరుపక్క లింగయ్య, నక్క నరసింహ, ఊరు పక్క వెంకటయ్య, బడే లక్ష్మీకాంత్, గుండెపూరి నరసింహ, ప్లంబర్ యూనియన్ నాగోల్, హైదరాబాద్ యూనియన్ అధ్యక్షుడు దామెర రవి, ఆశ వర్కర్స్ ఏర్పుల పద్మ, ఎస్.కె సైదాబేగం, అమరాబాదు సునీత,ఎడ్ల అంజయ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు.
TS: ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
HYD: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో బిజెపి ఎన్నికల కమిటీలను  ప్రకటించింది. 14 కమిటీలను నియమించింది.
వివరాలు ఇలా ఉన్నాయి
1. సోషల్ ఔట్‌రీచ్‌ కమిటీ చైర్మన్ డాక్టర్ కె. లక్ష్మణ్ (ఎంపీ)
కన్వీనర్ బొర్రా నర్సయ్య గౌడ్ (మాజీ ఎంపీ)
2. పబ్లిక్ మీటింగ్స్ చైర్మన్ బండి సంజయ్ కుమార్ (ఎంపీ)
కన్వీనర్ జి. ప్రేమేందర్ రెడ్డి
జాయింట్ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు.
3. ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌ రీచ్‌ కమిటీ చైర్మన్ డీకే అరుణ.
కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
4. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.
కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి.
జాయింట్ కన్వీనర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
5. చార్జిషీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు.
కన్వీనర్ లక్ష్మీనారాయణ (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ రామచంద్రుడు (రిటైర్డ్ ఐఏఎస్)
6. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కన్వీనర్ దుగ్యాల ప్రదీప్ కుమార్.
7. యాక్షన్ కమిటీ చైర్మన్ విజయశాంతి (మాజీ ఎంపీ)
కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి
8. సోషల్ మీడియా చైర్మన్ ధర్మపురి అరవింద్
కన్వీనర్ పొరెడ్డి కిషోర్ రెడ్డి
9. ఎన్నికల కమిషన్ ఇష్యూష్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి
కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్
10. హెడ్ క్వార్టర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నల్లు ఇంద్రసేనా రెడ్డి
కన్వీనర్ బంగారు శృతి
11. మీడియా కమిటీ చైర్మన్ రఘునందన్ రావు,
కన్వీనర్ ఎన్. రామచంద్రరావు. (మాజీ ఎమ్మెల్సీ)
జాయింట్ కన్వీనర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి (బీజేపీ సెక్రటరీ)
12. క్యాంపెయిన్ ఇష్యూ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్.
కన్వీనర్ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్
13. ఎస్సీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి.
కన్వీనర్ జి. విజయ రామారావు (మాజీ మంత్రి)
14. ఎస్టీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గరికపాటి మోహన్ రావు.
కన్వీనర్ సోయం బాపూరావు (ఎంపీ)
జాయింట్ కన్వీనర్ డి. రవీంద్ర నాయక్
TS: పెండింగ్ లో ఉన్న కరువుభత్యాలు అన్ని మంజూరు: సజ్జనార్
HYD: TSRTC ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు (డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు టి ఎస్ ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏ ను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏ ను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సజ్జనార్ మాట్లాడుతూ..టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ టిఎస్ ఆర్టిసి అని, క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏ లను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరు తో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది. అని తెలిపారు.

SB NEWS TELANGANA
YBD: భువనగిరి మండలం లో దారుణ హత్య
యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం తుక్కాపూర్‌ గ్రామంలో గురువారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన గుంటి బసవయ్య(65), తిరుపతమ్మ(50) దంపతులపై  రాసాల రాజమల్లు అనే వ్యక్తి చేతి కొడవలితో దాడి చేశాడు. భర్త బసవయ్య అక్కడికక్కడే ఘటన స్థలంలో మృతి చెందగా, భార్య తిరుపతమ్మ ను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజమల్లు ను అదుపులోకి తీసుకున్నారు. రాజమల్లు సైకో అని, గతంలో భార్యపై దాడికి పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. SB NEWS YADADRI DIST

SB NEWS TELANGANA
యాదాద్రి జిల్లాలో మొత్తం ఓటర్లు 4,39,100 మంది
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 4 లక్షల 39 వేల 100 మంది ఓటర్లు ఉన్నట్లు  జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. 1)భువనగిరి, 2) ఆలేరు

• భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 1,05,404 మంది పురుషులు, 1,05,958 మంది స్త్రీలు కలిపి మొత్తం 2,11,362 మంది ఓటర్లు

• ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 1,14,388 మంది పురుషులు, 1,13,332 మంది స్త్రీలు, 18 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 2,27,738 మంది ఓటర్లు • వీరిలో 18 నుండి 19 సంవత్సరముల వయస్సు గల ఓటర్లు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 7338, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 7077. మొత్తం ఓటర్లు 14,415.

• 80 సంవత్సరములు పైబడిన ఓటర్లు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 3208 మంది, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3870 మంది ఉన్నారు. మొత్తం 7078 మంది ఓటర్లు.

ఇక దివ్యాంగులు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 5346 మంది ఓటర్లు • ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 5707 మంది ఉన్నారు. మొత్తం 11,053 మంది ఓటర్లు. థర్డ్ జెండర్స్ ఓటర్లు అలేరు నియోజకవర్గానికి సంబంధించి 18 మంది ఉన్నారు. జిల్లాలో ఇవిఎం, వివిప్యాట్ మొబైల్ వాహనాల ద్వారా 406 ప్రాంతాలలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. రెండవ ఓటరు సవరణ ముసాయిదా జాబితా 21-8-2023 నుండి రెండవ ఓటరు సవరణ తుది జాబితా తేది. 04-10-2023 నాటికి మొత్తం 11,629 మంది ఓటర్లు.

• భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 1663 మంది పురుషులు, 2866 మంది స్త్రీలు, మొత్తం 4529 ఓటర్లు. ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3052 మంది పురుషులు, 4038 మంది స్త్రీలు, 10 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 7100 ఓటర్లు.
మొత్తంగా జిల్లా లో 2.65 శాతం ఓటర్లు పెరిగారని కలెక్టర్ తెలిపారు.
NLG: ఉమెన్స్ కాలేజీలో మన్మాద ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం
నల్లగొండ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మన్మాద ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. 1991- 95 మద్యకాలంలో స్థానిక ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పని చేసి పదవీవిరమణ పొందిన PSMK మన్మాద జ్ఞాపకార్థం వారి పిల్లలు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ను బహుకరిస్తున్నారు. ఈ అవార్డు క్రింద డిగ్రీ ప్రధమ , ద్వితీయ , మరియు తృతీయ సంవత్సరం BZC గ్రూప్ లో ప్రధమ,ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు వరుసగా రూ. 5000/-, 4000/-, ౩౦౦౦/- చొప్పున ప్రైజ్ మనీ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. ఈ అవార్డు ను 2006 -07 విద్యా సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు. 2019 -20, 2020 -21, మరియు 2021 -22 విద్యా సంవత్సరాలకు గాను మొత్తం 27 మంది విద్యార్థినులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్. నరేష్ అధ్యక్షత వహించగా విశిష్ట అతిధి గా మన్మాద కూతురు సి. రాధా రమణి మరియు ముఖ్య అతిధి గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా రమణి మాట్లాడుతూ.. మా అమ్మ పేరు మీద అవార్డు నివ్వడం చాల సంతృప్తిగా వున్నదని, విద్యార్థులు దీన్ని ప్రేరణగా తీసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు. డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. విద్యార్థినులు కష్టపడి పట్టుదల తో చదివి ఇలాంటి ఆర్థిక తోడ్పాటు ఆసరాగా చేసుకొని తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జంతుశాస్త్ర అధ్యాపకులు జె. స్వామి , కే.వనజ, మిస్కీన్, సి హెచ్ సమత, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి , వృక్ష శాస్త్ర విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి, మైక్రో బయాలజీ విభాగాధిపతి దేవవాణి, రసాయన శాస్త్ర విభాగాధిపతి బి. జ్యోతి, గణితశాస్త్ర విభాగాధిపతి నర్సింహా రాజు, BSSP రాజశేఖర్, IQAC కో ఆర్డినేటర్ రవిచంద్ర, అధ్యాపకులు హాసేన, యాదగిరి, రవి, నరేష్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST