పేద, బడుగు,బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాగోగులను జగనన్న కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే పింఛన్లు, పథకాలు వచ్చేవి..! రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..! పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాగోగులను జగనన్న కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా సాధారణ డాక్టర్ తో పాటు ప్రత్యేక వైద్యులు, ఇతర సిబ్బంది గ్రామాలకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే మెరుగైన వైద్యం కోసం సిఫారసు చేస్తారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గొందిరెడ్డిపల్లికి చెరువుకు ప్రతి ఏటా నీళ్ళు ఇస్తున్నాం. రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇది చాలా సంతోషకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే పింఛన్లు, పథకాలు వచ్చేవి. డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. వైయస్ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ఎక్కడ రూపాయి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నారు. జగనన్న ఇస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. ఇచ్చింది చెప్పుకోకపోతే అది తప్పు అవుతుంది. చంద్రబాబు దొంగతనం చేశాడు కాబట్టే జైల్లో ఉన్నాడు. దొంగతనం చేసిన వాళ్లు జైల్లో కాక మరి ఎక్కడ ఉంటారు. టిడిపి వాళ్లు ఎవరైనా అడిగితే ఇదే మాట నిలదీయండి. చంద్రబాబు లాంటి వారి గురించి ఎక్కువ మాట్లాడకపోవాల్సిన అవసరం లేదు.నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు..! గొందిరెడ్డిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ భవనాలను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ లుమరియు అధికారులు పాల్గొన్నారు..
Oct 04 2023, 16:25