పేద, బడుగు,బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాగోగులను జగనన్న కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే పింఛన్లు, పథకాలు వచ్చేవి..! రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..! పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాగోగులను జగనన్న కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా సాధారణ డాక్టర్ తో పాటు ప్రత్యేక వైద్యులు, ఇతర సిబ్బంది గ్రామాలకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే మెరుగైన వైద్యం కోసం సిఫారసు చేస్తారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గొందిరెడ్డిపల్లికి చెరువుకు ప్రతి ఏటా నీళ్ళు ఇస్తున్నాం. రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇది చాలా సంతోషకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే పింఛన్లు, పథకాలు వచ్చేవి. డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. వైయస్ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ఎక్కడ రూపాయి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నారు. జగనన్న ఇస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. ఇచ్చింది చెప్పుకోకపోతే అది తప్పు అవుతుంది. చంద్రబాబు దొంగతనం చేశాడు కాబట్టే జైల్లో ఉన్నాడు. దొంగతనం చేసిన వాళ్లు జైల్లో కాక మరి ఎక్కడ ఉంటారు. టిడిపి వాళ్లు ఎవరైనా అడిగితే ఇదే మాట నిలదీయండి. చంద్రబాబు లాంటి వారి గురించి ఎక్కువ మాట్లాడకపోవాల్సిన అవసరం లేదు. నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు..! గొందిరెడ్డిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ భవనాలను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ లుమరియు అధికారులు పాల్గొన్నారు.. 
सिक्किम में ल्होनक झील पर अचानक फटा बादल और बाढ़ में 15 से 20 फीट तक ऊंची लहरें देर तक मचाती रही तबाही, फोटो में देखिए यह भयावह मंजर
బొమ్మనహాల్ పాండురంగస్వామి గుడి నుంచినే మకల్లు ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు..
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ - నేమకల్లు రహదారిపై ఆవిష్కృతమైన తెలుగుదేశం శ్రేణుల ఐక్యతకు సజీవ సాక్ష్యంలా దుష్టపాలకుల కుట్రల కారణంగా జైలుపాలైన *జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి* మేలు జరగాలన్న సంకల్పంతో నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం దాకా *మాజీ మంత్రి వర్యులు కాలవ శ్రీనివాసులు గారు సాగిన పాదయాత్రలో పాల్గొన్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కూచి హరి గారు. వందలాది మంది పాల్గొన్నారు. ఉదయం బొమ్మనహాల్ పాండురంగస్వామి గుడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేమకల్లు వరకు ప్రభంజనంలా సాగింది.
ఉచిత తాగునీటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!
అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి సర్పంచ్ అంజి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగనీటి వాటర్ ప్లాంట్ ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్ అంజి యాదవ్ ను అభినందించారు. పంచాయతీ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు..
ఒప్పందం ప్రకారం గడువు ముగిసిన రాజీనామాకు సిద్ధం కానీ ఎంపీపీ.. మరో వర్గం మీడియాకు వెల్లడి..
వివరాల్లోకెళ్తే..

బుక్కరాయసముద్రం మండల ఎంపీపీగా దాసరి సునీత గారిని రెండు సంవత్సరాల క్రితం ఎన్నుకోవడం జరిగింది నియోజవర్గం అధిష్టానం దగ్గర చేసుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 24వ తేదీకి గడువు ముగిసిన రాజీనామా చేయలేదంటూ కొద్దిరోజుల క్రితం మరో వర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తో విన్నవించుకున్నారు ఎమ్మెల్యే గారు గడువు ముగిసిన వెంటనే నేను మాట్లాడుతానని సమాధానం ఇచ్చారు ఒప్పందం ప్రకారం మొదటి ఎంపీపీ చేసేవారికి రెండు సంవత్సరములు రెండోసారి అధికారం చేపట్టేవారు మూడు సంవత్సరాలు ఉంటారని ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మొన్న జరిగిన పార్టీ సమావేశంలో అధినాయకుడు ఆలూరు సాంబశివ రెడ్డి ఎంపీపీ భర్త బుల్లె నారాయణస్వామిని పిలిపించుకొని రాజీనామా చేయాలని అడిగారని దీనికి భిన్నంగా ఎంపీపీ భర్త సమాధానం ఇచ్చారని మరి ఆరు నెలలు గడువు అడిగారని విశ్వనీయవర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున ఎమ్మెల్యే దంపతులు రెండోసారి ఎంపీపీగా వెంకటలక్ష్మిని నియమించేందుకు సమాలోచనలు తర్జనభర్జనలు చేస్తున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని వర్గాలను ఆదుకోవడమే సీఎం జగనన్న ఆశయం.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజల శ్రేయస్సే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. పుట్లూరు మండలం చెర్లోపల్లి, ఓబులాపురం, దోసలేడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల బుక్ లెట్లను పంపిణీ చేసి ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఎంత లబ్ది కలిగిందో వివరించారు. జగనన్న పాలనలో పేదల ఇంట సంక్షేమ పథకాల పంట పండుతోదన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతతో అవినీతి రహిత పాలనను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని అన్నారు. జగనన్న పాలనను చూసి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గురువారం అనగా 05.10.2023 వ తేదీన జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పై అవగాహన సదస్సు కు ప్రతి ఒక్కరు హాజరు కావాలి..
జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పై అవగాహన సదస్సు. గురువారం అనగా 05.10.2023 వ తేదీన అనంతపురం చెరువు కట్ట వద్ద వున్న శ్రీ షిర్డీ సాయి కళ్యాణమండపం నందు ఉదయం 9.00గంటలకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం లో 50% సబ్సిడీ తో గొర్రెల పెంపకం యూనిట్లు, దేశీ జాతి కోడి పిల్లల పెంపకం యూనిట్లు, సీమ పందుల పెంపకం యూనిట్లు మరియు పశుగ్రాసం సైలేజ్ యూనిట్లు పొందుటకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది . ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వారు చేపడుతున్న పథకం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఆసక్తి కల పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువకులకు మరియు పై తెలిపిన యూనిట్ల పట్ల ఆసక్తి కల రైతులకు పశు సంవర్థక శాఖ అధికారులు మరియు బ్యాంక్ అధికారులు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలనే విషయం పై అవగాహన కల్పించనున్నా రు. కావున బుక్కరాయసముద్రం నార్పాల శింగనమల మండలాల్లోని ఆసక్తి కల రైతులు నిరుద్యోగ యువకులు ఈ సదస్సుకు హాజరు కావలసింది గా కోరుచున్నాను - డా.ఏ.వి. రత్న కుమార్, సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ, బుక్కరయసముద్రం
అనంతపురం జిల్లాలో దారుణం వైద్యం వికటించి తల్లి బిడ్డ మృతి..
అనంతపురం జిల్లాలో దారుణం వైద్యం వికటించి తల్లి బిడ్డ మృతి. నగరంలోని అమరావతి హాస్పిటల్ లోకి డెలివరీకి వచ్చిన గార్లదిన్నె మండలం రఘుపల్లి గ్రామానికి చెందిన నరేందర్ భార్య మహాలక్ష్మి* సోమవారం 12 గంటల సమయంలో అమరావతి హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చిన మహాలక్ష్మి సోమవారం రాత్రి 9 గంటలకు బిడ్డ మృతి.. తరువాత అర్ధరాత్రి 12 గంటలకు తల్లి మృతి సరైన వైద్యం అందించకపోవడంతోనే తల్లి బిడ్డ మృతి చెందారని అమరావతి హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన
మృతురాలు మహాలక్ష్మి బంధువులకు సర్ది చెప్పిన పోలీసులు తల్లి బిడ్డ మృతదేహాలను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. పుట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామ సచివాలయం నందు ఏర్పాటు చేసిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైయ్యారు. ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, వైద్య నిపుణులతో మాట్లాడారు. వైద్యం కోసం వచ్చిన ప్రజలతో ఆరోగ్య సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు గ్రామ సచివాలయ స్థాయిలో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టిందని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న హెల్త్ క్యాంపునకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ప్రత్యేక వైద్య నిపుణులచే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన, అనంతరం వారికి మందులు ఉచితంగా పంపిణీ చేయటం జరిగిందన్నారు. ప్రజలకు వైద్యాన్ని ఆరోగ్య సురక్ష ద్వారా మరింత చేరువ చేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైద్యాధికారులు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
లఖీంపూర్ రైతులు ప్రాణాలు తీసిన మంత్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుండి బర్తర ప్ చేయాలి** రైతు ,కార్మిక,కర్షక , సంఘాలు
లఖీంపూర్ రైతులు ప్రాణాలు తీసిన మంత్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుండి బర్తర ప్ చేయాలి** రైతు ,కార్మిక,కర్షక , సంఘాల సమన్వయ అనంతపురము జిల్లా కమిటీ డిమాండ్, జిల్లా కేంద్రంలోఅక్టోబర్ 3 బ్లాక్ డే సంధర్బంగా కృష్ణ కళామందిరం నుండి టవర్ క్లాక్ దగ్గర వరకు రైతులతో కలిసి ర్యాలీ చేసి తదనంతరం టవర్ క్లాక్ దగ్గర నిరసన చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా,జిల్లారైతుసంఘము వర్కింగ్ ప్రెసిడెంట్ సి.మల్లికార్జున,ఏఐటియుసి జిల్లాప్రధానకార్యదర్మిఏ.రాజారెడ్డి, ఏఐకెంస్ రాష్టకార్యదర్శి,ప్రభాకర్ రెడ్డి,ఏపిరైతుసంఘము(సీపీఏం)చంద్రశేఖర్ రెడ్డి,ఏపీ రైతు సంఘం (సిపిఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి చిన్నప్ప యాదవ్ ,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు కూలీ సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ ,సీఐటీయు జిల్లా అద్యక్షులు,నాగమణీ, పాల్గోనిమాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపైకేంద్రమంత్రి అజయ్ మిశ్రా కూమారుడు కారుతో అకారణంగా చంపిరైతులమృతికారకుడునుఅరెస్టుచేయాలి ,కేంద్రమంత్రిని మంత్రివర్గమునుండితోలగించాలి,మూడునల్ల వ్యవసాయ చట్టాలు రద్దునురైతులకు వ్రాతపూర్వకంగాహమీ ఇవ్వాలి, పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని రైతులు ఋణభారముతో కృంగిపోతున్నందున రైతు రుణ విమోచన చట్టం తీసుకొచ్చి కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే విధానానికి స్వస్తి పలకాలని, పార్లమెంట్లో పెట్టిన విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలని, సి ప్లస్ 20 స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి,ఉఫాదీహమీచట్టానికిబడ్జెట్ లోరూ"2లక్షలకోట్లకుపెంచాలి,200రోజులుపనిదినాలు,600వేతనము ఇవ్వాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి' రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు పెన్షన్ 10000 ఇవ్వాలని,కేంద్రరాష్టప్రభుత్వాలకు హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో వామపక్ష జిల్లా రైతు,కార్మిక సంఘాలనాయకులు ఏఐటియుసి జిల్లాఅద్యక్షులు,రాజేష్ గౌడ్ ,క్రిష్ణుడు, మల్లికార్జున,రాజు ,సిఐటి నాయకులు ,వెంకటనారాయణ, వామపక్ష రైతు కార్మిక సంఘం నాయకులు మనోహర, మధు యాదవ్ ,రాము, చలపతి, చంద్రశేఖర్, గోపాల్, రామాంజనేయులు ,గోపాల్, కృష్ణ ,రాయుడు ,బాల రంగయ్య, రాయుడు, కృష్ణమూర్తి, రామకృష్ణారెడ్డి, ఏర్రి స్వామి, నాగేంద్ర, శ్రీనివాసులు,అదినారాయణ,ఉసేన్ పీరా,వెంకట్ , రైతు కార్మిక కర్షక సమన్వయ అనంతపురము సమితి నాయకులుపాల్గోనడమైనది.