ఒప్పందం ప్రకారం గడువు ముగిసిన రాజీనామాకు సిద్ధం కానీ ఎంపీపీ.. మరో వర్గం మీడియాకు వెల్లడి..
వివరాల్లోకెళ్తే..

బుక్కరాయసముద్రం మండల ఎంపీపీగా దాసరి సునీత గారిని రెండు సంవత్సరాల క్రితం ఎన్నుకోవడం జరిగింది నియోజవర్గం అధిష్టానం దగ్గర చేసుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 24వ తేదీకి గడువు ముగిసిన రాజీనామా చేయలేదంటూ కొద్దిరోజుల క్రితం మరో వర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తో విన్నవించుకున్నారు ఎమ్మెల్యే గారు గడువు ముగిసిన వెంటనే నేను మాట్లాడుతానని సమాధానం ఇచ్చారు ఒప్పందం ప్రకారం మొదటి ఎంపీపీ చేసేవారికి రెండు సంవత్సరములు రెండోసారి అధికారం చేపట్టేవారు మూడు సంవత్సరాలు ఉంటారని ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మొన్న జరిగిన పార్టీ సమావేశంలో అధినాయకుడు ఆలూరు సాంబశివ రెడ్డి ఎంపీపీ భర్త బుల్లె నారాయణస్వామిని పిలిపించుకొని రాజీనామా చేయాలని అడిగారని దీనికి భిన్నంగా ఎంపీపీ భర్త సమాధానం ఇచ్చారని మరి ఆరు నెలలు గడువు అడిగారని విశ్వనీయవర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున ఎమ్మెల్యే దంపతులు రెండోసారి ఎంపీపీగా వెంకటలక్ష్మిని నియమించేందుకు సమాలోచనలు తర్జనభర్జనలు చేస్తున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని వర్గాలను ఆదుకోవడమే సీఎం జగనన్న ఆశయం.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజల శ్రేయస్సే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. పుట్లూరు మండలం చెర్లోపల్లి, ఓబులాపురం, దోసలేడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల బుక్ లెట్లను పంపిణీ చేసి ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఎంత లబ్ది కలిగిందో వివరించారు. జగనన్న పాలనలో పేదల ఇంట సంక్షేమ పథకాల పంట పండుతోదన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతతో అవినీతి రహిత పాలనను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని అన్నారు. జగనన్న పాలనను చూసి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గురువారం అనగా 05.10.2023 వ తేదీన జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పై అవగాహన సదస్సు కు ప్రతి ఒక్కరు హాజరు కావాలి..
జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పై అవగాహన సదస్సు. గురువారం అనగా 05.10.2023 వ తేదీన అనంతపురం చెరువు కట్ట వద్ద వున్న శ్రీ షిర్డీ సాయి కళ్యాణమండపం నందు ఉదయం 9.00గంటలకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం లో 50% సబ్సిడీ తో గొర్రెల పెంపకం యూనిట్లు, దేశీ జాతి కోడి పిల్లల పెంపకం యూనిట్లు, సీమ పందుల పెంపకం యూనిట్లు మరియు పశుగ్రాసం సైలేజ్ యూనిట్లు పొందుటకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది . ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వారు చేపడుతున్న పథకం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఆసక్తి కల పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువకులకు మరియు పై తెలిపిన యూనిట్ల పట్ల ఆసక్తి కల రైతులకు పశు సంవర్థక శాఖ అధికారులు మరియు బ్యాంక్ అధికారులు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలనే విషయం పై అవగాహన కల్పించనున్నా రు. కావున బుక్కరాయసముద్రం నార్పాల శింగనమల మండలాల్లోని ఆసక్తి కల రైతులు నిరుద్యోగ యువకులు ఈ సదస్సుకు హాజరు కావలసింది గా కోరుచున్నాను - డా.ఏ.వి. రత్న కుమార్, సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ, బుక్కరయసముద్రం
అనంతపురం జిల్లాలో దారుణం వైద్యం వికటించి తల్లి బిడ్డ మృతి..
అనంతపురం జిల్లాలో దారుణం వైద్యం వికటించి తల్లి బిడ్డ మృతి. నగరంలోని అమరావతి హాస్పిటల్ లోకి డెలివరీకి వచ్చిన గార్లదిన్నె మండలం రఘుపల్లి గ్రామానికి చెందిన నరేందర్ భార్య మహాలక్ష్మి* సోమవారం 12 గంటల సమయంలో అమరావతి హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చిన మహాలక్ష్మి సోమవారం రాత్రి 9 గంటలకు బిడ్డ మృతి.. తరువాత అర్ధరాత్రి 12 గంటలకు తల్లి మృతి సరైన వైద్యం అందించకపోవడంతోనే తల్లి బిడ్డ మృతి చెందారని అమరావతి హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన
మృతురాలు మహాలక్ష్మి బంధువులకు సర్ది చెప్పిన పోలీసులు తల్లి బిడ్డ మృతదేహాలను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. పుట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామ సచివాలయం నందు ఏర్పాటు చేసిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైయ్యారు. ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, వైద్య నిపుణులతో మాట్లాడారు. వైద్యం కోసం వచ్చిన ప్రజలతో ఆరోగ్య సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు గ్రామ సచివాలయ స్థాయిలో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టిందని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న హెల్త్ క్యాంపునకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ప్రత్యేక వైద్య నిపుణులచే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన, అనంతరం వారికి మందులు ఉచితంగా పంపిణీ చేయటం జరిగిందన్నారు. ప్రజలకు వైద్యాన్ని ఆరోగ్య సురక్ష ద్వారా మరింత చేరువ చేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైద్యాధికారులు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
లఖీంపూర్ రైతులు ప్రాణాలు తీసిన మంత్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుండి బర్తర ప్ చేయాలి** రైతు ,కార్మిక,కర్షక , సంఘాలు
లఖీంపూర్ రైతులు ప్రాణాలు తీసిన మంత్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుండి బర్తర ప్ చేయాలి** రైతు ,కార్మిక,కర్షక , సంఘాల సమన్వయ అనంతపురము జిల్లా కమిటీ డిమాండ్, జిల్లా కేంద్రంలోఅక్టోబర్ 3 బ్లాక్ డే సంధర్బంగా కృష్ణ కళామందిరం నుండి టవర్ క్లాక్ దగ్గర వరకు రైతులతో కలిసి ర్యాలీ చేసి తదనంతరం టవర్ క్లాక్ దగ్గర నిరసన చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా,జిల్లారైతుసంఘము వర్కింగ్ ప్రెసిడెంట్ సి.మల్లికార్జున,ఏఐటియుసి జిల్లాప్రధానకార్యదర్మిఏ.రాజారెడ్డి, ఏఐకెంస్ రాష్టకార్యదర్శి,ప్రభాకర్ రెడ్డి,ఏపిరైతుసంఘము(సీపీఏం)చంద్రశేఖర్ రెడ్డి,ఏపీ రైతు సంఘం (సిపిఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి చిన్నప్ప యాదవ్ ,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు కూలీ సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ ,సీఐటీయు జిల్లా అద్యక్షులు,నాగమణీ, పాల్గోనిమాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపైకేంద్రమంత్రి అజయ్ మిశ్రా కూమారుడు కారుతో అకారణంగా చంపిరైతులమృతికారకుడునుఅరెస్టుచేయాలి ,కేంద్రమంత్రిని మంత్రివర్గమునుండితోలగించాలి,మూడునల్ల వ్యవసాయ చట్టాలు రద్దునురైతులకు వ్రాతపూర్వకంగాహమీ ఇవ్వాలి, పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని రైతులు ఋణభారముతో కృంగిపోతున్నందున రైతు రుణ విమోచన చట్టం తీసుకొచ్చి కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే విధానానికి స్వస్తి పలకాలని, పార్లమెంట్లో పెట్టిన విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలని, సి ప్లస్ 20 స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి,ఉఫాదీహమీచట్టానికిబడ్జెట్ లోరూ"2లక్షలకోట్లకుపెంచాలి,200రోజులుపనిదినాలు,600వేతనము ఇవ్వాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి' రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు పెన్షన్ 10000 ఇవ్వాలని,కేంద్రరాష్టప్రభుత్వాలకు హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో వామపక్ష జిల్లా రైతు,కార్మిక సంఘాలనాయకులు ఏఐటియుసి జిల్లాఅద్యక్షులు,రాజేష్ గౌడ్ ,క్రిష్ణుడు, మల్లికార్జున,రాజు ,సిఐటి నాయకులు ,వెంకటనారాయణ, వామపక్ష రైతు కార్మిక సంఘం నాయకులు మనోహర, మధు యాదవ్ ,రాము, చలపతి, చంద్రశేఖర్, గోపాల్, రామాంజనేయులు ,గోపాల్, కృష్ణ ,రాయుడు ,బాల రంగయ్య, రాయుడు, కృష్ణమూర్తి, రామకృష్ణారెడ్డి, ఏర్రి స్వామి, నాగేంద్ర, శ్రీనివాసులు,అదినారాయణ,ఉసేన్ పీరా,వెంకట్ , రైతు కార్మిక కర్షక సమన్వయ అనంతపురము సమితి నాయకులుపాల్గోనడమైనది.
భవ్యశ్రీ కి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్ఎస్ యుఐ..
భవ్యశ్రీ కి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకుడు మంజునాథ్ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి భవ్యశ్రీ అనే అమ్మాయికి న్యాయం చేయాలని రాప్తాడు (మం) గొందిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకుడు మంజునాథ్ కొవ్వొత్తులు వెలిగించి భవ్యశ్రీ కి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థి భవ్య శ్రీ పై హత్య జరిగి 10 రోజులు అవుతున్న నిందితులను గుర్తించి, ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అదేవిధంగా దశ లేని ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఏ ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేసిన దాఖలాలు లేవని ఇలాంటి చట్టాలు పేరుకే తప్ప ఆడబిడ్డల రక్షణకు పనికిరావని తెలిపారు.మైనర్ బాలిక భవ్య శ్రీ ని కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గులను తొందరగా గుర్తించి ఉరిశిక్ష విధించి భవ్యశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఆ కుటుంబ బాధ్యతలు ప్రభుత్వం తీసుకొని 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి భవ్య శ్రీ హత్యకు గల కారణాలు వెలికి తీసి భవ్య శ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో లోకేష్, మహేంద్ర, మల్లికార్జున, మనోజ్, జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, సర్పంచ్ డేగల లలితమ్మ
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇంటిలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి సర్పంచ్ డేగల లలితమ్మ డేగల శ్రీనివాసులుఓబుళపతి ఓం నాథ్ మల్లికార్జున రమేష్ హేమ లావణ్య బోయ శ్రీనవాసులు డేగల హరీష్ గ్రామస్తులతో కలిసి కొవ్వొత్తుల నిరసన కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు*
చిన్న జలాలపురముగ్రామంలో బాబుతో నేను అనే కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసిన.. గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటరమణ, ఐ టి డి పి నవీన్ కిరణ్ కుమార్..
అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు గారి ఆదేశాల తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో..... శింగనమల మండలం చిన్న జలాల పురముగ్రామంలో బాబుతో నేను అనే కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసిన గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటరమణ, ఐ టి డి పి నవీన్ కిరణ్ కుమార్ ప్రజలకు నారా చంద్రబాబునాయుడు అక్రమ కేసుపై ప్రజలకు వివరంగా వివరించడం అయినది. ఈ కార్యక్రమంలో చిన్న లింగన్న, వెంకటరమణ స్వామి, ఎర్రి స్వామి, అశోక్, వీర నాగన్న,సాయి,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
గృహసారదుల బీమాను 100% పూర్తి చేసి జిల్లాలో సింగనమల నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉన్నందున అభినందనలు తెలిపిన స్టేట్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి..
*ఫ్లాష్..న్యూస్...*

అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గం గృహసారదుల బీమాను 100% పూర్తి చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నది. అదేవిధంగా సింగనమల నియోజకవర్గం లో బుక్కరాయసముద్రం మొదటి స్థానంలో ఉన్నందున అభినందనలు తెలిపిన స్టేట్ కోఆర్డినేటర్ చెల్లా మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గంలోని వివిధ మండలాల జెసిఎస్ ఇన్చార్జిలను వారు ప్రశంసించారు