వినూత్న రీతిలో గొడుగుపట్టి నిరసన..
వినూత్న రీతిలో గొడుగుపట్టి నిరసన.... శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 19 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారి* సూచన మేరకు *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ముఖ్యమంత్రి ప్రజలకు వెంట్రుకలు కూడా ఉండకుండా అన్ని పీకేస్తాడని చెప్పేందుకు నిరసనగా ఈరోజు నీలే నిరాహార దీక్షలో గొడుగు పట్టుకుని నిరసన చేశారు.నార్పల మండలo నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా *టిడిపి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ హింసకు గురి చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బాబుకు తోడుగా నియంతపై పోరాటంకు మద్దతుగా మేము సైతం అంటూ టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 20వ రోజుకు చేరుకున్నాయి.టిడిపి పార్టీకి వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కి తగిన బుద్ధి చెప్పి టిడిపి పార్టీ 175 కి 175 సీట్లు గెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Oct 03 2023, 07:39