నిరుపేదలకు లబ్ధే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ పాలన: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
నిరుపేదలకు లబ్ధే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ పాలన: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
. నిరుపేదలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చటమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి కృషి చేస్తోందని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం ఎం.కొత్తూరు, ఎం. కొత్తపల్లి, ముంటిమడుగు, సిరివరం, గుడ్డాలపల్లి, రామదాసు పేట, అంకంపేట, గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి బుక్ లెట్ ద్వారా వివరించారు. గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటూ, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగనన్న సంక్షేమ పాలన రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలలో వెలకట్టలేని సంతోషాన్ని నింపుతోందన్నారు. ప్రతి ఇంటా పథకాలు అందుతున్నాయని గ్రామాలకు వెళితే ప్రజలు సంతోషంగా ఆదరిస్తుండటం చూస్తుంటే అది జగనన్న కృషి ఫలితమేనన్నారు. ప్రజాదరణ రోజు రోజుకూ పెరుగుతోందని జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎంతమంది ఒక్కటైనా 2024 ఎన్నికల్లో జగనన్న ప్రజల మద్దతుతో ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Oct 01 2023, 16:22