గుమ్మేపల్లిలో స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ డేగల లలితమ్మ..
సింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామపంచాయతీ గుమ్మేపల్లి గ్రామంలో సర్పంచ్ డేగల లలితమ్మ ఆధ్వర్యంలో స్వచ్ఛత హై సేవ మన పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రత తో ఉంచాలని తద్వారా రాష్ట్రంలో మరియు దేశంలోస్వచ్ఛ సంకల్పం సాధించి దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మార్చడంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపు నివ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రెటరీ నాగరాజు గ్రామ ప్రజలు గణేష్ శ్రీనివాసులు సుబ్బారాయుడు ఓబుళపతి నారాయణమ్మ డేగల కిరణ్ మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం జిల్లా: జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో (స్వచ్ఛతా హీ సేవా) లో భాగంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ , జెడ్పీటీసీ,మండల కన్వీనర్,JCs మండల కన్వీనర్, సర్పంచ్,నాయకులు, అధికారులు, పంచాయతి పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
భారెడ్డి అనూష ను సన్మానించిన ... చామలూరు దంపతులు...
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ,బండ్లపల్లి గ్రామానికి చెందిన భారెడ్డీ అనూష అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఎన్నిక అవ్వడం దేశం తరఫున మహిళల ఆసియా కప్ క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహించడం మా అందరికీ గర్వంగా ఉందని భవిష్యత్ లో మహిళా వరల్డ్ కప్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకొని ,భారత జట్టు కెప్టెన్ గా ఆ స్థాయికి ఎదిగాలని మేము కోరుకుంటున్నామని చామలూరు రాగే హరిత మాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ , చామలూరు రాజగోపాల్, వై యస్ ఆర్ సి పి యస్ సి సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆశిస్తున్నామని అలాగే ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.మా సొంత మండలం కు చెందిన అమ్మాయి ఈ స్థాయికి ఎదిగిందంటే చాలా సంతోషం,గర్వంగా ఉందని భవిష్యత్ లో జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు వెలతావని ఆయన క్రీడాకారులను ప్రోత్సహిస్తారు ముఖ్యంగా మహిళలు అంటే ఇంకా చాలా మంచి ప్రోత్సాహం అందిస్తారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శిద్దరాచేర్ల సర్పంచ్ సాకే రామాంజినేయులు ,యం యస్ హనుమంతరాయుడు, నారాయణ స్వామి,రాజా , ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు
టీడీపీ అధిష్టానం నుంచి అభినందన లేఖ ను అందుకున్న మొండిపోగుల ఎర్రిస్వామి..
టిడిపి అనంతపురం పార్లమెంట్ ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్* తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎస్సీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండి పోగుల ఎర్రిస్వామికి *అభినందన లేఖను ఇ మెయిల్ కి పంపిన తెలుగుదేశం పార్టీ* ఈ సందర్భంగా మాట్లాడుతూ మన టీడీపీ యాప్ ను యాక్టివ్ గా వినియోగిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ఒక డిజిటల్ సైనికుడిగా నిరంతరం శ్రమిస్తున్న మీకు ముందుగా నా హృదయపూర్వక అభినందనలు అంటూ ప్రతిరోజు పార్టీ కోసం సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు చేరువయ్యేలా యాప్ సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ పదివేల పాయింట్లు సాధించడం గర్వించదగ్గ విషయమని మీ కృషిని తెలుగుదేశం పార్టీలో మీకు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది మీరు ఇదే చొరవ చూపిస్తూ ఇకముందు కూడా యాప్ వినియోగంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు గొప్ప మార్పు కోసం మన వద్ద ఉన్న గొప్ప డిజిటల్ అస్త్రం తెలుగుదేశం పార్టీ కోసం మన టిడిపి యాప్ ను వినియోగించడం అందర్నీ వినియోగించేలా చేయడం మన అందరి బాధ్యత
సైకో పాలనకు చరమగీతం పాడుదాం.. గుమ్మేపల్లి సర్పంచ్ డేగల లలితమ్మ అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతిదీ డేగల కృష్ణమూర్తి.
సైకో పాలనకు చరమగీతం పాడుదామని బాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనయుడు ముంటి మడుగు కేశవరెడ్డి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆదేశానుసారం అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి సర్పంచ్ డేగల లలితమ్మ ఆధ్వర్యంలో సింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామంలో జరిగిన చంద్రబాబుకు మద్దతుగా కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని ఈ సైకో పాలనలో కక్ష తప్ప ప్రజలకు జరిగేది ఏమీ లేదని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో సైకో పాలన తొలగిపోవాలంటే నారా చంద్రబాబునాయుడు గారికి మద్దతు తెలిపి 2024లో ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు* ఈ కార్యక్రమం లోడేగల శ్రీనివాసులు డి. లక్షమయ్య జిల్లా బీసీ సెల్ కార్యనిర్వా కార్యదర్శి కోయిగూర పెద్దన్న ఓబుళపతి ఓబిలేసు బెస్త నారాయణస్వామి అంకన్న రామాదాసు డి. ప్రసాద్ తోట రామూర్తి గంగాధర్ కొండన్న హేమంత్ దీనెస్ నడిపి ఓబుళపతి డేగల రమేష్ శ్రీరాములు మల్లికార్జున గణేష్ డేగల హరి డేగల కిరణ్ పెద్ద ఓబయ్య పెద్ద ఓబిలేసు తదితరులు పాల్గొన్నారు
నిరుపేదలకు లబ్ధే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ పాలన: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
నిరుపేదలకు లబ్ధే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ పాలన: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి . నిరుపేదలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చటమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి కృషి చేస్తోందని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం ఎం.కొత్తూరు, ఎం. కొత్తపల్లి, ముంటిమడుగు, సిరివరం, గుడ్డాలపల్లి, రామదాసు పేట, అంకంపేట, గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి బుక్ లెట్ ద్వారా వివరించారు. గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటూ, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగనన్న సంక్షేమ పాలన రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలలో వెలకట్టలేని సంతోషాన్ని నింపుతోందన్నారు. ప్రతి ఇంటా పథకాలు అందుతున్నాయని గ్రామాలకు వెళితే ప్రజలు సంతోషంగా ఆదరిస్తుండటం చూస్తుంటే అది జగనన్న కృషి ఫలితమేనన్నారు. ప్రజాదరణ రోజు రోజుకూ పెరుగుతోందని జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎంతమంది ఒక్కటైనా 2024 ఎన్నికల్లో జగనన్న ప్రజల మద్దతుతో ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ధర్మం తప్పని రామునికి అరణ్యవాసం.. అవినీతి చేయని చంద్రుడికి జైలువాసం...ఆలం..
ధర్మం తప్పని రామునికి అరణ్యవాసం.. అవినీతి చేయని చంద్రుడికి జైలువాసం...ఆలం ఈ దీక్షలో డప్పుకొట్టి నిరసన వ్యక్తం చేసి మరియు మోత మోగిద్దాం కార్యక్రమం జరిగినది.. ఆలం..వెంకట నరసానాయుడు గారు* శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 18 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *ద్విసభ్య కమిటి సభ్యలు* సూచన మేరకు *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. నార్పల మండలo నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా *టిడిపి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* మాట్లాడుతూ చంద్రబాబు గారు ఎలాంటి తప్పు చేయలేదు - ప్రజల సొమ్ము దోచుకొని దాచుకొనే అలవాటు చంద్రబాబు గారికి లేదు - చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారు - 22 రోజులుగా రాజమండ్రి జైల్లో నిర్బంధించారు - స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు - మచ్చలేని చంద్రుణ్ని అజ్ఞాతంలో పెట్టారు - 45 ఏళ్ల నుంచి ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో ఉన్నారుచంద్రబాబు గారి నిరంతర ఆలోచనలు ప్రజల కోసమే స్కిల్ డెవలప్ మెంట్ లో 2 లక్షల మందికి ఉపాధి కల్పించారు - స్కిల్ నైపుణ్యంలో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు మరెందరో ఔత్సాహికులు కంపెనీలు కూడా పెట్టుకున్నారుస్కిల్ కేసులో అక్రమాలు నిరూపించలేకపోతున్నారు - ప్రజల సొమ్ము ఎవరి అకౌంట్ లో పడిందో ఎందుకు చెప్పడంలేదు? - చంద్రబాబు గారి ప్రశ్నలకు సీఐడీ సమాధానం చెప్పలేకపోతోంది - మహిళల ఉపాధి కోసం ఎన్నో చర్యలు చేపట్టారు నా మీద ఉన్న నమ్మకంతో హెరిటేజ్ కంపెనీ అప్పగించారు - బీఏ చదివిన నేను 3 నెలల్లో కంపెనీ బాధ్యతలు తెలుసుకున్నా టీడీపీ చంద్రబాబు గారికి కుటుంబం లాంటిది - కష్టకాలంలో కుటుంబం ఆయనకు అండగా ఉంది అరెస్ట్ ను ప్రజలు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు - ఏపీలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేసే పరిస్థితి నెలకొంది - సమస్యల సాధన కోసం ఉద్యమించిన మహిళలను లాఠీలతో కొట్టించారు - మీ ఉక్కు సంకల్పమే చంద్రబాబుకు ఎంతో బలం - బాబు విడుదల కోసం శాంతియుతంగా పోరాడుదాం - యువతరంలో చైతన్యం కోసమే లోకేశ్ గారి యువగళం యువగళం కార్యక్మానికి అడుగడుగునా పోలీసుల అడ్డంకులు ఎవరు ఎన్ని కుట్రలు,అవరోధాలు సృష్టించినా మనం ముందుకెళదాం. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రాత్రి 7 గం.కు మోత సౌండ్ మోగిద్దాం కార్యక్రమంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు Ex. ZPTC రామలింగారెడ్డి..
శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలం నరసనాయుడు గారి అదేశాలు మేరకు* నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రాత్రి 7 గంటలకు మోత సౌండ్ మోగిద్దాం కార్యక్రమంను *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ రామలింగారెడ్డి గారు, మరియు మండల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో*. *శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో* నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ప్రతి కాలనీ తిరుగుతూ బైక్ ర్యాలీ తో సౌండ్ చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, కేశన్న, నారాయణ స్వామి, ఎంపీటీసీ చెరుకూరి నారాయణ స్వామి, బాబాయ్య, హరి, భూసి,ఆది శేషు, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, గౌస్, మండల టీడీపీ నాయకులు మరియు పెద్దఎత్తున్న టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరణించిన పోలీసు సిబ్బంది బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు క్రింద ఉద్యోగాలు సత్వర ప్రయత్నం చేస్తున్న.. కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్
జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన సిబ్బంది యొక్క కుటుంబం లతో కమాండెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ డెత్ బెనిఫిట్స్ మరియు కారుణ్య నియామకాలు కింద ఉద్యోగం సంభందించిన పైల్ ఏ ఆఫీస్ లలో పెండింగ్ ఉన్నాయో కనుకోని పెండింగ్ లో ఉన్న ఆఫీసు సంబంధించిన అధికారులు తో మరణించిన పోలీసు సిబ్బంది బెనిఫిట్స్ మరియు కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు గురించి సిబ్బంది ముందుర ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చేయటం జరిగింది అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు వారి భార్య రాధ కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూపాయల చెక్కును కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా కుటుంబానికి అందించటం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AAO విజయ్ కుమార్ నాయుడు, బెటాలియన్ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.
అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గగా మరూరుచెన్నకేశవులు..
అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గగా మరూరుచెన్నకేశవులు గారిని ఎన్నుకోవడం అయినది