అనంతలో పేదలకు చేరువగా కార్పొరేట్ వైద్యం.. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
పేదలకు చేరువగా కార్పొరేట్ వైద్యం
– జగన్ నాయకత్వంలో వైద్యరంగంలో మార్పులు – వైసీపీ వచ్చాకే అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి – రూ.300 కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ పనులు – ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ను సద్వినియోగం చేసుకోండి – అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపు – రూ.11 కోట్లతో నిర్మించిన సీడీ ఆస్పత్రి భవనం ప్రారంభం – ప్రైవేట్ ఆస్పత్రులకెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవద్దు : ఎంపీ రంగయ్య – 60 బెడ్ల సామర్థ్యంతో సీడీ ఆస్పత్రి నిర్మాణం : జెడ్పీ చైర్‌పర్సన్ అనంతపురం, సెప్టెంబర్ 29 : కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జగన్ నాయకత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. నగరంలోని పాతూరులో రూ.11 కోట్లతో నిర్మించిన సీడీ ఆస్పత్రి నూతన భవనాన్ని ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వసీంతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సీడీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేశామని చెప్పారు. అనంతపురం నగరంలో సీడీ హాస్పిటల్ మాత్రమే కాకుండా 10 అర్బన్ హెల్త్ సెంటర్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. సీడీ ఆస్పత్రి ఎంతో పురాతనమైనదని, దీంతో రూ.11 కోట్లతో కొత్త భవనం నిర్మించినట్లు చెప్పారు. ఇప్పటికే నాడు నేడు కింద రూ.300 కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ పనులు చేపట్టామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వైసీపీ వచ్చాక రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి అందుబాటులోకి తెచ్చామని, ఇక్కడ ప్రస్తుతం ఏడు విభాగాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. సీడీ ఆస్పత్రిలో కూడా పీడియాట్రిక్, గైనిక్ సేవలు అందుబాటులో ఉంటాయని, ఆస్పత్రి పరిసర కాలనీల్లోని పేదలంతా ఇక్కడి సేవలను వినియోగించుకోవాలని కోరారు. స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈనెల 30వ తేదీ నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ప్రారంభమవుతోందని, ప్రతి ఇంటికి ఆరోగ్య సురక్ష అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ సీఎం జగన్ నాయకత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. సీడీ హాస్పిటల్‌లో మౌలిక వసతులు అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ 60 పడకల సామర్థ్యంతో సీడీ హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చామన్నారు. పంచాయతీ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవికుమార్, డిప్యూటీ సివిల్ సర్జన్ కృష్ణవేణి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ మహబూబ్, ఆయుష్ వైద్యుడు తిరుపతినాయుడు, వైసీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ లక్ష్మన్న, కార్పొరేటర్లు ఎం.దేవి, వై.దేవి, సుమతి, చంద్రలేఖ, బాబా ఫక్రుద్దీన్, కో ఆప్షన్ మేంబర్ షంశుద్దీన్, వైసీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు సాకే కుల్లాయిస్వామి, వైసీపీ నాయకులు గంగాధర్, తిరుపాల్ రెడ్డి, మార్కెట్ ఖాజా, మల్లికార్జున, సత్యనారాయణ రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగరాజు, నారాయనమ్మ , ముత్యాల్ రెడ్డి, లాలూ, గౌరి తదితరులు పాల్గొన్నారు.
Oct 01 2023, 12:43