నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రాత్రి 7 గం.కు మోత సౌండ్ మోగిద్దాం కార్యక్రమంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు Ex. ZPTC రామలింగారెడ్డి..
శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలం నరసనాయుడు గారి అదేశాలు మేరకు* నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రాత్రి 7 గంటలకు మోత సౌండ్ మోగిద్దాం కార్యక్రమంను *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ రామలింగారెడ్డి గారు, మరియు మండల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో*. *శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో* నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ప్రతి కాలనీ తిరుగుతూ బైక్ ర్యాలీ తో సౌండ్ చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, కేశన్న, నారాయణ స్వామి, ఎంపీటీసీ చెరుకూరి నారాయణ స్వామి, బాబాయ్య, హరి, భూసి,ఆది శేషు, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, గౌస్, మండల టీడీపీ నాయకులు మరియు పెద్దఎత్తున్న టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరణించిన పోలీసు సిబ్బంది బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు క్రింద ఉద్యోగాలు సత్వర ప్రయత్నం చేస్తున్న.. కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్
జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన సిబ్బంది యొక్క కుటుంబం లతో కమాండెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ డెత్ బెనిఫిట్స్ మరియు కారుణ్య నియామకాలు కింద ఉద్యోగం సంభందించిన పైల్ ఏ ఆఫీస్ లలో పెండింగ్ ఉన్నాయో కనుకోని పెండింగ్ లో ఉన్న ఆఫీసు సంబంధించిన అధికారులు తో మరణించిన పోలీసు సిబ్బంది బెనిఫిట్స్ మరియు కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు గురించి సిబ్బంది ముందుర ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చేయటం జరిగింది అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు వారి భార్య రాధ కు ఇన్సిడెంటల్ చార్జస్ 25 వేలు రూపాయల చెక్కును కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా కుటుంబానికి అందించటం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరప్ప, AAO విజయ్ కుమార్ నాయుడు, బెటాలియన్ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.
అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గగా మరూరుచెన్నకేశవులు..
అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గగా మరూరుచెన్నకేశవులు గారిని ఎన్నుకోవడం అయినది
రాష్ట్రంలో ఒక నియంత పాలన.. ఆలం వెంకట నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 17 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష ద్విసభ్య కమిటి సభ్యలు సూచన మేరకు జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష మాల పౌర్ణమి పండుగ కాదని మోకాళ్లపై నిలబడి సంకెళ్లతో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో నార్పల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా టిడిపి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసిన అరాచక పాలన సాగుతుందన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన చంద్రబాబు గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా దురదృష్టకరం. నియంత సైకో జగన్ సాగిస్తున్న విధ్వంస పాలనపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిసిన వైసిపి ప్రభుత్వం.. మాసూల చంద్రమోహన్.. జిల్లా టీడీపీ నాయకులు, మాజీ మార్కెట్ యర్డ్ డైరెక్టర్..
ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినా తెలుగుదేశం పార్టీ కానీ, నాయకులు కానీ బెదిరిపోరని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 45ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి అవినీతి పాల్పడని వ్యక్తి తమ అధినేత చంద్రబాబు నాయుడని, అటువంటి వ్యక్తిని కావాలనే జగన్ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. గతంలో జగన్ జైల్లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారు కూడా జైల్లో ఉండాలన్న తీరులో పాలన సాగిస్తున్నారని,ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ భయపడదని, ఇటువంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన పార్టీ టీడీపీ అని,జనంతో కలిసి అరాచక పాలనను అంతమొందిస్తాం, త్వరలోనే చంద్రబాబునాయుడు సుపరిపాలనను తీసుకువస్తాం’’ అని ముక్తకంఠంతో తెలియజేస్తూన్నాము..
అనంతలో పేదలకు చేరువగా కార్పొరేట్‌ వైద్యం.. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
పేదలకు చేరువగా కార్పొరేట్‌ వైద్యం – జగన్‌ నాయకత్వంలో వైద్యరంగంలో మార్పులు – వైసీపీ వచ్చాకే అందుబాటులోకి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి – రూ.300 కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ పనులు – ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ను సద్వినియోగం చేసుకోండి – అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపు – రూ.11 కోట్లతో నిర్మించిన సీడీ ఆస్పత్రి భవనం ప్రారంభం – ప్రైవేట్‌ ఆస్పత్రులకెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవద్దు : ఎంపీ రంగయ్య – 60 బెడ్ల సామర్థ్యంతో సీడీ ఆస్పత్రి నిర్మాణం : జెడ్పీ చైర్‌పర్సన్‌ అనంతపురం, సెప్టెంబర్‌ 29 : కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జగన్‌ నాయకత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. నగరంలోని పాతూరులో రూ.11 కోట్లతో నిర్మించిన సీడీ ఆస్పత్రి నూతన భవనాన్ని ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ మహమ్మద్‌ వసీంతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సీడీ హాస్పిటల్‌ నూతన భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని, పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని చేరువ చేశామని చెప్పారు. అనంతపురం నగరంలో సీడీ హాస్పిటల్‌ మాత్రమే కాకుండా 10 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. సీడీ ఆస్పత్రి ఎంతో పురాతనమైనదని, దీంతో రూ.11 కోట్లతో కొత్త భవనం నిర్మించినట్లు చెప్పారు. ఇప్పటికే నాడు నేడు కింద రూ.300 కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ పనులు చేపట్టామన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని వైసీపీ వచ్చాక రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి అందుబాటులోకి తెచ్చామని, ఇక్కడ ప్రస్తుతం ఏడు విభాగాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. సీడీ ఆస్పత్రిలో కూడా పీడియాట్రిక్, గైనిక్‌ సేవలు అందుబాటులో ఉంటాయని, ఆస్పత్రి పరిసర కాలనీల్లోని పేదలంతా ఇక్కడి సేవలను వినియోగించుకోవాలని కోరారు. స్పెషలిస్ట్‌ వైద్యులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈనెల 30వ తేదీ నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ప్రారంభమవుతోందని, ప్రతి ఇంటికి ఆరోగ్య సురక్ష అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. హెల్త్‌ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ సీఎం జగన్‌ నాయకత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. సీడీ హాస్పిటల్‌లో మౌలిక వసతులు అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ మాట్లాడుతూ 60 పడకల సామర్థ్యంతో సీడీ హాస్పిటల్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. పంచాయతీ స్థాయిలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవికుమార్, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ కృష్ణవేణి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ మహబూబ్, ఆయుష్‌ వైద్యుడు తిరుపతినాయుడు, వైసీపీ సీనియర్‌ నేత అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ లక్ష్మన్న, కార్పొరేటర్లు ఎం.దేవి, వై.దేవి, సుమతి, చంద్రలేఖ, బాబా ఫక్రుద్దీన్, కో ఆప్షన్‌ మేంబర్‌ షంశుద్దీన్, వైసీపీ ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు సాకే కుల్లాయిస్వామి, వైసీపీ నాయకులు గంగాధర్, తిరుపాల్‌ రెడ్డి, మార్కెట్‌ ఖాజా, మల్లికార్జున, సత్యనారాయణ రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగరాజు, నారాయనమ్మ , ముత్యాల్‌ రెడ్డి, లాలూ, గౌరి తదితరులు పాల్గొన్నారు.
శింగనమల మండలం ఏకులనాగేపల్లి గ్రామంలో రోడ్డు.. 30 సంవత్సరాలు తర్వాత మహర్దశ..
శింగనమల మండలం ఏకులనాగేపల్లి గ్రామంలో రోడ్డు.. 30 సంవత్సరాలు తర్వాత మహర్దశ..
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం గుమ్మేపల్లి పంచాయతీ ఏ కుల నాగేపల్లి గ్రామం లో 30 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి రహదారి వేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
అనంతపురం జిల్లా ద్విచక్ర వాహనాలు దొంగలించే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు..
అనంతపురం జిల్లా ద్విచక్ర వాహనాలు దొంగలించే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు. 18.60 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు సీజ్ నిందితులు ముగ్గురు పామిడి, గార్లదిన్నె ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు కూలి పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడిన ముగ్గురు దొంగలు ఈజీగా డబ్బు సంపాదన కోసం బైక్ చోరీలకు పాల్పడిన దొంగలు రద్దీ ఉన్న ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడిన దుండగులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు దొంగలించిన వాహనాలను నేషనల్ పార్క్ వద్ద గోడౌన్ లో ఉంచిన దొంగలు అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.
వైఎస్సార్ వాహన మిత్ర' క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో...
'వైఎస్సార్ వాహన మిత్ర' క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1,301.89 కోట్లు..- సీఎం జగన్

జగన్ పాలన లో రాష్ట్రo రావణ కాష్టం లా మారింది..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 16 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష నల్లబెలూన్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమం లో నార్పల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసిన అరాచక పాలన సాగుతుందన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన చంద్రబాబు గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా దురదృష్టకరం. నియంత సైకో జగన్ సాగిస్తున్న విధ్వంస పాలనపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఎర్రి నాగప్ప, రాఘవ నాయుడు, చంద్రబాబు,లక్ష్మి నాయుడు, లక్ష్మీనారాయణ,బొగ్గు నారాయణస్వామి,చంద్రమోహన్ రెడ్డి,Po రాజన్న, రాజన్న,వెంకట నారాయణరెడ్డి,సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణమ్మ ,తలారి కుల్లాయప్ప, మల్ రెడ్డి, వేణు, రాజ గోపాల్,శేఖర్,సత్తి, గుత్త నాయుడు, వెంకటరమణ,భార్గవ్, రామానాయుడు,గంగాధర్ నాయుడు, రమేషు,గోపాల్,భక్త వత్సల్, సత్తయ్య,శీన, ధనుంజయ,నాగభూషణ, మారుతి, నరసింహుడు,చక్రవర్తి, నాగేంద్ర,శ్రీరాములు, నల్లప్ప, కుల్లాయప్ప,నాగన్న, ప్రసాద్,నాగేష్,ఆది, రాధాకృష్ణ,హరీష్,మహేష్,గణేష్ మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.