అనంతలో పేదలకు చేరువగా కార్పొరేట్‌ వైద్యం.. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
పేదలకు చేరువగా కార్పొరేట్‌ వైద్యం – జగన్‌ నాయకత్వంలో వైద్యరంగంలో మార్పులు – వైసీపీ వచ్చాకే అందుబాటులోకి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి – రూ.300 కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ పనులు – ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ను సద్వినియోగం చేసుకోండి – అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపు – రూ.11 కోట్లతో నిర్మించిన సీడీ ఆస్పత్రి భవనం ప్రారంభం – ప్రైవేట్‌ ఆస్పత్రులకెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవద్దు : ఎంపీ రంగయ్య – 60 బెడ్ల సామర్థ్యంతో సీడీ ఆస్పత్రి నిర్మాణం : జెడ్పీ చైర్‌పర్సన్‌ అనంతపురం, సెప్టెంబర్‌ 29 : కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జగన్‌ నాయకత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. నగరంలోని పాతూరులో రూ.11 కోట్లతో నిర్మించిన సీడీ ఆస్పత్రి నూతన భవనాన్ని ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ మహమ్మద్‌ వసీంతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సీడీ హాస్పిటల్‌ నూతన భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని, పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని చేరువ చేశామని చెప్పారు. అనంతపురం నగరంలో సీడీ హాస్పిటల్‌ మాత్రమే కాకుండా 10 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. సీడీ ఆస్పత్రి ఎంతో పురాతనమైనదని, దీంతో రూ.11 కోట్లతో కొత్త భవనం నిర్మించినట్లు చెప్పారు. ఇప్పటికే నాడు నేడు కింద రూ.300 కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ పనులు చేపట్టామన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని వైసీపీ వచ్చాక రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి అందుబాటులోకి తెచ్చామని, ఇక్కడ ప్రస్తుతం ఏడు విభాగాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. సీడీ ఆస్పత్రిలో కూడా పీడియాట్రిక్, గైనిక్‌ సేవలు అందుబాటులో ఉంటాయని, ఆస్పత్రి పరిసర కాలనీల్లోని పేదలంతా ఇక్కడి సేవలను వినియోగించుకోవాలని కోరారు. స్పెషలిస్ట్‌ వైద్యులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈనెల 30వ తేదీ నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ప్రారంభమవుతోందని, ప్రతి ఇంటికి ఆరోగ్య సురక్ష అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. హెల్త్‌ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ సీఎం జగన్‌ నాయకత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. సీడీ హాస్పిటల్‌లో మౌలిక వసతులు అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ మాట్లాడుతూ 60 పడకల సామర్థ్యంతో సీడీ హాస్పిటల్‌ అందుబాటులోకి తెచ్చామన్నారు. పంచాయతీ స్థాయిలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవికుమార్, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ కృష్ణవేణి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ మహబూబ్, ఆయుష్‌ వైద్యుడు తిరుపతినాయుడు, వైసీపీ సీనియర్‌ నేత అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ లక్ష్మన్న, కార్పొరేటర్లు ఎం.దేవి, వై.దేవి, సుమతి, చంద్రలేఖ, బాబా ఫక్రుద్దీన్, కో ఆప్షన్‌ మేంబర్‌ షంశుద్దీన్, వైసీపీ ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు సాకే కుల్లాయిస్వామి, వైసీపీ నాయకులు గంగాధర్, తిరుపాల్‌ రెడ్డి, మార్కెట్‌ ఖాజా, మల్లికార్జున, సత్యనారాయణ రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగరాజు, నారాయనమ్మ , ముత్యాల్‌ రెడ్డి, లాలూ, గౌరి తదితరులు పాల్గొన్నారు.
శింగనమల మండలం ఏకులనాగేపల్లి గ్రామంలో రోడ్డు.. 30 సంవత్సరాలు తర్వాత మహర్దశ..
శింగనమల మండలం ఏకులనాగేపల్లి గ్రామంలో రోడ్డు.. 30 సంవత్సరాలు తర్వాత మహర్దశ..
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం గుమ్మేపల్లి పంచాయతీ ఏ కుల నాగేపల్లి గ్రామం లో 30 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి రహదారి వేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
అనంతపురం జిల్లా ద్విచక్ర వాహనాలు దొంగలించే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు..
అనంతపురం జిల్లా ద్విచక్ర వాహనాలు దొంగలించే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు. 18.60 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు సీజ్ నిందితులు ముగ్గురు పామిడి, గార్లదిన్నె ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు కూలి పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడిన ముగ్గురు దొంగలు ఈజీగా డబ్బు సంపాదన కోసం బైక్ చోరీలకు పాల్పడిన దొంగలు రద్దీ ఉన్న ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడిన దుండగులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు దొంగలించిన వాహనాలను నేషనల్ పార్క్ వద్ద గోడౌన్ లో ఉంచిన దొంగలు అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.
వైఎస్సార్ వాహన మిత్ర' క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో...
'వైఎస్సార్ వాహన మిత్ర' క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1,301.89 కోట్లు..- సీఎం జగన్

జగన్ పాలన లో రాష్ట్రo రావణ కాష్టం లా మారింది..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 16 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష నల్లబెలూన్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమం లో నార్పల మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసిన అరాచక పాలన సాగుతుందన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన చంద్రబాబు గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా దురదృష్టకరం. నియంత సైకో జగన్ సాగిస్తున్న విధ్వంస పాలనపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఎర్రి నాగప్ప, రాఘవ నాయుడు, చంద్రబాబు,లక్ష్మి నాయుడు, లక్ష్మీనారాయణ,బొగ్గు నారాయణస్వామి,చంద్రమోహన్ రెడ్డి,Po రాజన్న, రాజన్న,వెంకట నారాయణరెడ్డి,సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణమ్మ ,తలారి కుల్లాయప్ప, మల్ రెడ్డి, వేణు, రాజ గోపాల్,శేఖర్,సత్తి, గుత్త నాయుడు, వెంకటరమణ,భార్గవ్, రామానాయుడు,గంగాధర్ నాయుడు, రమేషు,గోపాల్,భక్త వత్సల్, సత్తయ్య,శీన, ధనుంజయ,నాగభూషణ, మారుతి, నరసింహుడు,చక్రవర్తి, నాగేంద్ర,శ్రీరాములు, నల్లప్ప, కుల్లాయప్ప,నాగన్న, ప్రసాద్,నాగేష్,ఆది, రాధాకృష్ణ,హరీష్,మహేష్,గణేష్ మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో  సమకాలిన, సామాజిక అంశాలపై తన కవిత్వ పటిమతో పోరాటం చేసినమహాకవి జాషువా.. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు..
ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు, నవయుగ చక్రవర్తి గుఱ్ఱం జాషువా సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తికలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, మరియు జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో కలిసిపూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రముఖ రచయిత, కవి, సాహితీకారుడు గుఱ్ఱం జాషువా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాత్రగడ్డపాడులో గుఱ్ఱం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారన్నారు. చిన్నతనం నుంచి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేదని, బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడిని, ఆయన 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశాడన్నారు. రుక్మిణి కళ్యాణం, కోకిల, ధ్రువ విజయం, గబ్బిలం, ఫిరదౌసి, ఖండకావ్యాలు, తదితర అనేక రచనలు చేశాడని, కవితా విశారద, కవికోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ గా బిరుదులు పొంది ప్రసిద్ధులైనారన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో యుద్ధ ప్రచారకుడిగా పని చేశారన్నారు. తెలుగు రాష్ట్రంలో జన్మించిన అతి గొప్ప వ్యక్తుల్లో జాషువా ఒకరని, కడు పేద కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు పొందిన మహనీయుల్లో జాషువా చాలా గొప్పవాడన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డి అర్ ఓ  కొండయ్య మాట్లాడుతూ కవి కోకిల బిరుదాంకుతులైన గుర్రం జాషువా ఉపాధ్యాయునిగా, ఆచార్యునిగా, శాసనమండలి సభ్యునిగా పని చేయడంతో పాటు సాహిత్యకారునిగా సామాజిక అసమానతలు,  మూఢాచారాలు, దేశభక్తి వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక ప్రసిద్ధ రచనలు రచించడం ద్వారా తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారని  తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘికసంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, డి ఆర్ డి పి డి నరసయ్య, పశుసంవర్ధక జెడ్ శుభ దాస్, ఐ సి డి సి పిడి, లలిత కుమారి, ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు డిఐపిఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి.
గుత్తి మండల ప్రవాస్ యోజన లో భాగంగా మండల బీజేపీ కార్యవర్గ సమావేశం..
  భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు సూచనల మేరకు మండల అధ్యక్షుడు బలకా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రవాస్ యోజన లో భాగంగా మండల కార్యవర్గ సమావేశం బిజెపి మండల కార్యాలయంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రవాస్ యోజన మండల ఇంచార్జ్ గొంది అశోక్ గారు హాజరైనారు ఈ సమావేశంలో మండల కమిటీ శక్తి కేంద్ర ప్రముఖులు బూతు కమిటీ అధ్యక్షులు లతో మాట్లాడడం జరిగినది బిజెపి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేసి పూర్తిస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలని తెలపడం జరిగినది విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలలో కి తీసుకువెళ్లాలని సూచించడమైనది ప్రధానమంత్రి జయంతి సందర్భంగా సేవా పక్షంలో కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు డిబి రంగరాజు ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జె యం మాణిక్యం ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి నాగేపల్లి లక్ష్మయ్య ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పూజారు ఉపులప్ప కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అప్పల రంగస్వామి రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య మండల ఉపాధ్యక్షులు వరిమడుగు లక్ష్మీనారాయణ పాటిల్ మోహన్ రెడ్డి మండల కార్యదర్శి ఎస్ రాము వడ్డే వెంకటేశ్వర్లు వేణుగోపాల్ రాజ్ జే వెంకట్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
మిలద్ ఉన్ నబీ ప్రత్యేక ప్రార్థనలతో పాల్గొన్న అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ AKS ఫయాజ్..
నేడు మిలద్ ఉన్ నబీ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, నగర మేయర్ వసీం గారితో కలిసి మసుబా బీ దర్గా లో ప్రత్యేక ప్రార్థన లో పాల్గొన్నారు అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ AKS ఫయాజ్ గారు. అనంతరం మొహమ్మద్ ప్రవక్త ప్రజలను మంచి మార్గం లో నడిపించడానికి చెప్పిన విషయాలను గుర్తు పెట్టుకోవాలి అని అన్నారు. ప్రేమానురాగాలు, శాంతిని మొహమ్మద్ ప్రవక్త బోధించారు అని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో మత పెద్దలు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైఫుల్ల బైగ్, కో ఆప్షన్ సభ్యులు షంశుద్దిన్, వైఎస్సార్సీపీ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు....
గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల గారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. వడగాల్పు నా జివీతమైతే వెన్నెల నా కవిత్వం అన్న నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా
ఎం.యస్ .స్వామినాథన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ CH. ప్రమీల..
మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ (జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.ఇవాళ ఆయన 98 వయసులో చెన్నై లో తుది శ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.