తెలంగాణలో త్వరలో సింగరేణి ఎన్నికల షెడ్యూల్

సింగరేణి కార్మిక సంఘాలతో హైదరాబాద్ లో సోమవారం డిప్యూటీ లేబర్ కమిషనర్ సమావేశమయ్యారని, ఇందులో సింగరేణి ఎన్నికలకు సంబంధించి తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలు పట్టుబట్టాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.

ఈ నెల 21న సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లిస్తున్నందున 22వ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని మిగిలిన కార్మిక సంఘాలన్నీ కోరాయని పేర్కొన్నారు.

మెజార్టీ కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈ నెల 22న షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారని, అక్టోబర్ నెలాఖరు లేదా అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ఒక ప్రకటన విడుదల చేశారు.....

అధికార పార్టీ అక్రమ అరెస్టులకు న్యాయం కోసం ప్రజల్లోకి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి?

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ తరుణంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్ పై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, వారిని తప్పుడు కేసులో ఇరికించి వేధిస్తోందని, గడిచిన 24 గంటలుగా ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని ప్రజల వద్దకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ ప్రజల్లోకి వెళ్లే అంశంపై ఇప్పటికే పార్టీలో ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడే సమయంలో సీఐడీ చీఫ్ సంజయ్ నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు పరోక్షంగా చెప్పారు.

ప్రతిపక్ష నేతలను ఎన్నికల సంవత్సరంలో అరెస్ట్ చేయడం సాధారణంగా జరగవు. వారిపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమైతే తమకు నష్టం చేస్తుందని అధికార పార్టీ ఆలోచిస్తుంది.

రాజకీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం ఏదీ ఉండదు. వైఎస్ మరణించిన తర్వాత ప్రజల్లో సానుభూతి అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు వెల్లువలా వచ్చింది. అదే తరహాలో ప్రస్తుతం సానుభూతిని ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడంతో ప్రజలు ఇచ్చారని, అదే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోపాటు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటూ వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కితే సానుభూతి వెల్లువలా వస్తుందంటున్నారు. టిడిపికి చెందిన సీనియర్ నాయకులు.

చెంపలు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొడతారా?

అమరావతిలో బడుగు, బలహీన వర్గాల వారి నుండి భూములు

భూముల పక్కనుండి రింగ్ రోడ్ వెళ్లేలా ప్లాన్

స్కిల్ స్కాంకి సూత్రధారి చంద్రబాబే

పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడేనా?

జగన్ కేసులు వేరు, చంద్రబాబు కేసులు వేరు

వ్యక్తిగతంగా మాకు ఎవరి మీదా కోపం లేదు

తాడేపల్లి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబేమీ యుగపురుషుడు కాదని, చేసిన తప్పును ఒప్పుకుని పొరపాటయిందని చెప్పి చెంపలకు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొట్టడమేంటని ప్రశ్నించారు.

అమరావతి పేరుతో అక్రమాలు..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుని రిమాండుకు తరలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పి బడుగు, బలహీన వర్గాల వారి నుండి భూములు దోచుకున్నారన్నారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో కట్టిన టిట్కో ఇళ్ల దగ్గర్నుంచి సెక్రటేరియట్ వరకు అన్నిటిలోనూ దోపిడీ చేశారని తెలిపారు..

Nadendla Manohar: 144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా?: నాదెండ్ల మనోహర్‌

మంగళగిరి: ఏపీలో పోలీసులు వైకాపాకు కొమ్ముకాస్తూ.. తొత్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై చేపట్టిన బంద్ విషయంలో పోలీసులు 144 సెక్షన్ పెట్టారని... కానీ, వైకాపా నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగారని ఆరోపించారు. గుంటూరులో మేయర్ కావటి మనోహర్ నాయుడు పోలీసు లాఠీతో జనసేన కార్యకర్తల్ని బెదిరించటాన్ని తప్పుబట్టారు.

144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుని కుట్రపూరితంగా అరెస్టు చేసింది నిజమేనని.. అందుకే రాష్ట్రంలో ప్రజలు ఇవాళ స్వచ్చందంగా బంద్ పాటించారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ రెడ్డి ఇంటికి పోవటం ఖాయమని నాదెండ్ల దుయ్యబట్టారు.

Nara Lokesh: చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్‌.. ఆ ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు: లోకేశ్‌

రాజమహేంద్రవరం: ప్రజా సంక్షేమమే తప్ప అవినీతి చేయడం తమ కుటుంబ రక్తంలోనే లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో మీడియాతో లోకేశ్‌ మాట్లాడారు. ''ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప వేరేమీ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. ఆయన ఎప్పుడూ ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్‌ అని బిల్‌గేట్స్‌, క్లింటన్‌, ఫార్చూన్‌ 500 సీఈవోలూ చెబుతారు. అలాంటి వ్యక్తిపై దొంగకేసు పెట్టి సైకో జగన్‌ ప్రభుత్వం జైలుకు పంపింది'' అని దుయ్యబట్టారు.

జగన్‌కు ఒళ్లంతా విషమే

''పాముకు తలలోనే విషం ఉంటుంది.కానీ, జగన్‌కు ఒళ్లంతా విషమే. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఎప్పుడూ లేనంత స్పందన వచ్చింది. తెదేపా బంద్‌కు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలిపారు. బంద్‌ను జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు. బంద్‌లో పాల్గొన్న జనసేన, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. చంద్రబాబు జోలికి రావడం సైకో జగన్‌ చేసిన అతిపెద్ద తప్పు. జగన్‌ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారు.'' అని లోకేశ్‌ హెచ్చరించారు. .

అసోం కామాఖ్య దేవి ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

అసోంలోని గువ‌హ‌టిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం దర్శించుకున్నారు.

ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న క‌విత‌కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. కామాఖ్య ఆల‌యంలో క‌విత ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ, దేశ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాల‌ని ప్రార్థించానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సీఎం కేసీఆర్‌ని మరోసారి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు.

నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నానని, తాజాగా మళ్ళీ కామాఖ్య దేవిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు.

ఆధ్యాత్మికతలో భారతదేశం విరజిల్లుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన అసోంలో ఉన్న కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం త‌న‌కు కలగడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఆత్మవిశ్వాసం ఉన్న చెల్లికి దేవుడిచ్చిన అన్నయ్య తోడు

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఐటీ ఉద్యోగిని రుద్ర రచన రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడంతో రుద్ర రచన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే …. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాల సదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడ‌లోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ విద్య పూర్తి చేశారు.

ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ సీటు సంపాదించారు. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజనీరింగ్ ఫీజు చెల్లించలేకపోయింది. 2019లో సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి ఆమెను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ తన వ్యక్తిగత సంపాదన నుంచి భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ చదివిన రుద్ర రచన.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు.

ఆ సంద‌ర్భంగా ప్రగతి భవన్‌లో మంత్రిని కలువగా ఆమె చదువు, ఉద్యోగాల గురించి తెలుసుకుని సంతోషపడ్డారు. తనకంటూ ఎవరూ లేకున్నా రుద్ర రచన ఆత్మ విశ్వాసంతో జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు. అప్పుడు కూడా రుద్ర రచన మంత్రి కేటీఆర్‌కు వెండి రాఖీ తయారు చేయించి కట్టారు. ఉద్యోగం సాధించిన ర‌చ‌న త‌న సంపాద‌న‌లోని ల‌క్ష రూపాయిల‌ను ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందించారు...

Supreme Court: సుప్రీం కోర్టు న్యాయవాదిని దారుణంగా చంపేసిన భర్త.. ఎందుకంటే..?

లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాదిని ఆమె భర్తనే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టాడు.

తాను స్టోర్ రూంలో దాక్కున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 61 ఏళ్ల సుప్రీం కోర్టు న్యాయవాది రేణు సిన్హా, 62 ఏళ్ల ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హా నోయిడాలోని సెక్టార్ 30లో గల బంగ్లాలో నివాసం ఉంటున్నారు. నితిన్ నాథ్ సిన్హా మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. వారి కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు.

అయితే రెండు రోజులగా రేణు సిన్హా కనిపించకుండాపోయింది. ఆమె సోదరుడు ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. న్యాయవాది సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు వారు నివాసం ఉండే బంగ్లాలోకి ప్రవేశించారు. బంగ్లా మొత్తం వెతకగా బాత్‌రూమ్‌లో రేణు సిన్హా మృతదేహం లభించింది. ఈ ఘటన శనివారం జరిగింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి రేణు సిన్హా భర్త నితిన్ సిన్హా కూడా కనిపించకపోకుండాపోయాడు. దీంతో న్యాయవాది సోదరుడు తన సోదరిని ఆమె భర్తనే హత్య చేశాడని ఆరోపించాడు. పైగా భార్యభర్తలిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు కూడా జరుగుతున్నట్టు తెలిపాడు. అనంతరం న్యాయవాది భర్త నితిన్ కోసం పోలీసులు గాలించగా అచూకీ లభించలేదు. చివరికి నితిన్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు.

అది లాయర్ బంగ్లా వద్ద చూపించింది. బంగ్లాలో వెతకగా స్టోర్ రూంలో నితిన్ దొరికాడు. భార్యను హత్య చేశాక 36 గంటలపాటు నితిన్ స్టోర్ రూంలోనే దాక్కున్నాడు. అదుపులోకి తీసుకుని విచారించగా భార్యను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. తమ బంగ్లాను విక్రయించే విషయంలో భార్యభర్తల మధ్య నెలకొన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నితిన్ బంగ్లాను రూ.4 కోట్లకు విక్రయించడానికి ప్లాన్ చేశాడని, అంతేకాకుండా అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు చెప్పారు. కానీ బంగ్లాను అమ్మడాన్ని నితిన్ భార్య రేణు సిన్హా వ్యతిరేకించిందని పేర్కొన్నారు. ఈ వివాదమే భార్యభర్తల మధ్య తరచుగా గొడవలకు దారి తీసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నితిన్ నాథ్ సిన్హాపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు..

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికై 13న ధర్నాను జయప్రదం చేయండి

-:పోలే సత్యనారాయణ

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 13న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు జిల్లాలోని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ మండలంలోని పెద్ద సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన 2000/ రూపాయల వేతనం వెంటనే అమలు చేయాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి ఏరియర్స్ తో సహా చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంట చేసిన బిల్లులు రాక కార్మికులు అప్పులు తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టలేక కుటుంబాలు గడవక అర్ధాకలితో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముల్గే నక్క మీద తాటి పండ్లు పడ్డ చందంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు పాత మెనూకే సరిపోకపోగా కొత్త మెనూ ప్రకారం వండి పెట్టమని కార్మికులను అనేక ఇబ్బందులకు, భయాందోళనలకు గురి చేస్తూ వేధిస్తున్నారని అన్నారు అంగన్వాడి కేంద్రాల మాదిరిగా పాఠశాలలకు ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేయాలని, వంటకు సరిపడా గ్యాస్ పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని కార్మికులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని తదితర సమస్యల పరిష్కారానికై ఈ నెల 13న (బుధవారం) జరిగే రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ధర్నాకు జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున కదలి విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొండ రాములమ్మ, గోవర్ధనమ్మ, జాకటి లక్ష్మమ్మ, ముసుకు కలమ్మ తదితరులు పాల్గొన్నారు.

చంద్ర‌బాబు డే 1

తన జీవితంలో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

జైల్లో ఆయనకు స్నేహ బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. అన్ని వసతులు కల్పించారు. ఒక సహాయకుడితో పాటు, ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పించారు. అంతేకాదు ఆయన ఉన్న బ్లాక్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

డ్యూటీ సిబ్బంది మినహా మరెవరినీ అక్కడకు వెళ్లనీయడం లేదు. ఇక ఉదయాన్నే చంద్రబాబు నాయుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు..

చంద్రబాబుకు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం అల్పాహారంగా ఆయనకు ఫ్రూట్ సలాడ్ ను కుటుంబ సభ్యులు పంపించారు.

అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని సిబ్బంది అందించారు. అలాగే బ్ర‌హ్మ‌ణి, నారా లోకేష్, భువ‌నేశ్వ‌రి లు నేడు ములాఖ‌త్ స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ని క‌లువ‌నున్నారు..

ఇక చంద్ర‌బాబు ఆహారం ఇత‌ర స‌దుపాయాల‌న్ని టిడిపి నేత వాసు ఇంటి నుంచి క‌ల్పిస్తున్నారు.. నారా లోకేష్ కూడా అక్క‌డే బ‌స చేశారు..