తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 15

తిరుమలలో భక్తుల రద్దీ నేడు మంగళవారం పెరిగింది. స్వామివారి దర్శనం కోసం నేడు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 74,617 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.67 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

32,752 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

*

ముగిసిన టీపీసీసీ ఎన్నికల కమిటీ భేటీ

రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే సోమవారం గాంధీభవన్ లో టీ పీసీసీ ఎన్నికల, స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పలు విషయాలను భేటీలో చర్చించినట్లు తెలిసింది.

ఇక స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత సీఈసీకి తొలి జాబితా పంపనున్నారు. సెప్టెంబర్ లో అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు టీపీసీసీ ముఖ్య నేతలు తెలిపారు.

సెప్టెంబర్ మొదటివారంలో మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కానుందని తెలిపారు.

ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె.మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Revanth Reddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వైన్‌ షాపులకు మళ్లీ టెండర్లు: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: భారాస ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నందునే.. సీఎం కేసీఆర్‌ అన్ని ఆస్తులు అమ్ముకుని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు..

హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్.. నగరంలోని వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని నిలదీశారు.

100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, భూములు కొన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.

గాంధీభవన్‌లో అలంపూర్‌, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు.. ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

వారందరికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

మద్యం దుకాణాలను సొంత మనుషులకు అప్పగించేందుకే ముందుగానే టెండర్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వైన్‌ షాపులకు మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పోలీసు అధికారులనుద్దేశించి రేవంత్‌ మాట్లాడారు..

తెలంగాణ పోలీసులకు సేవా పతకాలను ప్రకటించిన కేంద్రం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాల ను ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.

తెలంగాణ నుంచి 34 మంది ఎంపిక కాగా.. ఏపీ నుంచి 29 మంది పోలీసులకు పతకాలు దక్కాయి. ఏపీ నుంచి ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీస్‌ గ్యాలంటరీ పతకాలు, 10 మందికి విశిష్ఠ సేవా పతకాలకు ఎంపికయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 22 మందికి పోలీస్‌ గ్యాలంటరీ, పది మందికి పోలీస్‌ సేవా పతకాలు, మరో ఇద్దరు తెలంగాణ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు...

ఎస్పీ భాస్కరన్, ఇన్‌స్పెక్టర్లు.. శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్‌ఐ బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్‌కానిస్టేబుళ్లు.. ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు.

గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్‌ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్ తదితరులు.

తెలంగాణ నుంచి పోలీస్‌ సేవా పతకాలు లభించిన పది మంది పోలీసుల వివరాలు :

బండి వెంకటేశ్వర రెడ్డి అదనపు ఎస్పీ, ఖైరతాబాద్,

మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు అదనపు ఎస్పీ,

ఆత్మకూరి వెంకటేశ్వరి అదనపు ఎస్పీ,

ఆందోజు సత్యనారాయణ ఆర్ఎస్ఐ,

కక్కెర్ల శ్రీనివాస్ ఆర్ఎస్ఐ,

మహంకాళి మధు ఆర్ఎస్ఐ,

అజెల్ల శ్రీనివాస రావు ఆర్ఐ,

రసమోని వెంకటయ్య సీనియర్ కమాండో,

అరవేటి భాను ప్రసాద్ రావు ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్,

సాయన వెంకటేశ్వర్లు ఏఎస్ఐ...

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.

పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో 60 ఏండ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది.

హైదరాబాద్‌ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి అందించే టీ-24 టికెట్‌ను అందరికీ కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది.

పిల్లలకు మాత్రం టీ-24 టికెట్‌ను రూ.50కే అందజేయనున్నది. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఘాటు వ్యాఖ్యలు

'బీజేపీకి ఓటు వేసే వారు రాక్షస స్వభావం కలవారు, నేను శపిస్తాను...'

కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సూర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని కైతాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. భారతీయ జనతా పార్టీ, దాని మద్దతుదారులది రాక్షస స్వభావం. బీజేపీకి ఓటు వేసే వారు కూడా పైశాచిక స్వభావం కలవారు. అలాంటి వారిని హర్యానా దేశం నుంచి తిట్టాలని సూర్జేవాలా అన్నారు.

వాస్తవానికి హర్యానాలోని కైతాల్‌లో జరిగిన బహిరంగ సభలో సూర్జేవాలా ప్రసంగిస్తూ.. ఇక్కడ హర్యానా బీజేపీ ప్రభుత్వంపై దాడి చేస్తూ 'నా హర్యానా బాధతో విలపిస్తోంది' అని సుర్జేవాలా అన్నారు. సీఈటీ ఉత్తీర్ణత సాధించిన యువత కళ్లలో కన్నీటి ప్రవాహం. జింద్ దాని పరిమితిని చేరుకుంది, ఇప్పుడు రవిదాసియా మరియు వాల్మీకి కమ్యూనిటీకి గురు రవిదాస్ జీ మరియు మహర్షి వాల్మీకి జీ విగ్రహాలను స్థాపించడానికి కూడా అనుమతించడం లేదు. వారిని రక్తపు కన్నీళ్లు పెట్టించినందుకు లెక్క చెప్పేదెవరు? మనోహర్ లాల్ ఖట్టర్ మరియు దుష్యంత్ చౌతాలాల అవినీతి, అన్యాయపు ప్రభుత్వం నుండి ఈ కన్నీళ్ల ఖాతా తీసుకునే వరకు నేను శాంతియుతంగా కూర్చోను.

యువతకు న్యాయం చేయాలంటూ ఎండవేడిమిలో నడవడం లేదని, ఈ ప్రభుత్వం చేస్తున్న అతిశయోక్తులకు యువత భయపడిపోయిందని.. వారి భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుకుంటోందని అన్నారు. ఈ యువకులకు న్యాయం చేయాలంటూ 17 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం.. పరీక్షలో హాజరయ్యే అవకాశాన్ని కూడా మీరు తీసేస్తున్నారు.. ఇక్కడితో ఆగలేదని సుర్జేవాలా, బీజేపీ, జేజేపీలు రాక్షసుల పార్టీలని అన్నారు. బీజేపీకి ఓట్లు వేసి మద్దతు ఇచ్చే వారు కూడా రాక్షస స్వభావం కలవారని.. ఈ రోజు మహాభారత భూమిపై నేను వారిని శపిస్తానని అన్నారు.

బిజెపికి వ్యతిరేకంగా అంధత్వ బాధితుడు - సంబిత్ పాత్ర

హర్యానాలోని కైతాల్‌లో సూర్జేవాలా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. దీనిపై ఇప్పుడు బీజేపీ బదులిచ్చింది. కాంగ్రెస్ నాయకుడి భాషపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్‌లో స్పందిస్తూ, "రాజ్‌కుమార్‌ను ప్రారంభించడంలో పదేపదే విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను మరియు జానారెడ్డిని దుర్వినియోగం చేయడం ప్రారంభించింది" అని అన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలతో కళ్లు బైర్లు కమ్మిన కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పేది వినండి - 'బీజేపీకి ఓటేసి మద్దతు ఇచ్చే దేశ ప్రజలు 'రాక్షసులు'.

సంబిత్ పాత్ర తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆగస్టు 13 వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశాడు, అందులో రణదీప్ సూర్జేవాలా ప్రకటన చేశారు. 'ఒకవైపు 140 కోట్ల మంది దేశప్రజలకు ప్రధాని మోదీజీ, ప్రజానీకం జనార్దన్ స్వరూపం, మరోపక్క ప్రజానీకం రాక్షస స్వరూపం.

షాజాద్ పూనావాలా ఏం చెప్పారు?

కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను అవమానించడమే కాకుండా శాపనార్థాలు పెడుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి షాజాద్‌ పూనావాలా అన్నారు. కాంగ్రెస్ హద్దులు దాటిందని, 2024లో ఎవరిని ఆశీర్వదించారో, ఎవరిని తిట్టారో 2024లో తేలనుందని పూనావల్ల అన్నారు.పార్టీ నేతలు ఉస్మాజీ, హఫీజ్ సయీద్ లు ఈరోజు భారత ప్రజలను దుర్భాషలాడడం మొదలుపెట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తింది. పరాయి నేలకు వెళ్లడం వల్ల ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని అన్నారు. భారతమాత హత్యకు గురైంది, ఆమె కూడా చెప్పింది. ఇప్పుడు రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ఓట్లు వేసే వారు పైశాచిక స్వభావం కలవారు. మనమందరం జనతా-జనార్దన్‌గా భావించే బీజేపీకి మద్దతు ఇస్తున్న ప్రజలు. ఇలాంటి దాదాపు 23 కోట్ల మంది పైశాచిక స్వభావం గల వారిని కాంగ్రెస్ పార్టీ అంటోంది.

వరంగల్ లో ఉద్రిక్తత.. బ‌ల్దియా ముట్ట‌డికి కాంగ్రెస్ య‌త్నం

వరంగల్ జిల్లా:ఆగస్టు 14 వరంగల్ మహా నగరంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలను నిరశిస్తూ వరంగల్ బల్దియా ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

సెంట్రల్ జోన్ డిసిపి బారి నేతృత్వంలో ఎం జి ఎం జంక్షన్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడిక్కడే కాంగ్రెస్ శ్రేణులను అరెస్టులు చేస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బల్దియా కార్యాలయం వైపుకు వెళ్లకుండా భారీ కేడ్లు పెట్టి రాకపోకలను నిషేధించారు.ఎం జి ఎం సెంటర్లోనే కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటుండటంతో ఉద్రిక్తత నెలకొంది.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందడమే కాక, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడాన్ని నిరాశిస్తూ మున్సిపల్‌ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఆఫీసు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్‌ నాయకులను ముందుస్తుగా అరెస్ట్‌లు చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతించలేదని సెంట్రల్ జోన్ డిసిపి బారి స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు.. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్‌ నాయకులు పట్టుబట్టారు. దీంతో, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లతో ఆందోళనను అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు చేశారు....

తెలంగాణకు అమిత్‌ షా ఖరారైన షెడ్యూల్‌

తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ… ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఆ పార్టీ అగ్రనేతలు పర్యటించేలా ప్లాన్‌ చేసింది. తాజాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.

ఈ నెల 27న అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. అదే రోజున ఖమ్మంలో భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తోంది.

ఇప్పటికే అమిత్‌ షా పర్యటన రాష్ట్రంలో రెండు సార్లు వాయిదా పడింది. బిపర్‌జాయ్‌ తుఫాన్‌ కారణంగా ఒకసారి, మణిపూర్‌ అల్లర్లు, వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో మరోసారి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దయింది.

అసెంబ్లి ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో తెలంగాణలో పర్యటించాలని బీజేపీ రాష్ట్ర నేతలు అమిత్‌షాకు పదే పదే విన్నవించారు. అసెంబ్లి ఎన్నికలకు ఇక నాలుగు నెలల సమయమే ఉండడంతో అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది...

వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

హైదరాబాద్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో నేడు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు అవినాష్ రెడ్డి..

గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు..వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుంది.

అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై చార్జిషీట్ వేసిన సీబీఐ. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది.

వివేకా హత్య కేసులో 145 పేజీల తో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీబీఐ. ఇక జూన్ 19 తేదీన సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాసిన అవినాష్ రెడ్డి. దర్యాప్తు ను పునః సమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు.

గత దర్యాప్తు అధికారి రాంసింగ్ పై ఆరోపణలు చేసిన అవినాష్ రెడ్డి.. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ సీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లెక్కలో పేర్కొన్న అవినాష్ రెడ్డి. వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలని లేఖ లో పేర్కొన్నారు. ఇక ఈ లేఖ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సీబీఐ..

Hyderabad Express: హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం..

ఉలవపాడు: నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి పాల్పడ్డారు..

ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు.

అనంతరం దొంగలు రైలులోని ఎస్‌-1, ఎస్‌-2, ఎస్‌-3 బోగీల్లోకి ప్రవేశించి మహిళల వద్ద ఉన్న సుమారు 30 తులాల బంగారాన్ని చోరీ చేశారు.

అనంతరం తెట్టు సమీపంలో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి చోరీకి పాల్పడబోతుండగా.. రైలులోని పోలీసలు అప్రమత్తమై వారిని ఎదుర్కొన్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పారిపోయారు. ఆ తర్వాత రైలు ముందుకు కదిలింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఒంగోలులో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు..