నల్గొండ జిల్లా:కట్టంగూర్ మండలం::డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించిన.నాయకులు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించిన. నాయకులు

.

Streetbuzz news :నల్గొండ జిల్లా

కట్టంగూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన. నాయకులు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ప్రపంచ దేశాలు సైతం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు.అని అన్నారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గద్దపాటి దానయ్య మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి జయంతి నిర్వహించుకోవడం. ఎంతో సంతోషం గత కొన్ని సంవత్సరాల నుండి ఐక్యరాజ్యసమితి డాక్టర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా నేడు తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ జన్మదిన సందర్భంగా 125 అడుగుల ఎత్తు విగ్రహ ఆవిష్కరణ హుసేన్ సాగర్ దగ్గరలో నిర్వహించడం యావత్ ప్రపంచం గర్జించదగ్గ విధంగా జయంతినీ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటరానితనం అసమానతలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మేడి వెర్నిక రత్న పుట్టినరోజు కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సన్నిధిలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో.కట్టంగూర్ మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,మాజీ రెపరండం సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గద్దపాటి దానయ్య, విద్యార్థి జిల్లా నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్,ప్రముఖ అడ్వకేట్ మేడి విజయకుమార్,జిల్లా యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్,బొజ్జ శ్రీను,ఊట్కూరి రాజశేఖర్,శ్రీనివాస్,పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ :నకిరేకల్ :డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి ఘనంగా నిర్వహించిన.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య.

బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి ఘనంగా నిర్వహించిన.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి.ఆ మహనీయుని స్మరించుకుని. ఈ సందర్భంగా. మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య. మాట్లాడుతూ...అంటరానితనంపై అంబేద్కర్ పూరించిన సమరశంఖం నేటికీ అగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా,సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి సేవలు సవరించుకుందాం భవిష్యత్తు తరాలకు వారు చేసిన కృషిని తెలియచేద్దాం ఆయన ఆశయాలను కొనసాగిద్దాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు రాజు,

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంబాయ్ శ్రీను,యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

నల్గొండ జిల్లా:బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి ఘనంగా నిర్వహించారు .కట్టంగూర్ బీజేపీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.కట్టంగూర్ బిజెపి మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని. నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆదేశానుసారం కట్టంగూర్ మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షులు నూకల. సుధాకర్ రెడ్డి అధ్వర్యంలో డా.బి.అర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి. వారి విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి. మాట్లాడుతూ. అంబేద్కర్ మహనీయుడు విశ్వ విఖ్యత గాంచిన అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం ముందు పీఠిక లో పేర్కొన్న సర్వ సత్తక ఘనతంత్ర లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద సమాజ నిర్మాణమం కోసం కృషి చేశారు.ఈ కార్యక్రమంలో..బీజేపీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల సైదులు,కిసాన్ మోర్చా జిల్లా ఉపధ్యక్షులు పాదూరి వెంకట్ రెడ్డి,బీజేపీ మండల ఉపధ్యక్షులు కత్తుల హనుమంతు,రమేష్,వినోద్, చంద్రబాబు,నాగరాజు,నవీన్, పోలీస్ అధికారులు.తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :నకిరేకల్ :ఘనంగా బిఎస్పి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి*

ఘనంగా బిఎస్పి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

.

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బిఎస్పి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో వున్నా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని అందించడం ద్వారా డాక్టర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆత్మ గౌరవాన్ని అందించారని అన్నారు. దేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ కొనియాడారు. బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది, మానవతా వాది అని పేర్కొన్నారు. లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు. ఆర్థిక శాస్త్రంలో మొదటి పి హెచ్ డి చేసిన వ్యక్తి డా బి ఆర్ అంబేద్కర్ రే నని చెప్పారు. అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప సామాజిక సంఘ సంస్కర్త డా బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపకల్పన లో కీలకమైన ముసాయిదా కమిటీ కి చైర్మన్ గా వ్యవహరించారనీ చెప్పారు. దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము ను రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని కొనియాడారు.బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందన్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి దళితులపై మహిళలపై దాడులకు ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దేశ సంపదను అంబానీలకు ఆదోనిలకు కట్టుబడుతుందన్నారు. లౌకిక వాదానికి దెబ్బ కొడుతుందని రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని కార్మికులకు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరంహొ ఎంతైనా ఉందన్నారు. ఆ రకమైన దఅక్పథంతో యువత ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్,నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కార్యదర్శి చందుపట్ల శృతి,నియోజకవర్గ కోశాధికారి దేశాపాక రాజ్ కుమార్, నియోజకవర్గ బి వి ఎఫ్ కన్వీనర్ మేడి రఘు,మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మండల ఉపాధక్షులు చింత శ్రీకాంత్,మండల కార్యదర్శి చింత రవి,మల్లేష్, నవీన్, సురేష్,తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

వాడవాడలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలను నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడం లో ఘనంగా నిర్వహించారు. అదే విధంగా సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించరు. ముఖ్య అతిథిగా బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసి, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు. ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ మండల కార్యదర్శి,మేడి వాసుదేవ్, మండల కోశాధికారి పాల మహేష్,మేడి అశోక్,కత్తుల దాసు,మేడి రామలింగయ్య,మేడి గణేష్,దండు ప్రసాద్,నారపాక రాజు,సిరిపంగి దిలీప్,వడేపల్లి రాంబాబు,వడేపల్లి రవి,బుర్రి బాలస్వామి,మేడి హరికృష్ణ,నాగిళ్ళ సురేష్,కత్తుల విజయ్,వినోద్,చింటూ, బిఎస్పి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా. నకిరేకల్:అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని డా. బీ.ఆర్ అంబెడ్కర్ 132 వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రేయస్కరమని భావించటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడికి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించిందని అన్నారు. దేశంలో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.అంబేద్కర్‌ ఆశయాలకు రూపం కేసీఆర్‌ అని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాలకు బాబాసాహెబ్‌ మహోన్నత్వాన్ని చాటేలా ఏర్పాటు అని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర సెక్రటేరియట్‌కు పేరు.. చరిత్రకు సజీవ సాక్ష్యం అని ఆయన తెలిపారు. దళిత సంక్షేమంతోనే దేశాభివృద్ధి అని ఆయన అన్నారు.తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల సంక్షేమం అని ఆయన అన్నారు.దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. నేడు దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.బిఆర్‌ఎస్‌తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని అని ఆయన అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో తెలంగాణ దళిత బంధు పథకం అమ‌లు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నద‌ని ఆయన చెప్పారు. డా.బీఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌య సాధ‌న కోసం ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు కృషి చేస్తున్నార‌ని తెలిపారు.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్ గౌడ్,కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :నకిరేకల్ :రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

                              

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ మరియు నిమ్మ మార్కెట్, తాటికల్,చందంపల్లి మంగళపల్లి గ్రామాలలో పీఏసిఎస్, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...   

రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి నేరుగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.

ధాన్యంలో తేమశాతం 17 కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రైతులకు అన్ని సంక్షేమ పధకాలను అందిస్తూ రైతుల మన్నలను పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు.

రైతులు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు.  

రైతుల సంక్షేమం కోసం సీఎం కెసిఆర్ ఎల్లవేళలా కృషి చేస్తున్నారని అన్నారు.

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్ గౌడ్,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డ్ నెంబర్లు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం.

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం.

హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు . స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి.ఉవ్వెత్తున ఎగసిపడుతున్నమంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది.

దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బందికి ఇబ్బందిగా మారింది. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరాదీస్తున్నారు. చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుంటున్నారు.

ఏపీ Vs తెలంగాణ : మంత్రుల మధ్య మాటల యుద్ధం.

ఏపీ Vs తెలంగాణ : మంత్రుల మధ్య మాటల యుద్ధం

మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఏపీలోకి తొంగి చూస్తే.. వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏంటో కనిపిస్తుందంటూ కారుమూరి వ్యాఖ్యానించారు. ఏపీలో రోడ్లు సరిగా లేవని మంత్రి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న ఆయన.. ఏపీ ప్రజలు మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు.

అంతకు ముందు మంత్రి హరీష్ రావు ఏపీ రాష్ట్రంపై, అక్కడి పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధితో పోల్చి విమర్శనాత్మక కామెంట్లు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని.. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. దాంతో పాటు ఏపీలో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితిని చెబుతూ… అక్కడి కంటే ఇక్కడ చాలా బెటర్ అని కితాబిచ్చారు. అంతే కాదు ఏపీలో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు మోటార్లకు మీటర్లు పెట్టి ప్రజలకు అన్యాయం చేస్తు్న్నారన్న తరహాలో ఆరోపణలు చేశారు.

నల్గొండ జిల్లా :నకిరేకల్..కొండేటి మల్లయ్య ఆధ్వర్యలో.యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరేణి సైదులు గౌడ్ జన్మదిన వేడుకలు.

కొండేటి మల్లయ్య ఆధ్వర్యలో.కక్కిరేణి సైదులు గౌడ్ జన్మదిన వేడుకలు.

కట్టంగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరేణి సైదులు గౌడ్ జన్మదిన వేడుకలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య,ఆధ్వర్యంలో. ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కొండేటి మల్లయ్య క్యాపు కార్యాలయంలో కక్కిరేణి సైదులు గౌడ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుండా జలంధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నంద్యాల అనంతరెడ్డి, పిన్నపురెడ్డి వెంకట్ రెడ్డి, చిలుముల సైదులు, దెందె శ్రీనివాస్, తేలు నాగారాజు, పిన్నపు రెడ్డి వేణు రెడ్డి, గంట సైదులు, తదితరులు పాల్గొన్నారు .