నల్గొండ జిల్లా :ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
వాడవాడలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడం లో ఘనంగా నిర్వహించారు. అదే విధంగా సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించరు. ముఖ్య అతిథిగా బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసి, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు. ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ మండల కార్యదర్శి,మేడి వాసుదేవ్, మండల కోశాధికారి పాల మహేష్,మేడి అశోక్,కత్తుల దాసు,మేడి రామలింగయ్య,మేడి గణేష్,దండు ప్రసాద్,నారపాక రాజు,సిరిపంగి దిలీప్,వడేపల్లి రాంబాబు,వడేపల్లి రవి,బుర్రి బాలస్వామి,మేడి హరికృష్ణ,నాగిళ్ళ సురేష్,కత్తుల విజయ్,వినోద్,చింటూ, బిఎస్పి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Apr 14 2023, 16:26