నల్గొండ జిల్లా. నకిరేకల్:అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని డా. బీ.ఆర్ అంబెడ్కర్ 132 వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశానికి శ్రేయస్కరమని భావించటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడికి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించిందని అన్నారు. దేశంలో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు.అంబేద్కర్ ఆశయాలకు రూపం కేసీఆర్ అని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాలకు బాబాసాహెబ్ మహోన్నత్వాన్ని చాటేలా ఏర్పాటు అని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర సెక్రటేరియట్‌కు పేరు.. చరిత్రకు సజీవ సాక్ష్యం అని ఆయన తెలిపారు. దళిత సంక్షేమంతోనే దేశాభివృద్ధి అని ఆయన అన్నారు.తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల సంక్షేమం అని ఆయన అన్నారు.దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. నేడు దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.బిఆర్‌ఎస్‌తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని అని ఆయన అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో తెలంగాణ దళిత బంధు పథకం అమలు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని ఆయన చెప్పారు. డా.బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్ గౌడ్,కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Apr 14 2023, 15:33