నల్గొండ జిల్లా :నకిరేకల్ :రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ మరియు నిమ్మ మార్కెట్, తాటికల్,చందంపల్లి మంగళపల్లి గ్రామాలలో పీఏసిఎస్, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి నేరుగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు.
ధాన్యంలో తేమశాతం 17 కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతులకు అన్ని సంక్షేమ పధకాలను అందిస్తూ రైతుల మన్నలను పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు.
రైతులు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు.
రైతుల సంక్షేమం కోసం సీఎం కెసిఆర్ ఎల్లవేళలా కృషి చేస్తున్నారని అన్నారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్ గౌడ్,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డ్ నెంబర్లు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Apr 14 2023, 11:26