పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం. కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.
పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం. కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే.
.
Streetbuzz news. నల్గొండ జిల్లా :
కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎం ఎస్ ఆర్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు 1 కోటి 54 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ మరియు 28 మందికి 10 లక్షల 50 వేల రూపాయల. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్, మన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం..అన్నారు.
పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ పథకం నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకం వెనక ఓ మానవీయకోణం దాగి ఉంది.
అన్ని వర్గాల ప్రజల ముఖంలో ఆనందం చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.
గత ప్రభుత్వాలు ఏనాడు పేదింటి ఆడబిడ్డల వివాహానికి డబ్బులు సహాయం చేయలేదు.
మహిళా సాధికారత మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది.
మన తెలంగాణ సర్కారుకు ఎల్లప్పుడూ మీ అందరి దీవెనలు ఉండాలి, ఆశీర్వాదం కావాలి అండగా నిలవాలి అన్నారు.
పేదల సంతోషమే కేసీఆర్ లక్ష్యం..అందరూ ఆత్మాభిమానంతో బ్రతకాలన్నదే వారి ఆకాంక్ష.
కేసీఆర్ ఈ రాష్ట్రమే తన కుటుంబం అన్న కోణంలో ఆలోచిస్తారు. అందుకే కళ్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్,రైతు బంధు, రైతు భీమా,దళిత బంధు,సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి పథకాలు వచ్చాయి.
అన్ని వర్గాల ప్రజలు సగౌరవంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం..
పేదింటి ఆడబిడ్డలకు అమ్మవడి, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, పథకం అమలు చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో.ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య,జడ్పీటీసీ తరాల బలరాం,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ్మ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు,పీ.ఏ.సి.ఎస్. నూక సైదులు,వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచ్లు, ఎంపిటిసిలు,వార్డ్ నెంబర్లు,మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Apr 13 2023, 16:29