బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్
బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.
వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు కేంద్రం నందు ఈరోజు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో జరిగిన ప్రమాద ఘటనపై వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ మాట్లాడుతూ..
ఈరోజు చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి,అధికార అహంకారంతో విచ్చలవిడిగా బాణాసంచా కాలుస్తూ, అక్కడ ఎవరున్నారు ఏంటి అని కూడా ఆలోచించకుండా కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, ఒకేసారి గందరగోళాని సృష్టించి బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె మీద పడి అందులోని గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు వ్యక్తుల కాలు తెగిపడడం, ఒకరి పొట్టలో నుండి పేగులు బయటికి రావడం మరియు మరికొందరికి తీవ్ర గాయాలు అవ్వడం అంటే చాలా చాలా బాధాకరం, ఈ ఘటనలో గాయపడిన బాధితులను తక్షణమే మెరుగైన వైద్యం అందించి అందుకు అయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని అలాగే ఈ సంఘటనపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో చీమలపాడు గ్రామాన్ని మాంసపు ముద్దలగా మార్చిన వారు ఎవరైనా సరే తక్షణమే రాజీనామా చేయాలని,అలాగే ఒక్కొక్క బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని,కుటుంబానికి ఒకరి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని,ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు వహించాలని వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ అన్నారు.
Apr 12 2023, 15:49