ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బుధవారం నాడు ఎమ్మెల్యే చిరుమర్తి చేతుల మీదుగా కేంద్రాల ప్రారంభం. సింగిల్ విండో చైర్మన్.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బుధవారం నాడు ఎమ్మెల్యే చిరుమర్తి చేతుల మీదుగా కేంద్రాల ప్రారంభం. సింగిల్ విండో చైర్మన్ నూక సైదులు
కట్టంగూర్,: రైతులు పండించిన ధాన్యాన్ని కచ్చితంగా మద్దతు ధరకు కొనుగోలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ సింగిల్ విండో చైర్మన్ నూక సైదులు కోరారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి మండలంలో పిఎసిఎస్, ఐకెపిలా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందవచ్చునన్నారు. అందువల్ల రైతులు దళారులను నమ్మి తక్కువ ధరలకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు రవాణా ఖర్చులను తగ్గించాలని లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించుకున్న రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరిపిస్తున్నారని చెప్పారు. మండలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. గ్రేడ్ వన్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2060 చొప్పున ధర చెల్లించనున్నట్లు అదే విధంగా కామన్ రకానికి రూ.2040 చెల్లిస్తామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన మూడు నాలుగు రోజుల్లోనే చెల్లింపులు చేస్తామన్నారు. బుధవారం ఐటిపాముల కట్టంగూర్ , కలిమెరా, ఈదులూరు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించనున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విలేకరుల సమావేశంలో సీఈవో మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Apr 11 2023, 21:51