madagoni surendar

Apr 11 2023, 21:46

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బుధవారం నాడు ఎమ్మెల్యే చిరుమర్తి చేతుల మీదుగా కేంద్రాల ప్రారంభం. సింగిల్ విండో చైర్మన్.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. బుధవారం నాడు ఎమ్మెల్యే చిరుమర్తి చేతుల మీదుగా కేంద్రాల ప్రారంభం. సింగిల్ విండో చైర్మన్ నూక సైదులు

కట్టంగూర్,: రైతులు పండించిన ధాన్యాన్ని కచ్చితంగా మద్దతు ధరకు కొనుగోలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ సింగిల్ విండో చైర్మన్ నూక సైదులు కోరారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి మండలంలో పిఎసిఎస్, ఐకెపిలా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందవచ్చునన్నారు. అందువల్ల రైతులు దళారులను నమ్మి తక్కువ ధరలకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు రవాణా ఖర్చులను తగ్గించాలని లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించుకున్న రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరిపిస్తున్నారని చెప్పారు. మండలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. గ్రేడ్ వన్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2060 చొప్పున ధర చెల్లించనున్నట్లు అదే విధంగా కామన్ రకానికి రూ.2040 చెల్లిస్తామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన మూడు నాలుగు రోజుల్లోనే చెల్లింపులు చేస్తామన్నారు. బుధవారం ఐటిపాముల కట్టంగూర్ , కలిమెరా, ఈదులూరు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించనున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విలేకరుల సమావేశంలో సీఈవో మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 11 2023, 17:16

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య *

నకిరేకల్ పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పులా మాల వేసి అయన ఆశయాలను స్మరించుకొని జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనంతరం మహాత్మా జ్యోతి రావు పూలె విగ్రహానికి శంకుస్థాన చేశారు.ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.....అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని ఆయన అన్నారు.

కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు.

మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని ఆయన కొనియాడారు.

సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.జీవితాంతం అసమానతలపై పోరాడిన ఆదర్శమూర్తి మహాత్మా జ్యోతిబాపులే అని ఆయన అన్నారు.పూలే ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారని స్పష్టం చేసారు. బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్ర‌భుత్వం అమలు చేస్తుందనీ ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,నకిరేకల్ జడ్పీటీసీ మాధ ధనలక్ష్మినాగేష్, కౌన్సిలర్లు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 11 2023, 16:50

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జ్యోతరావు పూలే : ప్రియదర్శిని మేడి

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జ్యోతరావు పూలే : ప్రియదర్శిని మేడి

భారతీయ సామాజిక కార్యకర్త, కుల రహిత సమాజానికి కృషి చేసిన సంఘ సంస్కర్తగా, తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మ‌హాత్మా జ్యోతరావు పూలే అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. నకిరేకల్ సెంటర్ లో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చదువు అందరికీ ఎంతో అవసరమని స్వతహాగా పాఠశాలను ప్రారంభించిన ఆదర్శ ప్రాయుడన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడుగా సమాజ అభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో విద్య ఎంతో అవసరమని మహిళల విద్య పట్ల ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తిగా పేరుగాంచారని కొనియాడారు. స్వార్థం కోసం కాకుండా లాభాపేక్ష లేకుండా భారత దేశంలో సేవ చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన మనందరికీ ఆదర్శ ప్రాయుడన్నారు. చదువు అందరికీ ఎంతో అవసరమని స్వతహాగా పాఠశాలను ప్రారంభించిన ఆదర్శ ప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి విజయ్, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, కేతాఫల్లి మహిళా కన్వీనర్ శృతి, మండల బివిఎఫ్ కన్వీనర్ శివ, సినియర్ నాయకులు గ్యార శేఖర్, నితిన్, వినయ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Apr 10 2023, 17:22

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

నకిరేకల్ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులకు సూచించారు రూ.32 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి పరిశీలించారు గడువు లోపు పనులు నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 07 2023, 20:21

ఏపీలో విస్తృతంగా కోవిడ్‌ పరీక్షలు.గత రెండు వారాల్లో 15,096 మందికి పరీక్షలు

ఏపీలో విస్తృతంగా కోవిడ్‌ పరీక్షలు

గత రెండు వారాల్లో 15,096 మందికి పరీక్షలు

ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు

కరోనాపై పూర్తి అప్రమత్తంగా ఏపీ

ఆక్సిజన్‌ ప్లాంట్లు, పీహెచ్‌సీలకు కేంద్రం నిధులివ్వాలి

కేంద్ర మంత్రికి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి

గుంటూరు, : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని, గత రెండువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,096 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే, ఇందులో 267 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఇంటి వద్దే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు పొందుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా పరీక్షల వి

యంలో నిరంతరం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నారని మంత్రి రజిని పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మరో 20 లక్షల బూస్టర్‌ డోసులను కేంద్రం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్‌ ప్లాంట్లు, పీహెచ్‌సీల నిర్వహణ తదితర అవసరాలకు అయ్యే మొత్తాన్ని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ భరించాలని మంత్రి రజిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తమ రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితులు, కేంద్రం పరంగా అందించాల్సిన వైద్య అవసరాల గురించి కేంద్ర మంత్రి డాక్టర్‌ మాండవీయకు పలు విజ్ఞప్తులు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మాండవీయతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పర్వీన్‌ పవార్‌ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున మంత్రి రజినితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ నివాస్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

madagoni surendar

Apr 07 2023, 20:16

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

.

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పవిత్రరంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని మజీద్ లో నిర్వహించిన దావత్- ఏ- ఇఫ్తార్ విందుకు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి ముఖ్య అతిధిగా హాజరై ముస్లిం సోదరులతో కలసి విందును ఆరగించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

madagoni surendar

Apr 07 2023, 18:31

ఏపీ::మహా ఘనుడు... నిత్యపెళ్లి కొడుకు బట్టబయలు... మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన విధానం ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మహా ఘనుడు... నిత్యపెళ్లి కొడుకు బట్టబయలు...

మ్యాట్రిమోనియల్ సైట్స్ లో 12 మంది మహిళలను మోసం చేసిన విధానం ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.....

రోజు రోజుకి నిత్యపెళ్ళికొడుకుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి... మొన్న నలుగురు ని ఒకరికి ఒకరు తెలియకుండా పెళ్లి చేసుకొని మొహం చాటేసి వ్యవహారం నడిపిస్తున్న NRI నిత్యపెళ్ళికొడుకు విషయం అందరికి తెలిసిందే. మీడియా లో ఎన్ని కధనాలు వచ్చినా పోలీసులు కు అమ్యామ్యాలు సమర్పించి NRI పారిపోయిన వ్యక్తి సంఘటన పక్కన పెడితే...

జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ను వినియోగించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఆ సైట్స్ లో రెండో వివాహం కోసం దరఖాస్తు చేసున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఐడీ కార్టులు సృష్టించి ఓ వ్యక్తి చేసిన మోసం కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన డక్కుమళ్ల సుదర్శన రావు అలియస్ పవన్ కుమార్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. 2012లోనే అతను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అయితే అతనికి మొదటి నుండి లైంగిక కోరికలు ఎక్కువ. కోర్కెలు తీర్చుకోవటం కోసం మహిళల కోసం వెదకటం మొదలు పెట్టాడు. అయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకోవడం సులభమని గ్రహించి అప్పటి నుండి షాదీ.కామ్ లో రిజిష్టర్ చేయించుకున్నాడు. ఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకొన్న ద్వితీయ వివాహం మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన మహిళతో అదే విధంగా పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అప్పు కావాలంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు. లైగింక కోరికలు తీర్చమని వేధించాడు. అయితే అనుమానం వచ్చిన ఆ మహిళ అతడ్ని నిలదీసింది. ఎక్కువగా మహిళలతో మాట్లాడుతుండటాన్ని కూడా గమనించింది. అయితే ఆమె వాట్సప్ ను వాట్సప్ వెబ్ ద్వారా స్కాన్ చేసుకొని వారిద్దరూ ఏకంతంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలను, చాట్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో సదరు మహిళ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. దీంతో మొత్తం బండారం బయటపడింది. ఆర్మిలో మేజర్ స్తాయిలో ఉన్నట్లు నకిలి ఐడెంటీటీ కార్డులు స్రష్టించి మహిళలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అనేక మంది మహిళలతోనూ టచ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆర్మి మేజర్ స్థాయిలో ఉన్నాడని నమ్మించడానికి ఆర్మీ డిపెండెంట్ కార్డులను మహిళలకు తానే జారీ చేసేవాడు. అవన్నీ నకిలేవని పోలీసులు గుర్తించారు. దాదాపు 12 మంది అమాయక మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవడం వారిని లైంగికంగా వాడుకోవడం లాంటి పనులు చేస్తున్నాడని దిశ సిఐ నరేష్ కుమార్ తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నకిలీ ఐడెంటిటి కార్డులు, డిపెండెంట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

madagoni surendar

Apr 07 2023, 18:08

పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం.

పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం

జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గాను సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కోర్టు విధించిన జరిమానాలను కట్టలేని, బెయిల్ ఫీజును కట్టలేని పేద ఖైదీలకు కోసం పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపింది. సరైన చదువు లేక, అతి తక్కువ ఆదాయం ఉన్న ఖైదీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పింది. సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల కోర్టుకు జరిమానాలు కట్టలేని ఎంతో మంది పేద ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని... అలాంటి వారికి ఈ పథకం ఎంతో సాయపడుతుందని తెలిపింది. దీనికోసం ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిజమైన పేద ఖైదీలను గుర్తించడం సులభతరం అవుతుందని తెలిపింది.

madagoni surendar

Apr 07 2023, 18:03

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..

కరోనా కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను పెంచడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పౌరుల్లో అనవసర భయాందోళనలు కలిగించవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు..

ఈ సమావేశంలో కోవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్ర మంత్రి చర్చించారు. సూచించిన కోవిడ్ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించాలని, వాటిని పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఏప్రిల్ 10, 11వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు..

madagoni surendar

Apr 07 2023, 17:48

నల్గొండ జిల్లా :ఈతకు వెళ్లి యూవకుడు మృతి.

ఈతకు వెళ్లి యూవకుడు మృతి.

ఈతకు వెళ్లి యూవకుడు మృతి చెందిన సంఘటన. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామం లో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ గ్రామనకి చెందిన అనిల్ (19) శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ని బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందరు. దీంతో గ్రామం లో విషాదచాయాలు అలుముకున్నాయి. దీనికి సమాందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.