వినియోగదారుడా మేలుకో నీ హక్కులు తెలుసుకో: వినియోదారుల హక్కుల జోనల్ కార్యదర్శి ఎం డి సాధిక్ పాష

వినియోగదారుడా మేలుకో

నీ హక్కులు తెలుసుకో

తేదీ: 15/03/2023 నాడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మరియు వినియోగదారుల హక్కుల జోనల్ కార్యదర్శి శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిదీ కల్తీ జరుగుతున్న నేపధ్యంలో వినియోగదారుడు చాలా అప్రమత్తంగా ఉండాలని వస్తువు కొనే ముందు తయారీ తేదీ మరియు గడువు తేదీ, నాణ్యత చూసి కొనాలని కొన్న ప్రతి వస్తువుకు తప్పని సరిగా బిల్లు తీసుకోవటం మరిపోవద్దని వస్తువు యొక్క నాణ్యత విషయంలో లోపం ఉంటే వ్యాపారిని నిలదీసే హక్కును వినియోగదారుల హక్కుల చట్టం వినియోగదారునికి కల్పించిందని ఒకవేళ వినియోగదారుడు నష్ట పరిహారం కోరుకుంటే జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ ను సంప్రదించి స్వయంగా కేసు వేసి తన కేసును తానే వాదించుకునే అవకాశం వినియోగదారునికి ఉన్నది కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి వినియోగదారుల హక్కుల చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాలని అలాగే ప్రభుత్వం మరియు వినియోగదారుల సంఘాలు కూడా తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, డి.ఎస్.ఓ,జిల్లా వినియోగదారుల హక్కుల కమీషన్ చైర్మన్, లీగల్ మెట్రాలజి,ఆర్.టి.ఏ. మరియు వివిధ శాఖ అధికారులు పలు వినియోగదారుల సంఘాలు పాల్గొన్నాయి.

_తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు....

మనోలేఖ న్యూస్

వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్ పి. జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, , ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ వీడియో నెంబర్ 83/2023 కింద కేసు నమోదు అయింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనెంబర్ 181లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం మాజీ తాసిల్దార్ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ , ఈఐపిల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అందజేశారు.

ఈ విషయమై దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం సిఐ మధుసూదన్ సెక్షన్ 420, 166 కింద తాసిల్దార్ జ్యోతి సబ్ రిజిస్టర్ ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు తో పాటు తెలంగాణ హైకోర్టు WP37146/2022 ద్వారా విచారణ కూడా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉండగా భూముల విషయమై సాక్షాత్తు తాసిల్దార్ పై కేసు నమోదు కావడం తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. మహేశ్వరం పోలీసులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.

భూవాదాలు కోర్టులో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాసిల్దార్ మహ్మద్ అలీ మాట్లాడుతూ. నాగారం లోని సర్వే నెంబర్ 181 విషయం తమ దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు

జిల్లా పోలీస్ షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన 3.2 K రన్ లో మొదటి 4 బహుమతులు సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుల

జిల్లా పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన 3.2 K రన్ లో మొదటి 4 బహుమతులు సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు

ఈరోజు ఉదయం 6 గంటలకు నల్గొండ జిల్లా SP అపూర్వరావు గారి ఆధ్వర్యంలో జిల్లా షీ టీమ్ పర్యవేక్షణలో నిర్వహించిన 3.2 కె రన్ లో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు బాలికల విభాగంలో మద్ది కీర్తన (1st ప్రైజ్) కురిమిల్ల అరుణ జ్యోతి (2nd ప్రైజ్) బాలుర విభాగంలో కురిమిల్ల ఆదిత్య (1st ప్రైజ్) కమ్మంపాటి ధనుష్ (2ndప్రైజ్) సాధించి జిల్లా ఎస్పీ అపూర్వరావు గారి ద్వారా బహుమతులు మెమొంటోలు అందుకున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. వీరు 4గురు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ సారధ్యంలో గత 2 సంవత్సరాలుగా నిరంతరం క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అనంతరం 5గురు సాంఘిక సంక్షేమ శాఖ A-1 క్రీడాకారులకు SP గారి చేతుల మీదుగా ఫుట్బాల్ షూస్ స్టాకింగ్స్ అందజేయడం జరిగింది.

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నకిరేకల్ మండల కేంద్రంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో పద్మశాలి భవనంలో ఆశ వర్కర్లకి శాలువాతో సన్మానం, కేక్ కట్ చేసి ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రియదర్శిని మేడి, డాక్టర్ స్నేహలత గార్లు హాజరై వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మునిసిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలన్నారు.పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, కేతాపల్లి మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి, ఆశ వర్కర్ల జిల్లాఅధ్యక్షురాలు సింగం రేణుక, మండల అధ్యక్షురాలు ఎస్కే సుల్తాన్, నకిరేకల్ మండల అధ్యక్షులు శెట్టిపల్లి శంకర్ కేతపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ వివిధ గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....

నల్గొండ జిల్లా చండూర్ మండలం శిర్ధేపల్లి గ్రామానికి చెందిన గంట గీత తండ్రి:నగేష్,నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది.చిన్నప్పటినుంచి చదువుతో పాటు ఆటల్లోనూ మంచి ప్రతిభ కనబర్చుతూ ఉండేది.ఇటీవల యూత్ ఫెడరేషన్ డెవలప్ గేమ్స్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ తరుపున వివిధ రాష్ట్రల జట్టులతో తలపడి ఉత్తమ ప్రతిమ కనబర్చింది.దీంతో భారత దేశం తరుపున ఏప్రిల్ 6 నుంచి నేపాల్ లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన,ఈ అమ్మాయిది నిరుపేద కుటుంభం,వారి తల్లిదండ్రులు రోజువారి కూలీ పనులు జీవనం సాగిస్తున్నారు.నేపాల్ లో జరిగే కబడ్డీ పోటీలకు తన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా వెళ్లలేనేమో అని నిరాశతో ఉన్న విషయాన్నీ తెలుసుకున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ గారు స్పందించి 15,000/- రూపాయల ఆర్ధిక సహాయాన్ని తమ ఫౌండేషన్ సభ్యులైన శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి గారి ద్వారా కుటుంభానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గంట రాము గారు ,శ్రీ మారగోని శ్రవణ్ కుమార్ గారు,శ్రీ పేసర్ల హరీష్ గారు,శ్రీ కారింగు సాయి కుమార్ గారు,శ్రీ కనగాని లింగయ్య గారు,శ్రీ గంట రమేష్ గారు,తదితరులు పాల్గొన్నారు.

ఇదో దివ్యాంగుడి ముంపు గోస

వీరి దీనస్థితిగతులపై 'ఈనాడు' గత ఏడాది జులై 20న 'ఇదో దివ్యాంగుడి ముంపు గోస' పేరిట కథనాన్ని ప్రచురించింది. ఇతను శాశ్వత పరిష్కారం కోసం రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. సోమవారం జిల్లా సమీకృత ప్రాంగణానికి అతడి తల్లితో సహా వచ్చి మరోసారి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లక్ష్మీనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మంథని ఆర్డీవో వీరబ్రహ్మేంద్రచారికి ఫోన్‌ చేసి రెండు పడక గదుల ఇల్లు మంజూరుకు అర్హతలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదే విషయాన్ని మంథని ఆర్డీవోతో 'ఈనాడు' ప్రస్తావించగా.. అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మహేశ్‌ కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సమగ్రంగా పరిశీలించి అర్హుడా? కాదా? అనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

35 ఏళ్ల మహేశ్‌.. కండరాల క్షీణత (మాస్క్యులర్‌ డిస్ట్రోఫీ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని చిన్నపిల్లాడిలా సాకుతున్న తల్లి మల్లమ్మకు వితంతు పింఛను, మహేశ్‌కు దివ్యాంగుల పింఛనే ప్రధాన ఆదాయం. దరఖాస్తు చేసుకోవడానికి బెస్తపల్లి నుంచి ఆటోలో ప్రజావాణికి వచ్చిన ప్రతిసారి రానుపోనూ రూ.1,000 ఖర్చవుతున్నాయని, అయినా రోజుల తరబడి తమ ఇల్లు సమస్య పరిష్కారం కావడం లేదని మహేశ్‌ వాపోయారు.

పిల్లలను సక్రమంగా పేంచే బాధ్యత తల్లిదండ్రులదే గుడ్ పేరెంట్టింగు కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి

పిల్లలను సక్రమంగా పేంచే బాధ్యత తల్లిదండ్రులదే

- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

మన తెలంగాణ/ సూర్యాపేట ప్రతినిధి :

పిల్లల సక్రమంగా పెంచి భవిష్యత్తు విషయంలో జరిగే మంచి చెడులకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆవరణలో గుడ్ పేరెంట్టింగు ( పిల్లలను ఎలా పెంచాలి) అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు తమ తల్లిదండ్రులై హీరోలన్నారు. వారిని చూసే పిల్లలు ముందుకు సాగుతారని తెలిపారు. నేటి తరం పిల్లలు యువత సమాజంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. జీవితం యొక్క అర్థం తెలిసేలా పిల్లలను తల్లిదండ్రులు పెంచాలని సూచించారు. లక్ష సాధుని లక్ష్యంగా ఎన్ని వంతురాలు ఎదురైనా ముందుకు సాగేలా పిల్లల్లో స్ఫూర్తి నింపాలని అన్నారు. చిత్తశుద్ధి లక్ష్యసాధనతో ముందుకు సాగితే ఎంతటి కష్టతరమైన పనిని కూడా పూర్తి చేయవచ్చు అన్నారు.అంతకుముందు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఐఏఎస్, ఐపిఎస్ శిక్షకుడు రాఘవేంద్ర సదస్సుకు హాజరైన తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట చైర్ పర్సన్ అన్నపూర్ణ, పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీటిసి జీడి బిక్షo, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నల్గొండ 17వ వార్డులో శ్రీ మల్లన్న కేతమ్మ శివలింగం విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణం లో పాల్గొని భారీ విరాళం ప్రకటించిన మున్సిపల్ చైర్మన్

నలగొండ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లో శ్రీ మల్లన్న కేతమ్మ శివలింగం విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణం ఘనంగాా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి గారుు గుడికిి విరాళంగా రెండుుు లక్షల రూపాయలుు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలుు, కార్యకర్తలు అత్యధికంగాా పాల్గొన్నారు.

అవినీతి పాల్పడిన DBCDOను తక్షణమే సస్పెండ్ చేయాలి:SFI

నల్లగొండ జిల్లా బిసి సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి పాల్పడిన DBCDOను తక్షణమే సస్పెండ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి‌ SFI వినతి . ఈకార్యక్రమంలో SFIజిల్లా‌ అధ్యక్షా కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ కోర్ర సైదా నాయక్ లక్ష్మణ్ బుడిగ వేంకటేష్ కొరె రమేష్ ‌రవిందర్ గోపి తదితరులు పాల్గొన్నారు

పెరిగిన గ్యాస్ ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి

పెరిగిన గ్యాస్ ధరల పై బి ఆర్ యస్ యుద్ద భేరి

2 న మండల కేంద్రాలలో...3 న నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు,నిరసన ప్రదర్శనలు

బి ఆర్ యస్ శ్రేణులు,మహిళలను సన్నద్ధం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

టేలికాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు

పెరిగిన వంట గ్యాస్ ధరలపై బి ఆర్ యస్ పార్టీ యుద్ధభేరి మ్రోగించింది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు,నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపు నిచ్చింది.ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను,బి ఆర్ యస్ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.పార్టీ పిలుపు మేరకు ఈ నెల 2 న అంటే గురువారం ఉదయం మండల కేంద్రాలలో ధర్నాలు ,ఆ మరుసటి రోజు ఉదయం అంటే మార్చి 3 న నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. అటు నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఇటు మండల కేంద్రాలలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో బి ఆర్ యస్ శ్రేణులతో పాటు మహిళలు అధికంగా పాల్గొనేలా చూడాలి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.