Delhi Liquor Scam Case : ముగిసిన కవిత ఈడీ విచారణ.. ఎనిమిది గంటలుగా ఏమేం ప్రశ్నించారు..!?
ఏమేం ప్రశ్నించారు..!?
1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?
2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో (Manish Sisodia) పరిచయం ఎలా ఏర్పడింది..!?
3. ఢిల్లీ గవర్నమెంట్‌కు (Delhi Govt)- సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?
4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?
5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?
6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?
7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?
8. పిళ్లైకు.. మీకు (కవితకు) మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?
9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా..?
10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి..?
11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?
12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?
13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?
14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?
15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?
16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?
17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?
18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్ఫోన్లు ధ్వంసం చేశారా..?
19. సెల్ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?
20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..? అని కవితను ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..
Mar 13 2023, 11:32