కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
•బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు అన్నారు.
పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని పేదల ఆరోగ్య ఉచిత వైద్య చికిత్సల కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ప్రారంభించారు.
గ్రామంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించాలని ఈ యొక్క సదా అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక ఉద్యమంలా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా అహర్నిశలు కృషి చేయాలని పేద ప్రజల జీవన అభివృద్ధి కోసం మనందరం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి శక్తి కేంద్రo ఇంచార్జ్ అంతటి వెంకటేష్ గౌడ్ బూత్ కమిటీ అధ్యక్షుడు బత్తుల వెంకన్న గౌడ్, నాగేంద్ర చారి, శ్రీనివాస్, మహేష్, బత్తుల అనిల్ గౌడ్, ఈదుల పవన్, వెంకటేష్,నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Mar 05 2023, 09:22